Vadinamma : రఘురామ్ ఫ్యామిలీకి 25 లక్షల టెన్షన్.. అంతా ఓకే అనుకున్న సమయంలో బాంబ్ పేల్చి!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ 665వ ఎపిసోడ్ కి చేరింది. ఇప్పటికే శిల్ప తన తల్లి దుర్మార్గాలు తెలుసుకుని సీతా అలాగే రఘురాం మార్గదర్శకత్వంలో మంచి మంచిగా మారుతుంది. మరోపక్క భరత్ అలాగే సిరి ఇద్దరూ కూడా భరత్ డిగ్రీ పూర్తి చేసే పనిలో పడతారు. ఈ విషయం అర్థం కాక సీత వాళ్ళని అనుమానిస్తుంది. తర్వాత వాళ్ళు ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటారు.

ఈ విషయంలో ఏదో జరుగుతోంది అని రఘురాం అనుమానపడి సీతను అడగగా అసలు విషయం చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అంటుంది. అక్కడితో మొన్నటి ఎపిసోడ్ ముగించగానే తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది పరిశీలిద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

టెన్షన్ క్లియర్

టెన్షన్ క్లియర్

తాజా ఎపిసోడ్ లో సీతను రఘురాం ఏడిపించగా అదేమీ లేదని తన భార్య చెప్పిన మాట తాను ఎన్నటికీ వింటానని రఘురాం అంటాడు. మరో పక్క అమ్మవారి భక్తి పాటలు పెట్టుకుని రఘురాం తల్లి పరవశించిపోయి వింటూ ఉంటుంది. అయితే అప్పుడే రఘురాం పని చేసుకోవడానికి అక్కడ కూర్చొనబోతుంటే సీత వచ్చి పాటలు ఆపివేస్తుంది.

అలా చేయడం కరెక్ట్ కాదని అమ్మవారి పాటలు వింటూ ఉంటే మరింత ఆసక్తికరంగా పని చేస్తూ ఉంటామని రఘురాం అంటాడు. అయితే సీత మరి కొద్ది రోజులలో దసరా వస్తుంది కాబట్టి మన ఇంట్లోనే వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు చేసుకోవాలని అంటుంది. నానీ శిల్పా పెళ్లి తర్వాత వస్తున్న మొదటి దసరా కావడంతో మన ఇంట్లోనే అమ్మవారిని ప్రతిష్టించి ఘనంగా జరుపుకోవాలని అంటుంది.

కిషోర్ ఓదార్పు

కిషోర్ ఓదార్పు

అయితే మరోపక్క దమయంతి తన ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది తాను ఎన్నో ప్లాన్లు వేసాను కానీ అన్ని ఇలా విఫలం కావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉంటుంది. ఒకప్పుడు నా కూతురు నాకు సపోర్టుగా నిలబడేది కాబట్టి ఇన్ని చేయగలిగాను కానీ ఇప్పుడు నా కూతురు కూడా నా మాట వినని పరిస్థితి నెలకొంది.

ఇప్పుడు నేను ఏం చేసినా కూతుర్ని అల్లుడిని ఇల్లరికం తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన కిషోర్ తన తల్లికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దసరా పండుగ వస్తుంది కదా మనం ఘనంగా పూజలు చేసుకుందాం ఆ చేసుకున్న తర్వాత మనకు అమ్మవారి కృప లభిస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేయడానికైనా అవకాశం లభిస్తుందని అంటాడు.

దమయంతి ఫైర్

దమయంతి ఫైర్

అయితే దమయంతి మాత్రం అలా చేయడానికి వీలు లేదని ఇప్పటికే తాను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అని ఒక పక్క కూతురు మాట్లాడకుండా ఉంటే తనకు ఓ విధంగా ఉందని అంటూ ఇలా మళ్లీ మళ్లీ ఇలా పూజలు చేసుకోవాలని నా దగ్గరికి వస్తే ఊరుకోను అని దమయంతి వార్నింగ్ ఇస్తుంది.. తల్లి మూడు బాలేదు అనే ఉద్దేశంతో కిషోర్ అక్కడ నుండి వెళ్ళి పోతాడు. ఇక ఇంట్లోనే అమ్మవారి పూజ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలు పంచుకోవాలి అనే విషయంలో అందరూ తర్జనభర్జనలు పడుతూ ఉంటారు. చివరికి రఘురాం సీత ఫైనల్ గా ఎవరెవరు ఏమేం చేయాలి అనే విషయం మీద ఒక క్లారిటీ ఇస్తారు.

భక్తిలో మునిగి

భక్తిలో మునిగి

అమ్మవారి ముందు అందరూ మోకరిల్లి పూజలు చేస్తూ ఉంటారు, పంతులు కూడా రావడంతో పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ కుటుంబం అంతా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఎవరికి వాళ్లు తమతో పాటు తమ కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. అలా మొత్తం మీద రఘురామ్ కుటుంబంలో దసరా శోభతో శోభాయమానంగా వెలిగిపోతోంది. అమ్మవారికి పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తూ ఎక్కడా తగ్గకుండా తమ భక్తి పాటవాలను చాటుకుంటూ వెళ్తున్నారు.

ఇక ఇదంతా జరుగుతున్న సమయంలో రఘురాం కి పాతిక లక్షల రూపాయలు అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వస్తాడు. ఈ విషయం కొద్ది రోజుల నుంచి కమింగ్ అప్ లో చూపిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ రోజు ఎపిసోడ్ లో ఆ వ్యక్తి ఇంటికి వచ్చినట్లు చూపించారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
ప్రాయశ్చిత్తం

ప్రాయశ్చిత్తం

ఇంటికి వచ్చిన వ్యక్తి అమ్మవారి పూజలు బాగా చేస్తున్నారు అని ప్రశంసించడంతో రఘురాం కుటుంబ సభ్యులు ఆనందపడతారు అయితే ఆ తర్వాత తనకు కూడా అమ్మవారి దయ వల్ల వ్యాపారంలో కలిసి వచ్చిందని ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అని అంటాడు. దాని కోసం తాను ఇచ్చిన పాతిక లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరాడు.

అయితే పాతిక లక్షల రూపాయలు కావాలి అంటే పది రోజులు ముందు చెప్పు అన్నాను కదా అంటే అవును పది రోజుల తర్వాత ఇవ్వమని అంటాడు. అయితే ఆ డబ్బు తీసుకుని కూడా ఎక్కువ రోజులు కాలేదు కదా అంటే నాకు అవన్నీ అనవసరం నాకు మరో పది రోజుల్లో పది లక్షల రూపాయలు కావాల్సిందేనని పట్టుబడతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు తర్వాత కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం శిల్ప తాను తప్పు చేసినట్లు కుటుంబం అందరి ముందు ఒప్పుకున్నట్లుగా చూపించారు తనకు ప్రాయశ్చిత్తం కావాలని కోరుతున్నట్లుగా చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X