For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : శిల్ప దెబ్బకు అల్లకల్లోలం.. రోడ్డున పడ్డ భరత్, సిరి!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 649వ ఎపిసోడ్. కి చేరింది. ఎంతో ఘనంగా నాని శిల్పల పెళ్లి చేసి వాళ్ళ శోభనాన్ని కూడా నాటకీయ పరిణామాల మధ్య తమ ఇంట్లోనే జరిపిస్తారు సీతా, రఘురామ్ లు. అయితే ఇప్పుడు ఎలా అయినా తన భర్త నానిని ఇక్కడ ఉంచకుండా తన ఇంటికి ఇల్లరికం తీసుకువెళ్లాలి అని శిల్ప అనేక ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ముందు నుంచి ఇదే ఐడియా మీద ఉన్న దమయంతి కూడా తన కూతురు ఎలా అయినా తన అల్లుడుని తీసుకుని ఇంటికి వచ్చేస్తే బాగుండు అని ఆమెకు అనేక సలహాలు ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ఇచ్చిన సలహా ఫలించింది. ఒక ఆర్డర్ డెలివరీ కోసం తీసుకొచ్చిన సామాన్లు అన్నింటిని శిల్పం నాశనం చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  శైలు కావాలనే నీళ్లు పోసిందా

  శైలు కావాలనే నీళ్లు పోసిందా

  తనవల్ల నీళ్లు ఒలికి పోలేదని సిరి చెబుతుంటే సిరి వల్లే నీరు ఒలికి పోయాయని శైలు అంటుంది. అయితే శైలు కావాలని నీళ్లు పోసిందని సిరి అనుకుంటూ ఉంటుంది. ఎవరికి కూడా శిల్ప మీద అసలు అనుమానమే రాదు. దీంతో ఒకరికొకరు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు సిరి ప్రతి విషయంలోనూ చాలా ముక్కుసూటిగా ఉంటుందని ఏదైనా తప్పు చేసినా చేశాను అని ఒప్పుకుంటుంది కానీ ఈ విషయంలో ఎందుకు ఒప్పుకోవడం లేదు అర్థం కాలేదని శైలు అంటుంది. అయితే ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి కాదని జరగాల్సిన గురించి ఆలోచించాలని లక్ష్మణ్ తన భార్యకు చెబుతూ ఉంటాడు.

  మర్చిపోలేను

  మర్చిపోలేను

  అయితే శైలు మాత్రం ఈ విషయాన్ని అంత త్వరగా మర్చిపోలేను అని తనను అన్ని మాటలు అన్న సిరితో తాను మాట్లాడలేదని అంటే అది ఉమ్మడి కుటుంబంలో ఇవన్నీ మామూలే అని మనమే సర్దుకుపోవాలి అని అంటాడు. మరో పక్క సిరి, భరత్ గదిలోకి పరిస్థితి దారుణంగా ఉంటుంది ఏడుస్తూనే ఉంటుంది. ఎక్కిళ్లు వస్తున్న ఏడుస్తూనే ఉండడంతో భరత్ సముదాయించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎప్పుడూ లేనిది శైలు కూడా ఇలా మాట్లాడడం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అంటుంది.. ఒక్కోసారి భయం కూడా అబద్ధం చెప్పేలాగే చేస్తుందని నిజం నిలకడ మీద తెలియాలి కానీ మనం ఎంత తాపత్రయపడినా అది తెలియదు అని భరత్ అంటాడు. అయితే ఇప్పుడు రఘు బావ కూడా సీతక్క మాటలు విని నావల్ల తప్పు జరిగింది అనుకుంటాడు కదా అంటే అలాగే అనుకుంటాడని నా విషయంలో కూడా అదే జరిగింది కదా అని అంటాడు..

  ఏడుస్తున్న సిరి

  ఏడుస్తున్న సిరి

  మన ఇద్దరి కారణంగా ఈ ఇంట్లో వాళ్లకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి కదా ఈ ఇందులో నా తప్పు లేదని తేలే వరకు గది దాటి బయటకు రాను అంటుంది. ఇంతలో రఘురాం సీత మాట్లాడుకుంటూ అయిందేదో అయింది మనం నష్టపోయినా సరే మాట ఇచ్చిన వారికి ఆర్డర్ ఇవ్వాల్సిందే. అందుకు వేరే చోట అప్పు చేద్దాం అని చెబుతూ రఘురాం సీత సహా వేరేచోట అప్పు తీసుకురావడానికి వెళ్తాడు. ఈ లోపు శిల్పా తన తల్లికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెబుతోంది.. అంతేకాక వాళ్ళు స్వయంకృతాపరాధం చేశారు అని అడిగినప్పుడు నానిని ఇల్లరికం పంపించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా అంటుంది. అయితే సీత వాళ్ళు అలా వెళ్లారో లేదో భరత్, సిరి కూడా తన పాపను తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోతారు. ఎక్కడికి వెళ్లారు అనే సంగతి మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.

  మందుల సాకుతొ

  మందుల సాకుతొ

  తనకు మందులు కావాలనే ఉద్దేశంతో రఘురాం తల్లి సిరిని పిలిస్తే ఎంత సేపటికి ఆమె రాదు. అయితే శైలు కూడా విని విననట్టు గా నటిస్తూ ఉండడంతో లక్ష్మణ్ మందలించి అమ్మకు మందులు కావాలంట ఇచ్చినా అన్నాడు అయితే ఇప్పటి వరకు అన్ని తిట్టి మళ్ళీ ఎంత ప్రేమగా పిలుస్తుంది చూడు వాళ్ళు వాళ్ళు ఒకటే నేను వెళ్ళను అంటుంది.. అలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పి పంపిస్తే ఆ మందులు నీకు తెలియవు కొత్త మందులు కదా సిరి కి మాత్రమే తెలుస్తాయి ఒక్కసారి ఏమీ అనుకోకుండా ఆ గదిలోకి వెళ్లి రావా అని ఆమె అంటుంది. ఉమ్మడి కుటుంబం అన్నాక చిన్న చిన్న తల నొప్పులు వస్తూ ఉంటాయి..

   రోడ్డున పడ్డ భరత్, సిరి

  రోడ్డున పడ్డ భరత్, సిరి

  వాటన్నింటినీ తట్టుకుని ముందుకు వెళ్లాలి అని అంటుంది. అయితే సిరి కోసం వెళ్ళగా అక్కడ సిరి గాని భరత్ గాని పాప గాని కనిపించరు. దీంతో కుటుంబంలో మళ్ళీ కొత్త టెన్షన్ మొదలైంది.. చాలా సేపు ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ అన్నకు చెబుదామని ఫోన్ చేయగా అప్పటికే రఘురాం ఇంటికి చేరుకుంటాడు.. ఏదైనా గుడి కి వెళ్ళారేమో అనుకుంటే గుడికి అయితే చెప్పి వెళ్తారు కదా పాపను తీసుకుని ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ ఉండగా నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక తర్వాత ఎపిసోడ్ లో భరత్ తన భార్య ను, తీసుకుని పాపతో సహా రోడ్డున పడ్డాడని చూపించారు. రోడ్డు మీద పాపతో సహా నిదురిస్తున్నట్లు గా చూపించారు అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది.

  English summary
  Vadinamma Episode 649: Raghuram decides to take a loan to cover up the loss. Elsewhere, Laxman and his family are worried as Siri and Bharat go missing.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X