Vadinamma: రఘురాంకి గుండెపోటు.. పడిపోయిన సీత.. అసలు విషయం చెప్పడంతో?

రఘు రామ్- సీతల పెళ్లి రోజును కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రాండ్ గా జరుపుకున్నారు. అనుకున్నట్టుగానే వారి పెళ్లి రోజు వేడుకలను చాలా గ్రాండ్ గా జరపగా రఘు రామ్ సీతల పెళ్లి రోజు కార్యక్రమానికి జానకి కలగనలేదు రామ చంద్ర కూడా హాజరయ్యి అందరినీ ఆశ్చర్య పరిచారు. కుటుంబసభ్యులు ఈ వేడుకలతో ఆనందపడుతూ ఉండగా శిల్ప అమ్మ, భాస్కర్ భార్య దుర్గ, సిరి తల్లి పార్వతి, శైలు తండ్రి రాజేంద్ర మాత్రమే ఏంట్రా బాబు ఇది తతంగం ఎప్పుడు అవుతుందా? అన్నట్టు ఫీల్ అవుతుంటారు.

ఇక కార్యక్రమం ముగియడంతో వారంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. రఘురాం సీతలకు మాత్రం శోభనం సెటప్ చేస్తారు తమ్ముళ్ళు, మరదళ్ళు. వద్దు వద్దంటూనే కొత్తగా పెళ్ళైన జంటలా ఇద్దరినీ లోపలికి పంపుతారు. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శోభనం గదిలోకి పంపినట్లు

శోభనం గదిలోకి పంపినట్లు

రఘు రామ్ సీత ఇద్దరినీ కూడా శోభనం గదిలోకి పంపినట్లు పంపడంతో లోపలికి వెళ్లి వాళ్ళు ఇద్దరూ కాస్త ఆనంద పడుతూ ఉంటారు. కొంచెం సేపు మాట్లాడిన తర్వాత రఘురాం మాత్రం పిల్లలు కలగకపోవడం తో బాధపడుతూ ఉంటాడు. లక్ష్మణ్ వాళ్ళు మనిద్దరం బాగానే ఉన్నామా ? ఒకరికి ఒకరు సంతృప్తి విషయంలో ఎలా ఉన్నాము ? అని అడిగితే నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అని సీతతో అంటాడు. అంతేకాక నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సరిగ్గా చూసుకోలేదు అప్పటి నుంచి నీకు కష్టాలే అని రఘురాం అంటాడు. నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా? అని రఘురాం సీతని అడిగితే అలాంటిది ఏమీ లేదని ఆమె అంటుంది. అయితే పిల్లలు కలగక పోవడంతో తాను చాలా బాధపడుతున్నాను అని రఘురాం అంటాడు.

రఘురాం కి గుండెపోటు

రఘురాం కి గుండెపోటు

అలా అంటూనే బాధపడుతున్న రఘురాం మంచం చుట్టూ తిరుగుతూ మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా గుండె పట్టుకుని పడిపోతాడు. సీతకు భయం వేసి ఇంట్లో ఉన్న అందరిని అక్కడ పిలుస్తుంది అందరూ అక్కడికి వచ్చిన తర్వాత రఘురాం స్పృహ కోల్పోయినట్లు అర్థం చేసుకుంటారు. రఘురాం కి గుండెపోటు వచ్చిందని తెలియడంతో వెంటనే హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి చేరుస్తారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడంతో డాక్టర్ రఘురాం కి చికిత్స చేయడం మొదలుపెడతారు. హడావిడిగా చికిత్స చేస్తూ రఘురాం ని మళ్లీ స్పృహలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా

