Vadinamma : గండం గట్టెక్కింది అనుకుంటుండగా మరో షాక్.. కుటుంబం మొత్తం మీద రౌడీల ఎటాక్?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలా ఈ సీరియల్ ఈ రోజుతో 668వ ఎపిసోడ్ కి చేరింది. ఇప్పటికే శిల్ప తన తల్లి దుర్మార్గాలు తెలుసుకుని మంచిగా మారుతుంది. కుటుంబంలో అన్ని టెన్షన్లు క్లియర్ అయ్యాయి అనుకుంటున్న తరుణంలో రఘురాంకి అవసరం అయిన సమయంలో పాతిక లక్షలు అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి మరీ షాక్ ఇచ్చాడు. తనకు వేరే వ్యాపారం మొదలు పెట్టే అవకాశం రావడంతో ఆ డబ్బు వెంటనే కట్టాలని డెడ్ లైన్ పెడతాడు.

రఘురామ్ ఇప్పటికిప్పుడు ఎలా ఇవ్వాలి అని అడిగినా ఇవన్నీ నాకు అనవసరం నా డబ్బు నాకు కావాలని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఆ డబ్బు ఎలా అయినా సర్దాలనే ఉద్దేశంతో రఘురాం మొదలు సిరి దాకా అందరూ ఏదో ఒక పని చేస్తూ ఆ డబ్బు కూడపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చూపారు. అలా అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగా తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది పరిశీలిద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

పచ్చళ్ళు పెట్టీ

పచ్చళ్ళు పెట్టీ

గత ఎపిసోడ్ లో సీత పచ్చళ్ళు ఎలా పెట్టాలి అనే విషయం శిల్పకు నేర్పించడంతో శిల్ప పచ్చళ్ళు కూడా పెట్టి అమ్మడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఆ డబ్బు తీసుకెళ్లి తన అక్క సీతకు ఇస్తుంది. తాను కూడా కుటుంబం సమస్యలలో ఉన్నప్పుడు ఎంతో కొంత సహాయం చేస్తున్నాను అని శిల్ప ఆనంద పడుతూ ఉంటుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగా గతంలో రఘురాం వద్ద పనిచేసిన రమణ అనే వ్యక్తి కి సంబంధించిన కుమారుడు నరసింహ వెతుక్కుంటూ రఘురాం షాప్ వద్దకు వస్తాడు.

షాపులో భరత్ వుండగా గుర్తుపట్టి నువ్వు భరత్ కదా అని అతను ప్రశ్నిస్తాడు. అవును నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను అని భరత్ అడిగితే నేను రమణ బాబాయ్ కొడుకుని అని అంటాడు. అయితే నువ్వు దుబాయిలో ఉండే వాడివి కదా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే తనకు దుబాయిలో ఉద్యోగం పోయిందని ఉద్యోగం వెతుక్కుంటున్నా అని అంటాడు.

ఉద్యోగం కోసం

ఉద్యోగం కోసం

ప్రస్తుతం గుంటూరులో తన అత్తగారింట్లో ఉంటున్నానని ఉద్యోగం వెతికే పనిలో భాగంగా ఇక్కడికి వచ్చాను అని అంటాడు. తమ దగ్గరకు ఉద్యోగం కోసమే వచ్చాడు అన్న విషయం అర్థం చేసుకున్న భరత్ ఇప్పుడు తమ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని నీకు సహాయం చేసే స్థితిలో లేము అని అంటాడు. ఎందుకైనా మంచిది అన్నయ్య ఒక మాట అడిగి చెపుతాను అంటే రఘురాం అన్నయ్యను అడిగితే కాదనడు మీరు ఇబ్బందుల్లో ఉన్నా నాకు సహాయం చేస్తాడు కానీ అలా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని అతను వెళ్ళిపోతాడు.

వెళుతున్న సమయంలో భరత్ అతని ఫోన్ నెంబర్ తీసుకుంటాడు ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి అన్నయ్య రఘురాంకు చెబుతాడు. ఇలా వచ్చి వెళ్లిన సంగతి తెలుసుకుని రఘురాం బాధపడతాడు. మన ఇబ్బందుల్లో ఉన్నా సరే వేరే వారికి సహాయం చేసినప్పుడే దానిని అసలైన సహాయం అంటారు అని అంటుంటే నేను ఎందుకైనా మంచిది అని అతని ఫోన్ నెంబర్ తీసుకున్నాను అని భరత్ అంటాడు.

అండగా నిలబడ్డ రఘురాం

అండగా నిలబడ్డ రఘురాం

మంచి పని చేసావు అని చెబుతూ అతనికి ఫోన్ చేసి వెంటనే వెనక్కి రావాలి అని రఘురాం కోరతాడు. ముందు తటపటాయించినా సరే రఘురాం పట్టుబట్టడంతో నరసింహ వస్తాడు. అలా వచ్చిన తర్వాత తన పరిస్థితి మొత్తం చెబుతాడు మీ నాన్న ని ఇబ్బంది పెట్టావు ఆ ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుండేది అంటే అలా ఇబ్బంది పెట్టినందుకు ఇప్పుడు నేను అనుభవిస్తున్నా అని ఆ తప్పు ఇప్పుడు తెలిసి వచ్చిందని నరసింహ అంటాడు.

అతనిని కడుపునిండా భోజనం పెట్టి పదివేల రూపాయల డబ్బు ఇచ్చి రఘురాం ఇంటికి వెళ్లి తనకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి రమ్మని అంటాడు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా సరే తనకు ఉద్యోగం ఇవ్వడాన్నికి చూసి నరసింహ తట్టుకోలేక రఘురాం ముందు కన్నీళ్లు పెట్టుకుంటాడు.

 మరో కొత్త సమస్య

మరో కొత్త సమస్య

ఇక గడువు దగ్గరికి రానే వచ్చింది రఘురాం బయట ఎక్కడో 10 లక్షల రూపాయలు అప్పు తీసుకొస్తాడు. మరో 15 లక్షలు ఉంటే ఈ గండం నుంచి మనం బయట పడగలను అని చెబుతూ డబ్బు కూడపెట్టిన సంచి తీసుకురమ్మని కోరుతాడు. అలా డబ్బు లెక్క వేస్తున్న సమయంలో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. ఇక తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం శిల్ప అన్న కిషోర్ కుటుంబం మీద ఎటాక్ చేయడానికి ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే అది స్పష్టంగా అయితే చూపియ్య లేదు.

దిగజారిన రేటింగ్స్

దిగజారిన రేటింగ్స్

ఇక గతంలో టాప్ రేటింగ్ సొంతం చేసుకొన్న వదినమ్మ సీరియల్ ఇప్పుడు స్లాట్ టైమింగ్ మార్చడంతో రేటింగ్ పరంగా తగ్గింది. 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో 5.12 రేటింగ్ సొంతం చేసుకోగా, 39వ వారంలో 5.57 రేటింగ్ సాధించింది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 38వ వారంలో 4.20 రేటింగ్‌ను సాధించగా, 39వ వారం 4.68 రేటింగ్‌ను సాధించింది. అయితే కొత్త సమయం అలవాటు పడితే మళ్లీ రేటింగ్ యధావిధిగా వచ్చేస్తుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X