Vadinamma: రఘు- సీతలకి అనుకోని షాక్.. కొడుకు గురించి రఘురాంకి చెప్పేసిన సీత?

భరత్ పాస్ అవుతాడు అని కూడా అనుకోలేదు కానీ అనూహ్యంగా జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవడంతో భరత్ కి పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే భరత్ కి షాప్ కి వెళ్ళడు అని అతను తన చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కుని తర్వాత డిగ్రీ పూర్తి చేస్తాడు అని సీత అంటుంది. అలా అనడం కంటే నన్ను చంపేస్తే నయం అనే విషయం చెబుతాడు భరత్. కొంత బలవంతం చేయాలని చూసినా సీత మాట కూడా వినని భరత్ ఇక నేను షాపులో ఉంటానని, నా అన్నకు తోడుగా బిజినెస్ ని డెవలప్ చేస్తాను కానీ ఉద్యోగాలు వెంటపడే రకం కాదని తేల్చి చేస్తాడు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 తాజా ఎపిసోడ్ లో రఘు

తాజా ఎపిసోడ్ లో రఘు

రాం, సీతల పెళ్ళి రోజు కావడంతో భరత్ సిరి, లక్ష్మణ్ శైలు, నాని శిల్ప అందరూ వాళ్ల పెళ్లి రోజుని మరపు రాని విధంగా సెలబ్రేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా రాత్రి అందరూ నిద్ర పోయాక ఈ మూడు జంటలూ కూడా ఒక చోట చేరి దానికి తగ్గ ప్లాన్ సిద్ధం చేస్తారు. ప్లాన్ ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత పంచుకుంటారు. ప్లాన్ ప్రకారమే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. ఉదయాన్నే సీత లేచి అడుగు బయట పెట్టగానే ఆమె మీద పూల వర్షం కురిసే ఏర్పాటు చేస్తారు. ఇదేంటి అని సీత ఆశ్చర్య పోతూ ఉండగా రఘు రామ్ కూడా బయటకు వస్తాడు.

కుటుంబ సభ్యుల షాక్

కుటుంబ సభ్యుల షాక్

రఘురాం కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద క్లారిటీ రాదు. ఇదేంటి కొత్తగా అంతా వింతవింతగా జరుగుతుంది అన్నట్టు వాళ్ళు ఫీలవుతుంటారు. దీంతో అసలు ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు ? అని కుటుంబ సభ్యులను అడిగితే ముందు నుంచి ఒక్కొక్కరు నా పెళ్లిరోజు ఎప్పుడూ? నా పుట్టిన రోజు ఎప్పుడు అనే వివరాలు కనుక్కుంటే ఉంటారు.

చివరికి మీ పెళ్లి రోజు ఎప్పుడు అంటే ఇద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు కానీ ఈ రోజు సీత- రఘురామ్ ల పెళ్లి రోజు అనే విషయం కూడా వాళ్ళకి గుర్తు రాదు. అలా ఫైనల్ గా వాళ్లు తమ పెళ్లి రోజు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఇక తప్పదు కుటుంబ సభ్యులు ఎలా చెబితే అలా చేయాలి అని అనుకున్న తరువాత కుటుంబ సభ్యులు కొత్తబట్టలు ఇవ్వడంతో వాటిని ధరించి బయటకు వస్తారు.

సీతారాములను చూసినట్లే

సీతారాములను చూసినట్లే

సీతా రఘురామా బట్టలలో వస్తూ ఉంటే నిజంగా సీతారాములను చూసినట్లుగా ఫీల్ అయిన రఘురాం తమ్ముళ్లు ముగ్గురు తన్మయత్వంలో మునిగిపోయి వారికి నమస్కారం చేస్తారు. ఇదేమిటి ఇలా చేస్తున్నారు అని ఆలోచిస్తూ రఘురాం అడిగితే ఈ విషయాన్ని వాళ్లు అర్థమయ్యేలా చెబుతారు. అలా మొత్తం మీద కుటుంబ సభ్యులు అందరూ రఘురాం సీతల పెళ్ళి రోజున గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు.

అయితే సీతకు బాగా ఇష్టమైన ఆహారం ఏది అనే ఆలోచన ఎవరికీ తట్టడం లేదు. మన ఇష్టా ఇష్టాల గురించి సీతమ్మ అంత తాపత్రయ పడుతున్నట్లు ఉంది. కాని ఆమెకు ఇష్టం ఏమిటి అనే విషయం మాత్రం మనం తెలుసుకోలేకపోయాము అని అందరూ బాధపడుతూ ఉంటే రఘురాం తల్లి వచ్చి సీతకు కొబ్బరి చెట్నీ అంటే చాలా ఇష్టమని చెబుతోంది. దీంతో ఆమెకు కొబ్బరి చట్నీ చేయడానికి సిద్ధం చేస్తారు.

కొబ్బరి చెట్నీ స్పెషల్

కొబ్బరి చెట్నీ స్పెషల్

అలా కుటుంబ సభ్యులు చేసిన కొబ్బరి చెట్నీ తిని సీతా రఘురామ్ ఆశ్చర్యపోతారు. అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించిన రఘు తన పని చేసుకోవడం కోసం వెళ్లబోతుంటే ఈరోజు పూర్తిగా మీకు సెలవు అని ఒకరిని విడిచి మరొకరు ఉండకూడదు అని వాళ్ళిద్దరు సమయం గడిపే విధంగా ప్లాన్ చేస్తారు. అలా ఇద్దరూ కూడా కాస్త సమయం గడిపే అవకాశం దొరుకుతుంది.

అలాగే మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎవరికీ వాళ్ళు ఆఫీసులు మానేసి షాపు మూసేసి ఇంట్లోనే ఉంటారు . శైలు కూడా తాను చెబుతున్న ట్యూషన్ కి సెలవు ఇచ్చేస్తుంది. అలా రఘురాం సీతల పెళ్ళి రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు కుటుంబ సభ్యులు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. కానీ తరువాత జరగబోతున్న ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే విధంగా కనిపిస్తోంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
నిజం చెప్పాలని కోరిన బుడతడు

నిజం చెప్పాలని కోరిన బుడతడు

ఎందుకంటే సీత తనకు పుట్టిన బిడ్డను శైలు బిడ్డగా చెప్పి వాళ్లకి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఋషి తన సొంత కొడుకు అయినట్టు శైలు ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు సీత ఈ విషయంలో బాధ పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం సీత నువ్వు ఎవరు అనే విషయం నీ కన్న తండ్రి కి చెప్పాల్సిన బాధ్యత నీ మీదే ఉంది, రెండు వేలు చూపించి ఇందులో ఒక వేలు పెట్టుకుంటే మీ నాన్నకు చెబుతానని రెండో వేలు పట్టుకుంటే చెప్పను అని అంటుంది.

చివరికి ఆ బుడతడు నాన్నకి చెప్పాలి అనే విషయం చెప్పినట్లు కనిపిస్తోంది. అలా చెప్పడంతో రఘురామ్ షాక్ అయినట్టు శైలు కూడా షాక్ కి గురైనట్లు చూపిస్తున్నారు. చూడాలి మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X