twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vadinamma : భరత్ పాస్ కాలేదనుకుంటే ఏకంగా జిల్లా ఫస్ట్.. మీడియా వచ్చిపడడంతో షాక్.. పార్వతి కొత్త టెన్షన్!

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలా ఈ సీరియల్ ఈ రోజుతో 676వ ఎపిసోడ్ కి చేరింది. భరత్ రాసిన పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ దగ్గరకు రావడంతో భరత్, సిరి రిజల్ట్స్ వెతకడం కోసం బయలుదేర సీత రావడంతో ఆ హాల్ టికెట్ కింద పడిపోతుంది. కాసేపు అలా అలా మేనేజ్ చేసిన తర్వాత ఆ హాల్ టికెట్ తీసుకుని పరీక్ష ఫలితాలు వెలువడుతున్న సమయానికి పేపర్ సంపాదించడం కోసం బయట వెళతారు. ఈ పరీక్షలో భరత్ పాస్ అవ్వలేదు అన్నట్లుగా గత ఎపిసోడ్ లో చూపించారు. మరి చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

    Photos Courtesy: Star MAA and Disney+Hotstar

    యాక్సిడెంట్ కావడంతో

    యాక్సిడెంట్ కావడంతో

    ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ప్రకారం పరీక్ష ఫలితాల కోసం న్యూస్ పేపర్ తెచ్చుకునేందుకు షాప్ కి వెళ్లగా న్యూస్ పేపర్ లు తీసుకువస్తూ వాహనానికి యాక్సిడెంట్ కావడంతో ఇప్పట్లో పేపర్ రాదని షాప్ యజమాని చెబుతారు. అయితే భరత్ మాత్రం లోలోపల భయపడుతూ ఉంటాడు.

    తనకు కచ్చితంగా ఈ పరీక్షలో పాస్ అవుతానని నమ్ముతాడు కానీ భార్య పక్కనే ఉండడంతో ఏమైనా పొరపాటున తేడాగా ఫలితాలు వస్తే పరువు పోతుందేమో అనే ఉద్దేశంతో భయపడుతూ ఉంటాడు. అదే టెన్షన్ గా ఉండి, టీ తాగుతావా అని సిరి భర్తని అడిగితే టీ తాగుదాం అని అంటాడు. అయితే ఇక్కడే తాగుదామంటే లేదు ఇంటికి వెళ్లి తాగుదామని సిరి ఆట పట్టిస్తుంది.

    చదువురాని మొద్దు

    చదువురాని మొద్దు

    లేదులే ఇక్కడే తాగుదామని చెప్పిన భారత్ టీ తాగుతారు. టీ తాగిన కొద్ది సేపటికే ఈ పేపర్ వస్తుంది. పేపర్ వచ్చాక హాల్ టికెట్ నెంబర్ తో వెతుకుతూ ఉంటే ఎంత సేపటికి నెంబర్ కనిపించదు. ఫస్ట్ క్లాస్ లో ఎక్కడా నీ నెంబర్ కనిపించడం లేదని అంటే ఫస్ట్ క్లాస్ లో కాదు పాస్ అయిన వారి లిస్టులో ఉంటుందేమోనని వెతకగా అక్కడ కూడా నెంబర్ కనిపించదు.

    అయితే తాను ఇంకా పాస్ కాలేదు అనే ఉద్దేశంతో భరత్ బాధలో మునిగిపోతాడు ఇప్పటిదాకా నేను చదువుకోని మొద్దు అనుకునేవారు గానీ ఇకమీదట తనను చదువురాని మొద్దుగా ముద్ర వేస్తారు అని బాధపడతాడు. అయితే భార్య మాత్రం అతనిని ప్రోత్సహించడానికి ఈసారి కాకపోతే వచ్చే సారి గట్టిగా కష్టపడితే కచ్చితంగా పాస్ అవుతారు అని అంటుంది.

