Vadinamma: రఘు రామ్ కి హార్ట్ ఎటాక్.. ఆ షాకింగ్ విషయం తెలియడంతోనేనా?

రఘురాం, సితల పెళ్లి రోజు కావడంతో మిగతా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వారిద్దరూ పెళ్లి రోజున గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేశారు. ముందు మాకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసినా సరే నానీ- శిల్పా, సిరి - భరత్, శైలు - లక్ష్మణ్ అందరూ కలిసి బలవంతం పెట్టి సీతా, రఘు రామ్ లు కొత్త బట్టలు వేసుకునేలా చేస్తారు.

అంతేకాదు ఈ సెలబ్రేషన్స్ కు దగ్గరి బంధువులను బొమ్మలను కూడా హాజరు కమ్మని కొడతారు. అందులో భాగంగానే మరికొందరు కూడా రఘురాం ఇంటికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు ఇక ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే

సీతారాముల లాగా

సీతారాముల లాగా

ముందు రఘు రామ్, సీత ఇద్దరు పెళ్లి రోజు జరుపుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు మాట్లాడితే కుటుంబ సభ్యులు అందరూ బాగా బలవంతం చేశారు. దీంతో తప్పక వాళ్ళిద్దరూ కొత్త బట్టలు వేసుకుని వాళ్ళు ముందుకు వెళతారు. సీతా, రఘురాం ఇద్దరూ సీతారాముల లాగా కనిపిస్తున్నారని కుటుంబ సభ్యులు అందరూ ముచ్చట పడుతూ ఉంటారు.

సాఫ్ట్ కార్నర్

సాఫ్ట్ కార్నర్

అయితే వీళ్ళు ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పి ఆనంద పరచడం కోసం సీత అన్న భాస్కర్ తన భార్య దుర్గతో కలిసి ఇంటికి వస్తాడు. సాధారణంగా సీత అంటే అసలు ఏమాత్రం పడని దుర్గ రఘురాం విషయంలో మాత్రం సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఉంటుంది.

దెప్పి పొడుస్తూ

దెప్పి పొడుస్తూ

అయినా సరే భాస్కర్ అలా తీసుకురావడంతో నన్నెందుకు తీసుకొచ్చావు ఉన్నట్టు దెప్పి పొడుస్తూ ఉంటుంది.. భాస్కర్ కూడా ఇదంతా అలవాటు అయిపోయింది కాబట్టి సాధారణంగా మాట్లాడతూ తీసుకువెళతాడు. అక్కడికి వెళ్ళాక రఘురాం సీతలకు గిఫ్ట్ ఇచ్చి భాస్కర్ ఆనందం వ్యక్తం చేస్తాడు. భాస్కర్ - దుర్గ వచ్చిన కాసేపటికి పార్వతి తన భర్తతో కలిసి వస్తుంది. వచ్చి వాళ్ళు కూడా సీతా రఘురాం లకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు.

షాకిచ్చిన నాని

షాకిచ్చిన నాని

ఇక ఆ తర్వాత కాసేపటికి శిల్ప తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు. అయితే తమ తల్లిదండ్రులను ఆహ్వానించారు అనే విషయం ఏ మాత్రం తెలియని శిల్ప ఎవరు పిలిచారు అనే విషయం మీద ఆశ్చర్యానికి లోనవుతున్నారు. తానే పిలిచాను అని చెప్పిన నాని చెప్పకుండా నిన్ను సర్ప్రైజ్ చేయాలని భావించారని అంటాడు. ఈ విషయం విన్నా రాజశేఖర్ ఒక వేళ చెప్పి ఉంటే పిలవకుండా ఉండమని శిల్ప కోరేదని అంటాడు. అయితే నాని అలాంటిదేమీ లేదని ఇంకా ఎన్నాళ్ళు ఈ పగలు పట్టింపులతో ఇబ్బందులు పడతారు అని అంటారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
రఘురాం కి గుండెపోటు

రఘురాం కి గుండెపోటు

ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం పిల్లలు లేరు అని బాధ పడుతున్న రఘురాం అదే బాధ పడుతూ గుండెపోటుతో కింద పడిపోయినట్లు చూపించారు. దీంతో అప్పటి కప్పుడు రఘురాం ని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చూపించారు. దీంతో తదుపరి ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా సాగినట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X