For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : రఘురాం ఫ్యామిలీ సేఫ్.. కిషోర్ మీద నాని మర్డర్ అటెంప్ట్.. లక్ష్మణ్ కి షాక్?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలా ఈ సీరియల్ ఈ రోజుతో 674వ ఎపిసోడ్ కి చేరింది. శిల్ప తన తల్లి దుర్మార్గాలు తెలుసుకుని మారిపోగా కట్టాల్సిన 25 లక్షల డబ్బు జాతరకు తెచ్చి డబ్బు ఇవ్వడం కోసం జాతరకు పాతిక లక్షల రూపాయల బ్యాగ్ తీసుకు వెళితే అక్కడ జనార్ధన్ అలాగే శిల్ప అన్న కిషోర్ ఇద్దరూ కలిసి ఒక మనిషి చేత బ్యాగ్ దొంగతనం చేస్తారు.

  ఆ బ్యాగ్ దొంగతనం జరిగిన తర్వాత శిల్పా సహా కుటుంబం అంత టెన్షన్ పడుతూ ఉంటే అది చూసి కిషోర్ అలాగే జనార్ధన్ ఇద్దరూ కూడా ఆనంద పడుతూ ఉంటారు. ఇక సీతా, సిరి, శైలు డబ్బు వెతకడం కోసం వెళ్లారు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈ రోజు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar

  బ్యాగు దొరికేసింది

  బ్యాగు దొరికేసింది

  డబ్బు వెతకడం కోసం వెళ్లిన సీతా, సిరి, శైలు వెతుకుతూ ఉన్న సమయంలో కిషోర్ కనబడతాడు.. కిషోర్ అప్పటికే దొంగతనం చేస్తున్నాను అనే భావనలో ఉండడంతో కనిపించిన సీత, శైలు, సిరి ముగ్గురు అతనికి అమ్మవారి స్వరూపాలు లాగా కనపడతారు. వాళ్లను చూసి బెదిరిపోయి జనార్ధన్ ప్రోద్బలంతోనే ఈ డబ్బు దాచాను. నన్ను క్షమించండి అంటూ ఆ డబ్బు అక్కడే వదిలేసి పారిపోతాడు.

  డబ్బు ఏం చేయాలో తెలియక విగ్రహం వెనుక వైపు నుంచి సీత, శైలు, సిరి రాళ్ల బ్యాగ్ ని తీసేసి ఆ ప్రదేశంలో ఈ డబ్బులు ఉన్న బ్యాగ్ లో పెడతారు. ఇది తెలియక ఇబ్బంది పడుతున్న రఘురాం ముందే బ్యాగ్ లో డబ్బు పూజ చేయాలి అంటూ అమరేశ్వర్ బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. అయితే అందులో డబ్బు ఉండటంతో అసలు ఏం జరుగుతుంది అనే విషయం కాసేపు రఘురామ అలాగే ఇతర కుటుంబ సభ్యులకు అర్థం కాదు.

  పాపం జనార్దన్

  పాపం జనార్దన్


  పక్కనే ఉన్న సీత అది మేము చేసాము కంగారు పడవద్దు అని చెప్పడంతో రఘు రామ్ ముందు ఊపిరి పీల్చుకుంటారు. అయితే రఘురాం కుటుంబం అవమానం పాలవుతుంది అని ఆశించిన జనార్దన్ అక్కడ డబ్బులు కనబడటంతో ఇక నేను ఉండి ఉపయోగం లేదు అని వెళ్ళిపోబోతాడు. ఆ సమయంలో అమరేశ్వర్ అడ్డుపడి ఇప్పటి దాకా ఉండి హారతి ఇచ్చే ముందు వెళ్తే అమ్మ వారికి కోపం వస్తుంది ఆ తంతు కూడా పూర్తయ్యాక వెళ్ళమని చెబుతాడు..

