Vadinamma: నిజం ఒప్పుకున్న సీతకు ఊహించని షాక్.. ఏకాకిగా మారి, చివరికి ఏం చేసిందంటే?
రఘు రామ్- సీతల పెళ్లి రోజును కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రాండ్ గా జరుపుకున్నారు. కుటుంబసభ్యులు ఈ కార్యక్రమం ముగియడంతో వారంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. రఘురాం సీతలకు మాత్రం శోభనం సెటప్ చేస్తారు తమ్ముళ్ళు, మరదళ్ళు. వద్దు వద్దంటూనే కొత్తగా పెళ్ళైన జంటలా ఇద్దరినీ లోపలికి పంపుతారు. అలా లోపలి వెళ్ళాక రఘురాం బాధ పడుతూ ఉంటాడు. దీంతో ఆయనకు గుండె పోటు వస్తుంది. రఘురాం కి గుండెపోటు వచ్చిందని తెలియడంతో వెంటనే హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి చేరుస్తారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడంతో డాక్టర్ రఘురాం కి చికిత్స చేయడం మొదలుపెడతారు. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photo Courtesy: Star మా and Disney+Hotstar

తప్పు చేశానని చెబుతూ !
రఘురాం ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలో కేవలం ఒక్కరికి మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం లభిస్తుంది. అయితే ముందు సీత రఘు రాంతల్లి రాజేశ్వరిని లోపలికి వెళ్లాల్సిందిగా కోరగా లేదు మా అందరికంటే వాడికి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. నువ్వు లోపలికి వెళితే వాడు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. వెళ్లి ఏమైనా వారికి బలం చేకూర్చే మాటలు చెప్పు అని సీతను లోపలికి వెళ్లేలా చేస్తారు కుటుంబ సభ్యులు. అలా లోపలికి వెళ్ళిన సీత తన భర్త రఘురాం అలాంటి పరిస్థితుల్లో ఉండడం చూసి తట్టుకోలేక పోతుంది. ఎందుకు ఇలా జరిగింది అని ఆమె బాధపడుతూ భర్తకు ధైర్యం వస్తుందని భావించి అతను స్పృహలో లేడు కాబట్టి తాను తప్పు చేశానని చెబుతూ ఋషి మన బిడ్డ అనే విషయాన్ని రఘురామ్ కి చెబుతుంది సీత.

అందరూ నమ్మేలా చేశా!
నన్ను తల్లిని చేయడం కోసం నువ్వు పడిన తాపత్రయం నాకు తెలుసు నేను కూడా నా ప్రాణం మీదకు వస్తుంది అని తెలిసిన కేవలం నీ కోసమే బిడ్డని కనడానికి ఒప్పుకున్నాను అని భర్తతో చెబుతుంది సీత. బిడ్డను కన్న తర్వాత నేను నీకోసం బిడ్డను కన్నాను అని అరిచి చెప్పాలని అనుకున్నాను కానీ అప్పుడు నువ్వు నా పక్కన లేవు నువ్వు నా పక్కకు వచ్చేలోపు భగవంతుడు వేరే విధంగా రాతను మార్చే చేశాడు అని సీత చెప్పుకొచ్చింది. అదే సమయంలో ప్రసవం అయిన శైలు బిడ్డ చనిపోయాడు అనే విషయం నాకు తెలిసిందని, ఈ విషయం తెలిస్తే లక్ష్మణ్ ఏమైపోతాడో శైలు ఏమైపోతుందో అనే బాధ నన్ను వెంటాడింది అని సీత చెప్పుకొచ్చింది. అందుకే నీ పర్మిషన్ లేకుండా నేను నా బిడ్డ ని తీసుకువెళ్లి శైలు పక్కలో పడుకో బెట్టి అది శైలు బిడ్డనే అని అందరూ నమ్మేలా చేశానని చెబుతోంది.

ఏమాత్రం జాలి కలగడం లేదా?
అయితే సీత ఈ విషయం అంతా స్పృహలో లేని రఘురాం కి చెబుతున్నాను అనుకుంది కానీ అదే సమయంలో రఘురాం ని చూడడానికి వచ్చిన రాజేశ్వరి, సిరి కూడా ఈ విషయం అంతా వింటారు. అయితే ఈ విషయం తెలిసిన సీత షాక్ అవుతుంది. కానీ సీత ఇలా చేయడం నచ్చని రాజేశ్వరి సీతను అనరాని మాటలు అంటుంది. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నా కొడుకు చావుబతుకుల మధ్య ఉన్న నీకు ఏమాత్రం జాలి కలగడం లేదా? వాడికి కొడుకును చూసు కోవడం వాడి హక్కు, వాడిని అడగకుండా నువ్వెలా నీ బిడ్డను వేరేవాళ్ళకు ఇస్తావు అని ప్రశ్నిస్తుంది.

నా కొడుక్కేగా ఇచ్చింది
అయితే సీత కూడా వెనక్కు తగ్గకుండా నేనేమీ వేరే వాళ్లకు ఇవ్వలేదు కదా. లక్ష్మణ్ అంటే నా కొడుకు కదా, నేను నా కొడుకును ఇచ్చింది మరో కొడుకుకే కదా అంటుంది. అయినా సరే నీ బిడ్డ గురించి నువ్వు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని నా కొడుకు ఇప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నాడు వాడికి ఏం సమాధానం చెబుతావో చెప్పు అంటుంది. అంతేకాక ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెబుతాను అంటే ఎవరికీ చెప్పకూడదు అని సీత ఒట్టు వేయించుకుంటుంది.
Recommended Video

కమింగ్ అప్ లో?
దీంతో ఈ విషయమంతా తెలిసిన మాట్లాడ లేని పరిస్థితుల్లో ఉండి పోతుంది రాజేశ్వరి. సిరి కూడా ఎవరిని సపోర్ట్ చేయాలి? ఇటు అత్త రాజేశ్వరిని సపోర్ట్ చేయాలో? సీతను సపోర్ట్ చేయాలో అర్థం కాక బిక్కముఖం వేసుకుని చూస్తూ ఉంటుంది. రాజేశ్వరి అదే కోపంతో ఇంటికి తీసుకు వచ్చేస్తుంది. సీత కూడా తన అన్న భాస్కర్ వచ్చి కొంచెం అన్నం తిని రమ్మని ఇంటికి పంపించడంతో ఇంటికి వస్తుంది. అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు కానీ సీత రాజేశ్వరికి తెలిసిన నిజం గురించి బాధపడుతుంది. ఇక అక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం సీత రిషి దగ్గరకు వెళ్లి రెండు వేళ్ళు చూపించి వీటిలో ఒక వేలు పట్టుకుంటే నీ తండ్రికి నువ్వే కొడుకువని చెబుతానని రెండో వేలు పట్టుకుంటే ఆ నిజం చెప్పనని అంటుంది కానీ ఆ బుడతడు నిజం చెప్పమనే వేలు పట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో తర్వాత ఎపిసోడ్ లొ రఘురాం లేచి వచ్చినట్లు విషయం తెలుసుకుని చేతిలో ఉన్న బ్యాగు కింద పడినట్లు, శైలు షాక్ అవుతున్నట్లు చూపించారు.


Click it and Unblock the Notifications