For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : శిల్ప మాస్టర్ స్కెచ్.. బకెట్ నీళ్ళతో రఘురామ్ ఫ్యామిలీకి 40 లక్షల నష్టం!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 647వ ఎపిసోడ్ కి చేరింది. ఎలా అయినా భర్త కుటుంబంలో సమస్యలు ఏర్పడేలా చేసి తన భర్తను ఇల్లరికం తీసుకువెళ్లాలని శిల్ప అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ముందుకు తల్లి సపోర్టుతో ప్లాస్టిక్ బియ్యం వ్యవహారంతో తలనొప్పి తీసుకురాగా ఆ విషయం నుంచి ఈజీగానే బయట పడతారు.

  అయినా సరే మరో ప్లాన్ సిద్ధం చేస్తుంది దమయంతి. పార్వతి అండతో రఘురాం ఫ్యామిలీకి ఆ బిజినెస్ కి అండగా నిలబడిన వ్యక్తిని కొనేసి రఘురాం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటుంది. ఎదుర్కొన్న కుటుంబానికి మరో టెన్షన్ తెచ్చింది శిల్ప.. ఇక తాజాగా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar

  గుడికి వెళ్తూ

  గుడికి వెళ్తూ

  శిల్ప నాని, రఘు రామ సీత, భరత్ సిరి, లక్ష్మణ్ శైలు ఇలా నాలుగు జంటలు అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి ఇంటికి దగ్గర్లో ఉన్న గుడికి బయలుదేరుతారు. 25 కిలోమీటర్ల దూరానికి కారు ఎందుకు అనే ఉద్దేశంతో కొత్తగా కొన్న ట్రక్ లోనే బయలుదేరుతారు.. అందులో ఆనందంగా గడుపుతూ వెళుతూ ఉండగా శిల్ప తల్లి వీళ్ళు అలా వెళ్తున్న దృశ్యం చూస్తుంది.. కారు ఆపి మరి ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న మరో మహిళ ఆమెను కించపరిచే విధంగా మాట్లాడుతుంది..

  అయితే చిన్నప్పటి నుంచి శిల్పకు అలా బతకడమే ఇష్టమని అందుకే అత్తారింటికి వెళ్ళిన తర్వాత తన కోరికలు తీర్చుకుంటూ ఉందని కవర్ చేసే ప్రయత్నం చేసింది. నువ్వు కవర్ చేయవద్దు నాకు అర్థం అయిపోయింది అంటూ ఆ మహిళ మళ్ళీ అవమానిస్తుంది.

  గుడిలో ఆనందంగా

  గుడిలో ఆనందంగా

  ఇక ఆ తర్వాత రఘురామ్ సహా మిగతా కుటుంబ సభ్యులందరూ గుడికి వెళ్ళగా గుడిలో అర్చన చేయిస్తూ ఉంటారు.. పిల్లల పేర్లు గోత్రం చెప్పమంటే ఋషి గురించి పుట్టిన సమయం తో సహా అన్ని విషయాలు చెప్పిన సీత వైదేహి పుట్టిన సమయం విషయంలో మాత్రం కాస్త తడబడుతుంది. అయితే అప్పటికప్పుడు సిరి ఆ విషయాన్ని చెప్పి పూజ చేయించినా సరే శిల్ప మాత్రం ఈ విషయాన్ని హైలెట్ చేసి వాళ్ళ కుటుంబం మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తుంది.

  పూజ అంతా అయిపోయిన తర్వాత సిరిని పక్కకు తీసుకెళ్లి రిషి పుట్టిన సమయం లోనే సీత మరో బిడ్డని కంటే ఆ బిడ్డ చనిపోయాడు కదా అయినా సరే ఋషి పుట్టిన సమయం బలే గుర్తు ఉంది కానీ వైదేహి పుట్టిన సమయం ఎందుకు గుర్తు లేదు అంటూ ఆమె మనసులో కొత్త సందేహాలు పుట్టించే ప్రయత్నం చేస్తుంది. అయితే సిరి మాత్రం పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకున్నట్లు కనిపించలేదు.

  ఆనందంగా గడుపుతూ

  ఆనందంగా గడుపుతూ

  ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా గడుపుతారు. అక్కడే ఆహారం తీసుకుంటూ ఉంటారు ముగ్గురు అన్నదమ్ములు అయితే చిన్న పిల్లలుగా మారిపోయి మరీ ఆడుకుంటూ ఉంటారు. సరిగ్గా ఇదే సమయంలో రఘురామ్ కి ఒక ఫోన్ వస్తుంది ఒక ఫుడ్ కాంట్రాక్టర్ కి దాదాపు నలభై లక్షల రూపాయలు సరుకు కావాలని ఆర్డర్ వస్తుంది.

  అది మీరు చేయగలరా లేదా అని ప్రశ్నించగా కచ్చితంగా చేసి తీరుతామని రఘురామ్ చెబుతాడు. అయితే ఫోన్ పెట్టేసిన తర్వాత ఆర్డర్ అయితే ఒప్పుకున్నాను గాని ఎలా సరుకు తీసుకువచ్చి వాళ్లకి అందజేయాలి అనేది అర్థం కావడం లేదు అని అనడంతో లక్ష్మణ్ ముందుకు వచ్చి ఇప్పుడు అందరూ తమ సొంత డబ్బులు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయడం లేదు బ్యాంకులో రుణాలు తీసుకునే వ్యాపారం చేస్తున్నారు మనం కూడా అలాగే చేద్దాం అని అంటారు.

  కొత్త ప్లాన్

  కొత్త ప్లాన్

  ఇక వెంటనే రఘురాం సహా కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వచ్చాక కూడా ఇదే విషయాన్ని మరోసారి డిస్కస్ చేసి ఆ తర్వాతి రోజు పెద్ద ఎత్తున లోడ్ ఇంటికి దింపుతాడు. నిజానికి అంతకు ముందు స్టోర్ రూమ్ ఉండేది కాబట్టి స్టోర్ రూమ్ లో సరుకులు పెట్టే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని డెలివరీ చేసే వాళ్ళు. కానీ ఇంట్లో ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా దానిని కాపాడుకునే బాధ్యత సీతకు అప్పగిస్తాడు.

  Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
   సరుకుల్లో నీళ్ళు

  సరుకుల్లో నీళ్ళు

  అయితే ఎలా అయినా ఈ వ్యవహారంలో వాళ్లకు నష్టం కలిగే చేయాలని భావిస్తున్న శిల్ప ఎవరూ లేని సమయంలో ఆ సరుకులలో నీళ్లు పోసినట్టు చూపిస్తున్నారు.. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా పార్వతి దుర్గ ఎలా కుటుంబంలో చిచ్చు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు.. ఇలా రఘురామ్ కి పాతిక లక్షల రూపాయల ఆర్డర్ వచ్చిందని ఆ ఒక్క ఆర్డర్ తోనే లక్షల రూపాయల లాభం పొందుతారని దుర్గ పార్వతికి నూరిపోస్తూ ఉంటుంది.. దానిని ఎలా నాశనం చేయాలని పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది. కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం శిల్ప సరుకు మొత్తాన్ని నాశనం చేసినట్లుగానే చూపిస్తున్నారు.. మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  English summary
  Vadinamma Episode 647: Shilpa misleads Siri against Sita. Later, Sita comes up with a clever plan to store the groceries.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X