Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Vadinamma: ఇంకా సస్పెన్స్ లోనే రఘురాం గుండెపోటు.. అసలు ఏం జరుగుతోంది?
రఘు రామ్- సీతల పెళ్లి రోజును కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రాండ్ గా జరపడానికి ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే వారి పెళ్లి రోజు వేడుకలను చాలా గ్రాండ్ గా జరుపుతూ ఉంటారు. రఘు రామ్ సీతల పెళ్లి రోజు కార్యక్రమానికి జానకి కలగనలేదు రామ చంద్ర కూడా హాజరయ్యి అందరినీ ఆశ్చర్య పరుస్తూ తనకు వాళ్ళు ఇద్దరూ ఆదర్శం అని చెబుతూ ఉంటాడు. అయితే ఇదంతా కుటుంబసభ్యులు విని ఆనంద పడుతూ ఉంటే శిల్ప అమ్మ, భాస్కర్ భార్య దుర్గ, సిరి తల్లి పార్వతి, శైలు తండ్రి రాజేంద్ర మాత్రమే ఏంట్రా బాబు ఈ భజన అన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పెళ్లి రోజు వేడుకలు
రెండు ఎపిసోడ్స్ నుంచి చూపిస్తున్న విధంగానే ఇప్పుడు కూడా రఘు రామ్- సీతల పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు చూసి కుటుంబ సభ్యులు అందరూ ఆనంద పడుతూ ఉంటారు.. ఒక పక్క రఘురాం మరోపక్క సీత మాత్రం ఈ వేడుకలు జరుపుకోవడం కరెక్ట్ కాదేమో ఈ వయసులో ఎందుకు ఈ పిల్లలు మమ్మల్ని ఇలా చేయిస్తున్నారు అన్నట్లు భయపడుతూ ఉంటారు.
అయితే వేడుకల ముగింపు వచ్చే సమయానికి మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ సిద్ధం చేశామని దానిని మేము తీసుకువస్తామని లక్ష్మణ్ తదితరులు చెబుతారు. ఇప్పుడు ఈ గిఫ్ట్ లు గట్ర మాకేమి వద్దు అని సీతా, రఘురాంలు చెప్పే ప్రయత్నం చేస్తారు.
గిఫ్ట్ ఇచ్చి తీరాల్సిందే
అదేం లేదు ఎట్టి ఈ పరిస్థితుల్లో మీకు గిఫ్ట్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి రఘు రామ్ తమ్ముళ్లు, మరదలు అందరూ కలిసి వెళ్లి ఒక గిఫ్ట్ ప్యాక్ తీసుకువస్తారు. ఆ గిఫ్ట్ ప్యాక్ తీసుకువచ్చి రఘు రామ్ కి ఇచ్చి దీన్ని మీరు మాత్రమే ఓపెన్ చేయాలి అని చెబుతారు. సీతతో కలిసి దానిని ఓపెన్ చేయాలి అని కోరగా నాకంటే కూడా దీనిని ఓపెన్ చేసే అర్హత, అధికారం ఎక్కువ అమ్మకే ఉంటుంది. అమ్మ చేత ఈ ఓపెన్ చేయించాలి అని రఘురాం అనగా రఘురాం తల్లి మాత్రం లేదు మీరే ఓపెన్ చేయండి అంటుంది. ఇంతలో సీత కల్పించుకొని ప్రతి రోజు మిమ్మల్ని చూసి మేము మరింత ఉత్సాహం తెచ్చుకుంటాం.
శ్రీ రాముడు, సీత పాత్రలలో
మిమ్మల్ని చూసే ప్రతి రోజూ ఎలా ఫైట్ చేస్తూ విజయం సాధించాలి అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాం మీరే మాకు ఆదర్శం మీరు ఓపెన్ చేస్తేనే బాగుంటుంది అని అంటుంది.. అయితే రఘురాం తల్లి మాత్రం నేను ఓపెన్ చేసే సమస్య లేదు అని తేల్చి చెబుతోంది.. దీంతో ఇక తప్పక రఘురాం సీత ఇద్దరూ కలిసి ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తారు. దానిని ఓపెన్ చేయగా అందులో రఘురాముడు గెటప్‌లో రఘురాం, సీతాదేవి గెటప్ లో సీత కనిపిస్తారు. అయితే ఈ ఫోటో చూసి రఘురాం సీత ఇద్దరూ కూడా ఆనందం పడి తమ వాళ్లకు తమ మీద ఎంత ప్రేమ ఉన్నదో అని ఆశ్చర్యపోతారు.
రఘురామ్ కుటుంబానికీ దీవెనలు
అయితే ఇదంతా చూసి తట్టుకోలేక శైలు తండ్రి రాజేంద్ర తన బావమరిది మీద చేయి చేసుకున్నాడు కూడా.. మాక్ ఏందిరా ఇది త్వరగా అయిపోతే ఇంటికి వెళ్ళిపోదాం కదా అన్నట్టు మాట్లాడుతుంటాడు. ఇంతలో రఘు మాట్లాడుతూ మా తమ్ముళ్లు మా మీద చూపించే ప్రేమను మేము ఎప్పటికీ మర్చిపోలేం అని ఆ ప్రేమ అలాగే ఉండాలని కోరుకుంటున్నామని చెబుతూ భోజనాలు చేసి వెళ్లవలసిందిగా అందరినీ కోరతాడు. అలా రఘురాం ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి రఘురామ్ కుటుంబం మొత్తాన్ని దీవించి వెళతారు.
కొత్త ప్రశ్నలు
ఇక ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత రఘురాం కాళ్లను తమ్ముళ్లు,సీత కాళ్ళను కార్డులను వారి భార్యలు పడుతూ ఈరోజు మీరోజు అందుకే మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడుగుతాము దానికి మీరు సమాధానం చెప్పాలి అని అంటారు. అలా లక్ష్మణ్, సీత వదినను పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా విషయంలో ఆమెను సంతృప్తి పరచలేదు అనిపించిందా? అని రఘురాం ని అడిగితే అసలు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కష్టాలే అయినా సరే ఆమె వెన్నంటి ఉండి అనే విషయాన్ని, ఆమెకు నేను ఏమీ చేయలేదు అన్నట్లు మాట్లాడతాడు. ఇంతలో సీత కల్పించుకుని అదేమీ లేదని రఘురాం చాలా బాగా చూసుకున్నాడు అని చెబుతుంది.
Recommended Video
అదే కమింగ్ అప్
అక్కడితో ఈ తతంగం అంతా పూర్తి కాగా మరో సారి శోభనం సెట్ అప్ చేసి రఘురాముని ఆయన తమ్ముళ్లు, సీతను వారి భార్యలు శోభనం గదిలోకి పంపినట్లు పంపుతారు. ముందు తటపటాయించినా ఇక తప్పదు అనుకుని శోభనం గదిలోకి వెళ్లిన రఘురామ్, సీతలు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనంద పడుతూ ఉంటారు. అయితే పిల్లలు పుట్టలేదనే బాధ మాత్రం రఘురామ్ ని తొలుస్తూ ఉంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో రఘురామ్ కి గుండెనొప్పి రావడంతో పడిపోయినట్లు చూపించారు. ఈ విషయమై క్లారిటీ వస్తుందేమో చూడాలి.