twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vadinamma : భరత్ కి జిల్లా ఫస్ట్.. అనుకోని షాక్ ఇచ్చిన సీత.. పార్వతి కొత్త తలనొప్పి!

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలా ఈ సీరియల్ ఈ రోజుతో 677వ ఎపిసోడ్ కి చేరింది. అసలు పాస్ కాలేదు అని బాధపడి ఇక ఈ చదువు ఏమీ వద్దు అని వెనక్కి తిరిగి వెళ్ళి పోయిన భరత్ కి అనుకోని షాక్ తగులుతుంది. భరత్, సిరి ఇద్దరూ ఇంటికి వెళ్ళే సమయానికి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున రిపోర్టర్లు మోహరించి ఉంటారు.

    వీళ్ళు ఏదో చేయకూడని పని చేశారు అని రఘురాం భయపడిపోతున్న సమయంలో ఇలా ఇంటర్ పరీక్షలు రాశాడని అది కూడా జిల్లా ఫస్ట్ వచ్చాడు అని తెలియడంతో రఘురాం కుటుంబ సభ్యులు అందరూ ఆనంద పడుతూ ఉంటారు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగియగా ఈరోజు ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది పరిశీలిద్దాం.

    ఆమెకే అంకితం

    ఆమెకే అంకితం

    తాజా ఎపిసోడ్ లో మీ విజయానికి కారణం ఎవరు అని రిపోర్టర్లు ప్రశ్నిస్తే దానికి గల కారణాలు అన్నీ కూడా భరత్ వెల్లడించారు. తన భార్య తనను ప్రోత్సహించి చదివే లాగా చేసిందని తమ చదువు ఆమెకు అంకితం అని చెప్పుకొచ్చాడు. అలాగే తాను రోజంతా కిరణా షాప్ లో కష్టపడి పని చేసే వాడిని రాత్రి సమయంలో చదువుకునే వాడిని అని వెల్లడించాడు.

    అయితే ఎనిమిదవ తరగతి తర్వాత ఎందుకు చదువు ఆపేశావు, అని ప్రశ్నిస్తే తమ కుటుంబం కోసం తన అన్నయ్య చాలా ఇబ్బందులు పడి అష్టకష్టాలు పడి నెట్టుకొచ్చే వాడని దానిని చూసి నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాడిని అని చెప్పుకొచ్చారు. ఆయనకు అండగా నిలబడాలని ఉద్దేశంతో అప్పట్లోనే చదువు ఆవేశాన్ని భరత్ పేర్కొంటాడు.

    అన్నా వదినలు రోల్ మోడల్స్

    అన్నా వదినలు రోల్ మోడల్స్

    తన వదిన కూడా తనకు అమ్మ లాగా చూసుకునేది అని చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్య పెళ్లి చేసుకోక ముందు నుంచి మాతో చాలా కలివిడిగా ఆనందంగా ఉండేది అని చెప్పుకొచ్చాడు. తన తమ్ముడు ఇలాంటి విజయం సాధించడంతో తనకు చాలా ఆనందంగా ఉందని రఘురాం సీత ఇద్దరు కూడా టీవీ వాళ్ళతో చెబుతారు.

    ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఉంటారు. రఘురాం తన స్నేహితులు అందరికీ ఫోన్లు చేసి సాయంత్రం భరత్ విషయం టీవీ లో వస్తుంది కాబట్టి తప్పకుండా చూడాలని కోరుతూ ఉంటాడు. సీత తన అన్న భాస్కర్ కి, సిరి తన తల్లి పార్వతి కి, శిల్ప తన తండ్రి రాజశేఖర్ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పి టీవీ చూడమని కోరుతోంది.

    అందరూ ఆనందంగా

    అందరూ ఆనందంగా

    అలా రఘురామ్ కుటుంబమే కాక రఘురాం స్నేహితుల కుటుంబాలు రఘురాం చుట్టాలు కుటుంబాలు అందరూ కూడా భరత్ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఊరిలో పెద్ద మనుషులు కూడా రఘురాం ఇంటికి వచ్చి భరత్ చేసిన పని మామూలు పని కాదని దానిని మెచ్చుకొని తీరాల్సిందే అని అంటారు. అలా ఇంటికి వచ్చి చెబుతున్న వారిలో ఒక అతను గతంలో భారత్ ని అవమానిస్తాడు.

    నీ చదువు రాక పోవడం వల్ల ప్లాస్టిక్ బియ్యం కొన్ని లక్షల నష్టం వచ్చేలా చేశావు. నువ్వు మీ అన్న వదినలకు భారమే తప్ప వాళ్లకు ఉపయోగం లేదు. అవమానిస్తాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి నువ్వు చేసిన పని మామూలు పని కాదు అని మెచ్చుకోవడంతో డబ్బు మాత్రమే కాదు చదువు కూడా మనిషికి ఇంత గౌరవం తెస్తుంది అని అనుకోలేదు, ఇలా అనుకుంటే ఎప్పుడో చదివేవాడిని అని భారత్ అనుకుంటూ ఉంటాడు.

    సీత అనుకోని షాక్

    సీత అనుకోని షాక్

    ఇక ఇది ఇలా జరుగుతూ ఉన్న సమయంలో సీత అనుకోని షాక్ ఇస్తుంది. రఘురాం షాప్ కి బయలుదేరిన బోతూ ఉంటే ఇక మీదట షాప్ కి రాడని భరత్ తన చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకుని డిగ్రీ పూర్తి చేస్తాడని ఉంటుంది. సీత వదిన దగ్గర నుంచి ఇలాంటి సమాధానం అస్సలు ఊహించని భారత్ చచ్చిపొమ్మంటే చచ్చిపోతాను కానీ ఇలాంటి మాటలు మాత్రం దయచేసి అనవద్దని అంటాడు.

    ఇందులో తప్పేముంది నీ చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కుని చేయడంలో తప్పేమీ లేదు కదా అని సీత అంటుంది. అయితే తాను ఎప్పటికీ అన్నయ్య దారిలోనే నడుస్తాను కానీ ఇలా వేరే ఉద్యోగాలు చేయాల్సిన అవసరం నాకు లేదు అన్నట్లు భరత్ మాట్లాడుతారు.

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
    కొత్త టెన్షన్

    కొత్త టెన్షన్

    అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు ఇక తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం సిరి తల్లి పార్వతి మరో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. సీత ఇంటికి తన భర్తతో కలిసి వచ్చిన పార్వతి భరత్ ను చదివించేలా చేయవచ్చనే ఆలోచన నీకు ఎందుకు రాలేదు సీత? భరత్ చదువుకోవడం నీకు ఇష్టం లేదా అని ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నతో కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్న రఘురాం కుటుంబానికి ఇప్పుడే కాస్త ఇబ్బందులు తొలిగాయి అనుకుంటే పార్వతి ప్రశ్న మరింత ఇరకాటంలో పెట్టేలాగా కనిపిస్తోంది.

    English summary
    Siri is delighted as Bharat secures district top rank in his intermediate examinations. His family congratulates him and celebrates his victory with great joy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X