   అసలు జరిగింది ఇదే

  అసలు జరిగింది ఇదే


  సరేనని జనార్ధన్ అక్కడే ఉంటాడు ఈ లోపు అమ్మవారి హారతి తదితర వ్యవహారాలు పూర్తయ్యాక సీత, శైలు, సిరి ముగ్గురుని వారి వారి భర్తలు అడ్డగించి అసలు ఏం జరిగిందో చెప్పండి మాకు టెన్షన్ తగ్గడం లేదు అనడంతో జరిగిన విషయం అంతా చెప్పుకు వస్తారు. సీత తనకు జాతరలో కిషోర్ ని ఎక్కడో చూసినట్లు అనిపించింది అని అతను దీని వెనక ఉన్నాడు అనే ఉద్దేశంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్దామని, అతనే ఈ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది. అలాగే ఈ వ్యవహారం వెనుక శైలు తండ్రి జనార్ధన్ హస్తం కూడా ఉందనే విషయాన్ని కూడా వెల్లడించినట్లు పేర్కొన్నారు..

  ఇంట్లో దూరిన కిషోర్

  ఇంట్లో దూరిన కిషోర్

  ఇక తన తండ్రి హస్తం ఉందని తెలియడంతో బాధపడిన శైలు అందరి ముందు క్షమాపణలు అడగడమే కాక తండ్రి వద్దకు వెళ్లి ఇక నీకు నాకు బంధం తెగిపోయింది, ఇలా నువ్వు చేయడం మొదటి సారి కాదు నీ మనసు మార్చి మనలని కలిపేలా చేయమని అమ్మవారిని కోరుకుంటూ ఉంటాను కానీ నువ్వు మాత్రం మారడం లేదు ఇక ఇదే చివరి రోజు కావాలి ఇకమీదట మాట్లాడుకోవద్దు అంటుంది. ఇలా జరుగుతున్న సమయాన అక్కడ నాని కనిపించడం లేదని గుర్తిస్తారు. ఎక్కడికి వెళ్ళాడు అని టెన్షన్ పడుతుంటే శిల్ప వచ్చి కిషోర్ అంతు చూస్తానంటూ పరిగెత్తుకుని మా ఇంటికి వెళ్ళాడు అని చెప్పడంతో మళ్లీ కుటుంబం అంతా కలిసి ఇంటికి వెళతారు. అప్పటికే వెళ్లి భయంతో ముసుగు తన్ని పడుకుని నిద్ర పోతున్న కిషోర్ మెడపట్టి బయటకు లాక్కుని వస్తాడు నాని.

  Recommended Video

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  నాని మర్డర్ ఎటాక్

  నాని మర్డర్ ఎటాక్

  బయటకు లాక్కొని రావడమే కాక ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా పాతిక లక్షల రూపాయల దొంగతనం చేస్తావు అంటూ అతన్ని హాల్లోకి తెస్తాడు. అతని అరుపులు విని దమయంతి, దమయంతి భర్త అందరూ మేల్కొనే అక్కడికి వస్తారు. అసలు ఏం జరిగింది అనే విషయం నాని కిషోర్ తప్ప మిగతా ఎవరికీ అర్థం కాలేదు. వివాదం ముదిరి నాని ఒక కత్తి తీసుకుని వచ్చి పొడవబోతుండగా అప్పుడే ఎంట్రీ ఇచ్చిన సీత అరుపుకు ఆగుతాడు.

  ఎందుకు అలా చేస్తున్నావ్ అంటే వీడు మన ఇంటి పరువు తీయబోయాడు అంటాడు. వాడు తీయబోయాడు సరే దాని నుంచి బయట పడ్డాము వాడిని చంపి జైలు కి వెళ్తే అప్పుడు మన కుటుంబం పరువు నిలబడుతుందా కాస్త ఆలోచించు అని అంటుంది.

  ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు ఇక కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఇప్పటికే లక్ష్మణ్ డిగ్రీ పరీక్షలు ఓపెన్ గా రాస్తున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే సమయం అయింది అని కంగారు పడుతూ ఉంటాడు కానీ అనూహ్యంగా రిజల్ట్స్ లో కూడా బోల్తా పడుతున్నట్టు చూపించారు.

  English summary
  Shailu lashes out at Janardhan after learning about his alliance with Kishore. Elsewhere, tensions increase at Dhamayanthi's place as Nani attacks Kishore.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X