For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : శిల్ప దెబ్బకు అతలాకుతలం.. భరత్, సిరి మాయం.. ఇప్పుడు శైలు వంతు!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ నేడు 651వ ఎపిసోడ్ కి చేరింది. తన భర్తతో పాటు రఘురామ్ ఇంట్లోనే ఉంటున్న శిల్ప ఎలా అయినా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టాలని తల్లితో పాటు అనేక ప్లాన్లు వేస్తూ ఉంటుంది. అయితే చాలా ప్లాన్లు విఫలమైనా సరే చివరికి ఒక ప్లాన్ మాత్రం సక్సెస్ అవుతుంది. దాదాపు పాతిక లక్షల రూపాయలు నష్టం వచ్చేలా ప్లాన్ చేయడంతో కుటుంబ సభ్యుల మధ్య వివాదం మొదలవుతుంది. ఈ వివాదం నేపథ్యంలో సిరి మీద మీద కుటుంబ సభ్యులు అందరూ టార్గెట్ చేయడంతో సిరి ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది. తన భర్తతో కలిసి బయటకు వెళ్లిపోవాలని ప్లాన్ చేసి పాపను తీసుకుని బయటకు వెళ్లి పోతారు. వాళ్ళు అలా వెళ్లిపోయిన సంగతి తెలుసుకున్న రఘురామ్ అలాగే మిగతా కుటుంబ సభ్యులు వారిని వెతికేందుకు అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తుంటారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   పొడుస్తున్నట్టుగా

  పొడుస్తున్నట్టుగా

  భరత్ అలాగే సిరి ఇద్దరూ కూడా ఒక గుడిలో దాక్కుంటారు అయితే రఘు రామ్, సీత నేరుగా ఆ గుడికి వచ్చి వెతకడం తో ఇక ఈ ఊరిలో ఉండడం కరెక్ట్ కాదని రఘు రామ్ కి ఈ ఊరిలో అందరూ తెలిసిన వాళ్లే కాబట్టి ఎలా అయినా ఇక్కడ ఉంటే తెలిసిపోతుందని కొన్నాళ్ళు వేరే ఊరు వెళ్లి పోదాం అని భావిస్తారు. అలా అనుకుంటూ వేరే ఊరికి వెళ్దామని పయనమవుతారు. అయితే ఎంత సేపు వెతికినా దొరకకపోవడంతో రఘురాం సీత ఇంటికి చేరుకుంటారు వారు చేరుకొని బాధపడుతున్న కొద్దిసేపటికి వారిని వెతకడానికి లక్ష్మణ్ అలాగే శైలు కూడా ఎక్కడా దొరకలేదు అనే ఉద్దేశంతో వెనక్కి తిరిగి వస్తారు. అయితే అందరూ కూడా నిద్రపోకుండా అక్కడే కూర్చుని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో సీత భరత్ ను ఎవరో పొడిచినట్లు గా కల కంటుంది. ఆ కల కలగడంతో ఒక్కసారిగా అరుపులు కేకలు పెట్టడంతో మిగతావాళ్లు అందరూ అలర్ట్ అవుతారు. సీత విషయం చెప్పగా అది నీ భ్రమ అని దయచేసి అలాంటి వాటి గురించి ఆలోచించవద్దు అని అంటారు.

   జానకి కలగనలేదు

  జానకి కలగనలేదు

  ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగా మరో పక్క భరత్, సిరి ఏం చేయాలా అని ఆలోచిస్తూ రోడ్డు మీద ఒక చోట కూర్చుని ఉంటారు. తెల్లవారి 4:30 సమయంలో రామచంద్ర వీళ్ళని గమనిస్తాడు. ఇప్పటికే వదినమ్మ సీరియల్ మిగతా సీరియల్స్తో కొన్నిసార్లు కొలాబరేట్ అవుతున్నట్లు చూపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జానకి కలగనలేదు సీరియల్ నుంచి రామచంద్ర స్నేహితుడిగా భరత్ను చూపించారు.

  రామచంద్ర అండతో

  రామచంద్ర అండతో

  తన కోసమే ఈ ఊరు వచ్చారు అని భావించిన రామచంద్ర పద ఇంటికి వెళదామని అంటాడు, అయితే ముందు ఈ విషయం రామచంద్రకు చెప్పకుండా ఉండాలని అనుకున్నా చివరికి విషయం చెప్పి ఇంట్లో నుంచి వచ్చేశాం కాబట్టి ఇప్పుడు మీ ఇంటికి కూడా రాలేమని అంటారు. అయితే ముందు షాక్ అయినా సరే తర్వాత కాస్త కోలుకొని ఎలా అయినా మీకు నేను సహాయం చేస్తానని చెబుతూ మా స్వీట్ షాప్ పక్కన రెండు గదులు ఖాళీగా ఉన్నాయని జానకి గారికి కూడా చెప్పకుండా మీరు అక్కడ ఉండే ఏర్పాటు చేస్తాం అని అంటాడు.

  పెను విద్వంసం

  పెను విద్వంసం

  ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒక పక్క కుటుంబమంతా బాధపడుతోంది, అయితే శిల్ప మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని అంతటినీ తన తల్లికి ఫోన్ ద్వారా చేరవేస్తుంది. దమయంతి కూడా నువ్వు చాలా అద్భుతాన్ని చేసావు ఇలాగే ముందుకు వెళితే కొద్ది రోజులలో నీ భర్తతో సహా మన ఇంటికి వచ్చేయొచ్చు, ఇప్పుడు దెబ్బ తగిలింది కాబట్టి వెంటనే మరో దెబ్బ కొట్టమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక మరో పక్క జరిగిన విషయం అంతా తీసుకెళ్లి దుర్గ పార్వతి కి చేరవేస్తుంది తన కూతురు మనవరాలితో సహా వెళ్లిపోయిన సంగతి తనకు చెప్పకపోవడం ఉండడం మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  శైలు మరో షాక్

  శైలు మరో షాక్

  పద వెళ్లి వాళ్ళ సంగతి తేలుస్తాను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మరో పక్క వాళ్ళు వెళ్ళిపోయింది తన వల్లేనని సీత బాధ పడుతూ ఉండగా శిల్ప వాళ్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఆమె తప్పు కనిపించింది కాబట్టి అన్నారు, వాళ్లే కాస్త ఓపిక పట్టి ఉండాల్సిందని శిల్ప అంటుంది. ఇక అలా జరుగుతూ ఉండగా నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక తర్వాత ఎపిసోడ్ లో శైలు తన పుట్టింటికి వెళ్ళిపోతానని బ్యాగ్ తీసుకుని బయలుదేరడం చూపించారు.. వచ్చిన వాళ్ళందరూ తన వల్ల సిరి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందని అనడం తనకు నచ్చడం లేదని చెబుతూ ఆమె బ్యాగ్ తీసుకుని బయలుదేరినట్లు చూపించారు. అయితే రఘురాం సహా మిగతా కుటుంబ సభ్యులందరూ శైలుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది.

  English summary
  Vadinamma Episode 651: Bharat decides to take shelter at Rama Chandra's village at his request. On the other hand, Sita feels guilty for hurting Siri.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X