For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : ట్విస్ట్ ల మీద ట్విస్టులు.. 25 లక్షల దొంగతనం, దొంగ దొరికాక మళ్ళీ మరో సారి?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలా ఈ సీరియల్ ఈ రోజుతో 669వ ఎపిసోడ్ కి చేరింది. ఇప్పటికే శిల్ప తన తల్లి దుర్మార్గాలు తెలుసుకుని మంచిగా మారుతూ పచ్చళ్ళు కూడా పెట్టి అమ్ముతూ ఉంటుంది. కట్టాల్సిన ఆ డబ్బు కూడపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చూపారు. అలా అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగా తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది పరిశీలిద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  పది లక్షలు

  పది లక్షలు

  పాతిక లక్షలు తిరిగి కట్టాల్సిన గడువు దగ్గర పడడంతో రఘురాం ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకుని మొత్తం కుటుంబం అంతా ఎంత సంపాదించింది అనే విషయం లెక్క పెట్టాలని సీతను అడుగుతాడు. సీత కూడా ధైర్యంగా భర్త కోరిక మేరకు ఎంత డబ్బులు జమ అయ్యాయి అనే విషయం మీద అందర్నీ కూర్చోబెట్టి లెక్కల మొదలుపెడుతుంది. అయితే మొదట లెక్క వేస్తే 22,000 తక్కువ ఏడు లక్షల రూపాయలు జమ అయ్యాయి అనే విషయం తెలుస్తుంది. రఘురాం 10 లక్షల రూపాయలు అప్పు తీసుకురావడంతో మరో 8,00,022 రూపాయలు ఉంటే అప్పు తీరుతుంది అని అంటుంది.

  లక్ష్మణ్ కూడా అప్పు తెచ్చి

  లక్ష్మణ్ కూడా అప్పు తెచ్చి

  ఎలా ఇప్పుడు ఎనిమిది లక్షల రూపాయలు ఎలా సంపాదించాలి అని రఘురాం టెన్షన్ పడుతున్న సమయంలో లక్ష్మణ్ వస్తాడు. ఏమైంది అని అందరూ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అంటే మనం ఎంత కష్టపడినా మన సమస్య తీరలేదు ఇంకా ఎనిమిది లక్షల 22వేల రూపాయలు మైనస్ లో మనం ఉన్నాము అనే విషయాన్ని అతనికి తెలియజేస్తారు కుటుంబ సభ్యులు. ఇలా చివరి నిమిషంలో ఇబ్బంది పడతావు అనే ఉద్దేశంతో నేను నా ఆఫీస్ లో 5 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను అని చెబుతూ ఐదు లక్షల రూపాయలు అన్నయ్యకు ఇస్తారు. ఇంకా ఎంత అవసరం రావచ్చు అంటే మూడు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు అవసరం పడతాయి అని అంటుంది.

  నాని చేయి వేస్తే

  నాని చేయి వేస్తే

  ఈ డబ్బు ఎలా కూడా పెట్టాలి అని మళ్ళీ ఆలోచిస్తున్న సమయంలో అప్పుడే నాని ఎంట్రీ ఇస్తాడు వస్తూ వస్తూ ఈ మూడు లక్షలు ఈ రోజు నా సంపాదన అని వదిన కి ఇస్తాడు.. వెంటనే ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు ఒక్క రోజులో మూడు లక్షలు సంపాదన ఎలా రా అని అడిగితే నేను సంపాదించలేదు అని అప్పు చేశాను అని అంటాడు. తన స్నేహితుడు నరేంద్ర దగ్గర అవసరమవుతాయని ఉద్దేశంతో మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాను అని నాని వెల్లడిస్తాడు. నాని చేసిన పనికి శిల్ప చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది. అతనిని వాటేసుకుని మరి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు శిల్ప పడుతున్న టెన్షన్ చూసిన సీత ఇప్పుడు నీ టెన్షన్ తీరిందా? అని అడిగితే తీరింది అని అంటుంది.

  అమ్మ సాయం

  అమ్మ సాయం

  అయితే ఇంకా 22 వేల రూపాయలు సమకూర్చాల్సి ఉండగా ఇప్పుడు ఇప్పుడు 22,000 ఎవరు ఇస్తారు అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో రఘురాం తల్లి కల్పించుకుని నా గదిలోకి వెళ్లి నా మందుల డబ్బాలో డబ్బులు ఉన్నాయి తీసుకురమ్మని అంటుంది. అలా తీసుకు వస్తే అందులో పాతిక వేల రూపాయలు ఉంటాయి. గత పది రోజుల నుంచి మీరు సంపాదించిన డబ్బులు ఇస్తున్నారు కానీ నా డబ్బులు ఇవ్వలేదు కదా ఇది నా డబ్బు అని ఇస్తుంది.. అదేంటమ్మా నువ్వు బయటకు వెళ్లవు కదా నీకు ఇంత డబ్బు ఎక్కడిది అని ప్రశ్నిస్తాడు.. నా దగ్గర ఉండకూడదా నువ్వు ఇచ్చిన డబ్బు ని కొంచెం కొంచెం దాచుకుంటే ఇంత అయింది, నేను బతికున్నంత వరకు వీటి అవసరం రాదు అనుకున్నాను కానీ ఇప్పుడు ఇలా ఉపయోగపడుతున్నాయి అంటుంది.

  డబ్బు దొంగతనం

  డబ్బు దొంగతనం

  ఇక రఘురాం అప్పు ఇవ్వాల్సిన వ్యక్తి కి ఫోన్ చేసి మీ డబ్బు రెడీగా ఉంది మీరు వస్తారా నన్ను వచ్చి ఇమ్మంటారా? అని అడిగితే రేపు మీరు జాతర కు వస్తారు కదా అక్కడికి తీసుకు రావాలి అని ఆ వ్యక్తి చెబుతారు. ఆ రోజు రాత్రికే రఘురామ్ ఇంట్లో దూరిన దొంగ పాతిక లక్షల రూపాయలు దొంగిలించి పారిపోతున్న సమయంలో భరత్ కి చేతికి చిక్కుతాడు. పట్టుకుని అతన్ని నాలుగు తగిలించి అడిగితే ఆకలిగా ఉంది అని అందుకే లోపలికి వచ్చాను అని అబద్ధం చెబుతాడు. అయితే అతన్ని కనికరించి వదిలేస్తారు. ఇంతలో బాధలో ఉన్న కిషోర్ తన స్నేహితులకు ముందు పోయించి వాళ్లని రఘురాంను చంపేయాలి అని వాళ్ళని అడిగితే చంపకుండా నరకం చూపాలి అని నూరిపోస్తారు. ఈ క్రమంలో మరో కొత్త స్కెచ్ రెడీ చేసినట్లు కనిపిస్తోంది. ఇక కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం జాతరకు ఒక పక్క శైలు తండ్రి అలాగే కిషోర్ పంపించిన అతని స్నేహితులు కూడా వచ్చారు. డబ్బు బ్యాగ్ ను దొంగతనం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలని ఉంది ఏం జరగబోతుంది అనేది..

  English summary
  Vadinamma Episode 669: The family feels elated as Nani helps them collect the money. On the other hand, Kishore comes up with an evil plan against Raghuram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X