    బాధలో

    బాధలో

    లేదని తాను ఇంకా పరీక్షలు రాయాలనుకోవడం లేదని ఇవాల్టి నుంచి పుస్తకాలు కూడా పట్టుకోనని భరత్ అంటాడు. అదే బాధతో వాళ్ళిద్దరూ ఇంటికి వెను తిరుగుతారు అయితే మరోపక్క భారత్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున రిపోర్టర్లు చేరుకుంటారు. ఎలా అయినా భరత్ తో కల్పించాలని మేము భరత్ తో మాట్లాడుకుంటామని చెబుతుండడంతో భరత్ ఏమైనా చేయకూడని పని చేసాడో ఏమో అనే ఉద్దేశంతో రఘురాం భయపడుతూ ఉంటారు.

    చాలాసార్లు రిపోర్టర్లతో అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు మాత్రం నోరు విప్పరు, భరత్ వస్తే కానీ మేము ఏమీ మాట్లాడము అంటూ ఉంటారు. అది కొద్ది సేపటికి భరత్, సిరి ఇద్దరు నడుచుకుంటూ లోపలికి వస్తారు, ఇది చూసిన రఘురాం భరత్ ను అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని సైగలు చేస్తూ ఉంటాడు అయితే ఇంతలో దగ్గరకు వచ్చేశాక ఇతనే భరత్ అని లక్ష్మణ్ పరిచయం చేస్తాడు.

    జిల్లా ఫస్ట్

    జిల్లా ఫస్ట్

    అప్పుడు రిపోర్టర్లు భరత్ నీకు ఇంటర్ జిల్లా మొదటి స్థాయిలో మార్కులు వచ్చాయి అని చెబుతారు. ముందు ఆశ్చర్యపోయినా సిరి హాల్ టికెట్ నెంబర్ సరి చూస్తే అది నిజమేనని తేలుతుంది. ఒక నెంబర్ తప్పు రాసుకుని అదే వెతుకుతూ భరత్ ఫెయిల్ అయ్యాడు అనే భయంతో ఉంటారు. ఇక రిపోర్టర్లు మీ ఇంటర్వ్యూ కావాలి అని కోరడంతో ఆనందపడుతూ సిరి లోపలికి తీసుకువెళ్ళి అందరికీ విషయం చెబుతుంది.

    పాసయ్యాకే విషయం చెప్పాలని అనుకున్నాను అని అదే విధంగా పాస్ అయ్యాడు అని అంటుంది. ఇక తక్కువ కుటుంబ సభ్యులందరూ ఆనందపడుతూ ఉన్న సమయంలో ఇదంతా మీ అందరి వల్లే సాధ్యమైందని ఇక మీదట కూడా చదువుకుంటానని భరత్ చెబుతాడు. కుటుంబ సభ్యులు కూడా అందరూ ఆయనకు బాగా సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు.

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
     పార్వతి రిటర్న్స్

    పార్వతి రిటర్న్స్

    ఇక భరత్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాడు. ఇప్పటిదాకా బాధగా ఉండేదని కానీ భరత్ కూడా చదువుకోవడం తో ఆ బాధలు తీరిపోతాయి అని అందరూ భావిస్తారు. ఇక మీడియా ఇంటర్వ్యూ ఇస్తూ భరత్ అను ఒక కిరణా షాప్ లో పని చేస్తాను అని ఆ కిరాణా షాపే ప్రపంచం అని అంటాడు. షాప్ లో పని చేస్తూ రాత్రుళ్లు కాలేజీకి వెళ్లి చదువుకుని జిల్లా మొదటి ర్యాంకు సాధించాను అని దానికి కారణం మా అన్నయ్య వదిన అని చెబుతారు.

    ఇక సిరి చలవ వల్ల భరత్ చదువుకుని మంచి మార్కులు సాధించడంతో అందరు సిరినీ కూడా అభినందిస్తారు. ఎక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు తర్వాత ఎపిసోడ్ లో కుటుంబం అంతా ఆనందంగా గడుపుతున్న సమయంలో సిరి తల్లి పార్వతి మాత్రం నా కూతురు చదివించింది కానీ సీతకు మాత్రం చదివించాలనే బుద్ధి కలగలేదు అంటూ కొత్త సమస్య తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించారు.

    English summary
    Siri is delighted as Bharat secures district top rank in his intermediate examinations. His family congratulates him and celebrates his victory with great joy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X