ఇక రఘురాం హాస్పిటల్ లో బెడ్ మీద ఉంటే కుటుంబ సభ్యులు అందరూ అల్లాడిపోతూ ఉంటారు. లక్ష్మణ్, శైలు, భరత్, సిరి ఇలా ఎవరికి వాళ్ళు అన్నయ్యకు ఏమవుతుందో అని టెన్షన్ లో ఉంటారు. ఏకంగా శిల్ప అయితే నేను ఎన్నో తప్పులు చేసినా బావ గారు నన్ను చిరునవ్వుతో క్షమించారు అలాంటి మనిషికి ఇలా జరగడం నాకు నచ్చడం లేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అయితే సీత మాత్రం తమకు పిల్లలు కలగడం లేదు అనేదాన్ని మనసులో బాగా ముద్రించుకుని రఘురాం ఇలా అయిపోయాడు అని అనుకుంటుంది.

ఆమె గతంలో జరిగిన విషయాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటుంది. తమకు బాబు పుట్టడం, శైలు బాబు చనిపోవడం తమ బాబు ని తీసుకువెళ్లి శైలు పక్కన పడుకోబెట్టి తన బిడ్డ చనిపోయాడు అని చెప్పడం అన్ని గుర్తొస్తూ ఉంటాయి. అలాగే తాను గర్భవతి గా ఉన్నప్పుడు రఘురాం తన విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు అనే విషయం కూడా గుర్తొస్తూనే ఉంటుంది.

వాడు ఎందుకమ్మా ?

వాడు ఎందుకమ్మా ?

తన విషయంలో ఆజాగ్రత్తగా ఉన్నందుకు సిరి, శైలులను ఎంతగా తిట్టేవాడు తనను ఎలా చూస్తున్నాడో? పిల్లల కోసం ఎంతగా పరితపిస్తున్నాడో? అన్ని విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక ఆమె ఏడుస్తూ ఏడుస్తూ సొమ్మసిల్లి పడి పోతుంది. అయితే కుటుంబ సభ్యులందరూ సీతమ్మకు ఏమైందో అని టెన్షన్ తో భయపడుతూ ఆమె ముఖం మీద నీళ్ళు చిలకరిస్తే ఆమె లేచి కూర్చుంటుంది దీంతో వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు.

అయితే సీత మాత్రం ఇదంతా జరిగిన తర్వాత ఇక తన బాబు గురించి రఘురామ్ కి చెప్పడం కరెక్ట్ అని భావిస్తుంది. అంతకుముందు బాబు ని ఎత్తు కోవాలని భావించి ఒకసారి ఇవ్వమని శైలును అడుగుతుంది.

అయితే భయపడిన రఘురాం తల్లి ఇప్పుడు వాడు ఎందుకమ్మా అన్నట్టు మాట్లాడితే నేనేమీ నా దగ్గర ఉంచేసుకోవడానికి అడగడం లేదు ఊరికే ఎత్తు కోవాలని అడుగుతున్నాను అంటుంది. శైలు మాత్రం నేను కన్నతల్లిని అయినా వాడివి నువ్వే పెంచుతున్నావు వాణ్ణి ఎత్తుకునే అర్హత నీకు కాక ఎవరికి ఉంటుంది ఎత్తుకొ అని ఇస్తుంది.

Recommended Video

Thamasoma Jyothirgamaya Movie Team Chit Chat | Handlooms
ఇదంతా విన్నట్లు

ఇదంతా విన్నట్లు

ఇక అక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో సీత రఘురాం నిన్ను చూడడం కోసం icu లోపలికి వెళుతుంది. వెళ్ళిన తర్వాత రఘురాంకు స్పృహ లేకపోయినా సరే రిషి మన బిడ్డ అనే విషయాన్ని రఘురామ్ కి చెబుతున్నట్లుగా చూపించారు. అయితే ఈ విషయం చెబుతున్న సమయంలో బయట నుంచి ఎవరో వచ్చినట్లు వారు ఇదంతా విన్నట్లు కూడా చూపించారు. అయితే ఎవరు వచ్చారు? ఎవరు విన్నారు అనేదానిమీద క్లారిటీ లేదు. తర్వాత ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X