Vadinamma Oct 23rd: శైలుకు షాకిచ్చిన భర్త.. రఘు హార్ట్ ఎటాక్.. అసలు ఏం జరుగుతోంది?

ఆసక్తికరంగా సాగుతున్న వదినమ్మ సీరియల్ 681 వ ఎపిసోడ్ కి చేరింది. ప్రస్తుతం రఘురాం కుటుంబం అంతా ఆనందంలో తేలిపోతున్నారు. రఘు రాం- సీత పెళ్లి రోజు కావడంతో వారిద్దరి పెళ్లి రోజు ని మిగతా కుటుంబ సభ్యులు అందరూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ముందు ఆశ్చర్యపోయినా సరే తర్వాత రఘు రాం సీత కూడా కుటుంబ సభ్యుల ఆనందాన్ని దూరం చేయడం ఇష్టం లేక వాళ్ళు చెప్పినట్టు చేయడానికి సిద్ధమయ్యారు. అలా నిన్నటి ఎపిసోడ్ లో సీత అన్న భాస్కర్, దుర్గ, సిరి తల్లి పార్వతి సిరి తండ్రి కూడా చేరుకుంటారు అలాగే శిల్ప అమ్మానాన్న కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగా ఈరోజు తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది. అనే వివరాల్లోకి వెళితే

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 వాళ్లు నా అతిథులు

వాళ్లు నా అతిథులు

ఈరోజు ఒక పెద్ద ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసి రఘురాం సీత ఇద్దరినీ వేదిక నుంచి కిందకు దిగకుండా చేసి చుట్టాలు అందరిని పిలుస్తారు కుటుంబ సభ్యులు. అయితే అనూహ్యంగా శైలు తండ్రి శైలు తండ్రి, బావమరిది కూడా ఈ వేడుకకు రావడంతో శైలు అలుగుతుంది. అసలు వీళ్ళని ఎందుకు ? ఎవరు పిలిచారు? అని కోప్పడుతుంది. ఎందుకు వచ్చారు అన్నట్లు గుమ్మంలోనే ఆపేస్తే లక్ష్మణ్ మాట్లాడుతూ శైలు ప్లీజ్ ఏమీ అనుకోవద్దు, వాళ్లు నా అతిథులు నేనే పిలిచాను అంటాడు. అయితే ముందు నాకు ఒక సారైనా చెప్పాలి అనిపించలేదా? నాకు వాళ్ళను పిలవడం ఇష్టం లేదు శైలు అంటుంది.

నా దరిద్రం

నా దరిద్రం

నిన్ను అడిగితే నువ్వేం చెబుతావో నాకు తెలుసు అందుకే నిన్ను అడగకుండానే వాళ్ళు అని పిలిచాను అంటాడు. అయినా సరే శైలు కోపంతో నాకు వాళ్ళను పిలవడం ఇష్టం లేదు, వాళ్లు చేసినవన్నీ మర్చిపోయావా అని అడుగుతుంది. అలా కాదని కుటుంబం అంతా ఆనందంగా గడుపుతున్న సమయంలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని లక్ష్మణ్ అంటాడు. దయచేసి కూల్ అవమని అడిగితే చివరికి సీతా రఘురాం ఇద్దరూ కూడా శైలుని బ్రతిమలాడితే అప్పుడు శైలు కూల్ అవుతుంది. ఇక శైలు తండ్రి కూడా శైలు నా రక్తం అని అది అంత త్వరగా ఒప్పుకునే రకం కాదని చెప్పుకుని వస్తాడు. నీ రక్తం అవ్వడమే నా దరిద్రం అన్నట్లుగా శైలు మాట్లాడుతుంది.

జానకి కలగనలేదు రామచంద్ర

జానకి కలగనలేదు రామచంద్ర

ఇక రాజేంద్ర తన బావమరిది తో కలిసి మిగతా జనాలులో కూర్చున్న తర్వాత రఘురామ్ కుటుంబాన్ని పరామర్శించడానికి జానకి కలగనలేదు రామచంద్ర కూడా వస్తాడు. రామచంద్ర వస్తున్న విషయం వీళ్ళకు గుర్తు ఉండదు కానీ భరత్ మాత్రం రామచంద్రను కచ్చితంగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాడు. భరత్ అలాగే సిరి ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు రామచంద్ర స్వయంగా ఆశ్రయం ఇచ్చి వాళ్ళు వెనక్కి వచ్చేలా చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. రఘురాం ఇదే విషయాన్ని గుర్తు చేసుకుని మరీ రామచంద్ర దగ్గర బాధపడతాడు అయితే రామ చంద్ర మాట్లాడుతూ సిరి, భరత్ ఇద్దరు మీ మీద కోపంతో బయటకు రాలేదని అంటాడు

 ఏమిటి పిచ్చి మాటలు?

ఏమిటి పిచ్చి మాటలు?

ఒకవేళ అలా మీ మీద కోపంతోనే బయటకు వచ్చి ఉంటే వాళ్లకు సర్దిచెప్పి పంపించడం నా వల్ల కూడా అయ్యేది కాదు కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని ఎంతో కొంత డబ్బు సంపాదించి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వచ్చారు అంటాడు. దీంతో రఘురాం విషయం అర్థం చేసుకుని ఆనందంగా ఉంటారు. అయితే సీత రఘురాం ఇద్దరు ఆనందంగా ఉండటం చూసి ఎప్పటిలాగే పార్వతి, దుర్గ ఇద్దరు కూడా కుళ్లుకుంటారు. ఇప్పుడు ఎన్ని వేషాలు వేస్తే ఏమి లాభం ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అంటూ పార్వతి దుర్గతో అంటున్న విషయాన్ని సిరి గమనించి నీకు బుద్ధి లేదా? శుభకార్యం రోజు కూడా ఏమిటి పిచ్చి మాటలు? అని తల్లిని తిడుతుంది. దానికి పార్వతి నేనేమైనా తప్పుగా అన్నానా జరిగిన విషయమే కదా చెబుతున్నాను అంటుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
లోలోపల మాత్రం

లోలోపల మాత్రం

అలా మొత్తం మీద రఘురాం కుటుంబ సభ్యులు అందరూ కలుసుకుంటారు. సీత అన్న, వదిన, శైలు తండ్రి- మామయ్య, శిల్ప- అమ్మానాన్న, అందరూ కూడా రఘురామ్ ఇంటికి చేరుకుంటారు. వాళ్లందరూ కూడా పైకి ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తారు కానీ లోలోపల మాత్రం రఘురాం సీత ఆనందం చూసి దమయంతి, రాజేంద్ర, పార్వతి, దుర్గ లు మాత్రం వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. ఇక కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురామ్ కి ఎందుకో హార్ట్ ఎటాక్ వస్తుంది. తనకు పిల్లలు లేకపోవడం వల్ల చాలా బాధపడుతున్నట్లుగా ముందు రఘురాం మాట్లాడతాడు, ఆ తరువాత కాసేపటికే గుండెపోటు రావడంతో ఆయన గుండె పట్టుకొని పడిపోతాడు. ఇక నిన్నటి కమింగ్ అప్ లో కూడా ఇదే చూపించారు ఈ రోజు కూడా ఇదే చూపించారు. అయినా దీనికి సంబంధించి వచ్చే ఎపిసోడ్ లో క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X