Vadinamma: రఘు రామ్ చావు ఖాయమన్న జనార్ధన్.. చెంప చెళ్లుమనిపించిన సీత!
రఘు రామ్- సీతల పెళ్లి రోజును కుటుంబ సభ్యులు అందర కలిసి గ్రాండ్ గా జరుపుకున్న తరువాత కుటుంబసభ్యులు రఘురాం సీతలకు మాత్రం శోభనం సెటప్ చేస్తారు తమ్ముళ్ళు, మరదళ్ళు. వద్దు వద్దంటూనే కొత్తగా పెళ్ళైన జంటలా ఇద్దరినీ లోపలికి పంపుతారు. అలా లోపలికి వెళ్ళాక రఘురాం బాధ పడుతూ ఉంటారు. దీంతో రఘు రామ్ కి గుండె పోటు వస్తుంది. రఘురాంకి గుండెపోటు వచ్చిందని తెలియడంతో వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కి చేరుస్తారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడంతో డాక్టర్ రఘురాంకి చికిత్స చేయడం మొదలు పెడతారు. ఈ క్రమంలో సీత చెప్పిన మాటలు విని రాజేశ్వరి ఆమెను తప్పు పడుతుంది. ఇంట్లో అందరి మధ్య టెన్షన్ నెలకొంది. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photo Courtesy: Star మా and Disney+Hotstar

హాస్పిటల్ నుంచి ఫోన్
సీత కుటుంబ సభ్యులలో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రాజేశ్వరి తన మనవడు రిషి దగ్గర కూర్చుని మీ అమ్మ నిన్ను త్యాగం చేశాను అనుకుంటుంది కానీ అది పెద్ద పాపం చేసింది అంటూ రకరకాల మాటలు చెబుతూ ఉంటుంది. అయితే ఇది విని సీత పరిగెత్తుకొని వచ్చి మీరు ఎవరితో చెప్పకూడదు అని నేను మాట తీసుకున్నాను కదా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటే చెప్పడం లేదు నా బాధ తగ్గించుకునే ప్రయత్నం చేస్తూన్నా అని అంటుంది. అయితే సీత మాట్లాడుతూ ఉన్న సమయంలో డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన బయలుదేరి వెళ్లడానికి సిద్ధమవుతోంది.

ట్రీట్మెంట్ కు రెస్పాండ్ కానీ రఘు రామ్
అదే సమయంలో లక్ష్మణ్ నేను కూడా వస్తాను అని చెప్పడంతో లక్ష్మణ్ ని కూడా తీసుకుని బయలుదేరుతుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్ కి చేరుకున్న తర్వాత రఘురాం అసలు ట్రీట్మెంట్ కి ఏ మాత్రం రెస్పాండ్ కావడం లేదనే విషయాన్ని టాక్టర్ చెబుతాడు. రఘు రామ్ కి జీవితం మీద ఏమాత్రం ఆశ లేకుండా పోయింది. సముద్రంలో కొట్టుకుపోతున్న వ్యక్తి బతకాలని ఆశ ఉంటే చిన్న కర్రపుల్ల దొరికినా దాని ద్వారా బతికేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ బతకాలని ఆశ లేని వ్యక్తికి భగవంతుడు చేయి న అని సీత భయపడుతుంది తరువాత లక్ష్మణ్ మా గురించి పట్టించుకున్నావు, సరే నీకు భర్త అయిన మా అన్నయ్య గురించి పట్టించుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అంటుంది. అయితే నా భర్తకు ఏమీ కాదు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను, అందులో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అని ఆమె తేల్చి చెబుతోంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే మరో పక్క పార్వతి, దమయింది, జనార్ధన్ కలిసి రఘురామ్ ఇంటికి వెళ్లి పెద్ద పంచాయతీ పెడతారు. రఘురామ్ ఇక చచ్చిపోతాడు, డాక్టర్లు ఏమీ చేయలేము అని తేల్చేశారు, ఇప్పటికే ఆస్తంతా తగల పెట్టారు కాబట్టి మిగిలిన ఆస్తినీ పంచేయాలి అనే విషయం మీద క్లారిటీ ఇవ్వాలని కోరారు.

చెంప చెళ్లుమనిపించిన సీత
కొడుకు చనిపోతాడు అనడంతో రాజేశ్వరికి విపరీతమైన కోపం వస్తుంది మర్యాదగా మాట్లాడకపోతే బయటికి గెంటిస్తామని వార్నింగ్ ఇస్తుంది. ఏదేమైనా రఘురాం చనిపోవడం ఖాయం అంటూ జనార్ధన్ మాట్లాడుతున్న సమయంలో సీత ఎంట్రీ ఇస్తుంది అలా మాట్లాడుతున్నందుకు వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో జనార్ధన్ బావమరిది ఏదో మాట్లాడబోగా అతని చెంప చెళ్లు మనిపిస్తుంది సీత. సీత చేసిన పనికి అందరూ షాక్ అవుతారు. కానీ భర్త మీద ఆమె ప్రేమను మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లు అయింది. అయితే అసలు విషయం ఏమిటో చెప్పమని అడిగితే ఆస్తుల పంపకాలు చేయాలని పార్వతీ, జనార్ధన్ అడిగితే నా కూతుర్ని అల్లుడిని ఇల్లరికం పంపాలని దమయంతి అడుగుతుంది. ఎన్నాళ్లు నేను అన్ని విషయాల్లో పెద్దగా నిర్ణయం తీసుకుంటే అందరికీ నేను ఒక విలన్ లాగా కనపడుతున్నా, ఇప్పుడు చెబుతున్నాను వినండి మీ కూతుళ్ళు అల్లుళ్ళు మీ దగ్గరికి రావడానికి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె చెబుతోంది.
Recommended Video

మళ్లీ అదే కమింగ్ అప్
ముందు అలా ఎలా మాట ఇస్తావు అని రాజేశ్వరి కోప్పడుతుంది, నేను మాట ఇవ్వడం లేదని నా నిర్ణయం ఏమిటో చెప్పానని సీత అంటుంది. అయితే వారి వెంట వెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా లేరు, మేము మా సీతక్క దగ్గరే ఉంటాను అని సిరి, శైలు తేల్చి చెబుతారు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం సీత రిషి దగ్గరకు వెళ్లి రెండు వేళ్ళు చూపించి వీటిలో ఒక వేలు పట్టుకుంటే నీ తండ్రికి నువ్వే కొడుకువని చెబుతానని రెండో వేలు పట్టుకుంటే ఆ నిజం చెప్పనని అంటుంది కానీ ఆ బుడతడు నిజం చెప్పమనే వేలు పట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగేట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











