For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : పాపం శిల్ప, దమయంతి.. స్కెచ్ రివర్స్.. సీతకు అడ్డంగా దొరికిన శిల్ప!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 655వ ఎపిసోడ్ కి చేరింది. ఎలా అయినా భరత్, సిరి బయటకు వెళ్లి పోయిన విషయం గురించి ఇంట్లో పెద్ద రాద్ధాంతం చేయాలని భావించి అందుకు అనుగుణంగా దుర్గ పెద్ద రాద్ధాంతం సృష్టిస్తుంది. అంతేకాక తన కూతురిని దుర్గ మాటలు అనే లాగా చేసి కావాలని అక్కడి నుంచి తన కూతుర్ని అల్లుడిని తీసుకువెళ్లాలని దమయంతి ప్లాన్ చేయగా దానికి రఘురాం అడ్డుపడతాడు.

  ఈ రోజు సాయంత్రం లోగా భరత్, సిరి తిరిగి వస్తారని ఒక వేళ అలా రాకపోయే పక్షంలో అప్పుడు నువ్వు నీ కూతుర్ని అల్లుడిని ఇల్లరికం తీసుకువెళ్లాలని చాలెంజ్ చేస్తాడు. అయితే నిజానికి ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ ఈ విషయంలో షాక్ అవుతారు. భరత్, సిరి ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా ఇలా చాలెంజ్ చేయడం ఇవ్వడానికి బాధపడుతూ ఉంటారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar

  రఘురాం ఛాలెంజ్

  రఘురాం ఛాలెంజ్

  రఘురాం చేసిన ఛాలెంజ్ విషయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ భరత్, సిరి ఎలా అయినా ఇంటికి వచ్చి రఘురామ్ మాట మీద వాళ్ళు రావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే శిల్ప మాత్రం రఘురాం బావ ఇలా ఎందుకు అన్నాడు? అంటే వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు ఆయనకు తెలుసా ? ఆయనకు తెలిసే అమ్మతో పందెం కట్టాడా? వాళ్ళిద్దరూ రాకుండా ఉండి తాను నాని ఇంటికి వెళ్లి పోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటుంది.

  నానికి హగ్

  నానికి హగ్

  ఇంతలో అక్కడికి వచ్చిన నాని నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు ఒక వేళ మా భరత్ అన్న సిరి వదిన వచ్చాక మీ అమ్మ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నావా అని అడగగా పిచ్చివాడా వాళ్లు రారు రాకపోతే నీ పరిస్థితి ఏమిటో అని ఆలోచిస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ పైకి మాత్రం వాళ్లు వచ్చేయాలని నేను నీతో ఇక్కడే ఉండాలని అనుకుంటున్నానని చెప్పడంతో నాని ఆనందంగా హగ్ చేసుకుంటాడు.

  నాని ఇల్లరికం

  నాని ఇల్లరికం

  మరో పక్క రఘురాం గదిలో ఉండగా వెళ్లి సీత నువ్వు ఇలా ఛాలెంజ్ చేయడం ఏమాత్రం బాలేదని నేను వెళ్లి స్వయంగా దమయంతిని మాట్లాడతాను అని అంటుంది. నువ్వు అలా వెళ్లి ఆమెను బతిమిలాడమంటే నన్ను అవమానించడమేనని ఆమె అడగడం అంటే ఆమె ఆమె కాళ్ళ మీద నేను పడినట్లే అని రఘు రామ్ ఎమోషనల్ అవుతాడు.

  అయితే అలా కాదని ఇప్పుడు గనుక భరత్, సిరి రాకపోతే మనం దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏమో అని సీత అంటుంది. దానికి రఘురాం ఏం జరగాలని రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది మనం తాపత్రయ పడినంత మాత్రాన దానిని మార్చలేము కదా నాకైతే వాళ్ళు వస్తారనే నమ్మకం ఉంది నువ్వైతే అమ్మ వారిని ఎలా నమ్మావో నేను నా మనసుని అలాగే నమ్ముతున్నాను అని అంటాడు.

  బ్యాగ్ సర్దుకుని రెడీగా

  బ్యాగ్ సర్దుకుని రెడీగా

  మరో పక్క శైలు కూడా లక్ష్మణ్ తో ఇలాగే వాదిస్తూ ఉంటుంది. ఆ రోజు సీతక్క అమ్మ వారి మీద ఉంచిన నమ్మకంతో ఎలాగోలా ఆ గండం నుంచి బయట పడ్డాము కానీ ఇప్పుడు గండం నుంచి బయట పడే పరిస్థితులు కనిపించడం లేదని వాపోతోంది. ఇప్పుడు గనుక విషయం చెప్పకుండా ఉంటే నాని కూడా ఇల్లరికం పేరుతో ఇంటి నుంచి దూరం కావాల్సి వస్తుందని అంటుంది.

  అయితే ఈ ఇంట్లో మా అన్నయ్య ఒక్క సారి చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని కచ్చితంగా భరత్ తిరిగి వస్తారనే నమ్మకం తనకు కూడా ఉన్నాయి లక్ష్మణ్ అంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉన్న సమయంలో దమయంతి సమయం అయ్యింది అని పిలుస్తుంది.

  శిల్ప కూడా తన తల్లి ఎప్పుడు పిలుస్తుందా అనే ఉద్దేశంతో బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉంటుంది. ఇక తల్లి పిలిచిన వెంటనే బ్యాంకుతో సహా తల్లి ముందు ప్రత్యక్షమవుతుంది. ఆమె వెళ్ళిపోతుంటే అల్లుడు గారిని కూడా రమ్మని అంటుంది నేను ఎట్టి పరిస్థితుల్లో రానని తెగేసి చెబుతాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ప్లాన్ రివర్స్

  ప్లాన్ రివర్స్

  మీ కూతుర్ని మీరు తీసుకు వెళ్లిపోండి అంటుంటే నా కూతుర్ని తీసుకు వెళ్ళేది లేదని అయితే ఎప్పుడో వెళ్లేదాన్ని మీ అన్నయ్య నిన్ను కూడా ఇల్లరికం పంపిస్తానని ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఇప్పటి దాకా వేచి ఉన్నాను అని అంటుంది. దానికి నాని ఘాటుగా స్పందిస్తాడు, నేను చచ్చినా రాను అని అనడంతో రఘురాం బాధపడుతూ ఉంటాడు.

  సీత కూడా నాని ఇక్కడే ఉండేలా చెప్పమని ప్రాధేయ పడుతూ ఉంటాడు, కానీ ఎవరు మాట్లాడకుండా ఉంటారు సీత శిల్ప దగ్గరకు వెళ్లి నువ్వైనా చెప్పు అనడంతో బావగారిని మా ఇద్దరిని ఇక్కడే ఉండండి అంటే తన ఉండిపోతానని ఆయన నోటి వెంట మాట వస్తే చాలు అని అంటుంది. అయితే ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక తరువాత ఎపిసోడ్ లో భరత్, సిరి ఇంటికి వచ్చినట్టుగా చూపించారు.

  సిరి అలాగే శైలు మాట్లాడుకుంటుంటే శిల్ప భయపడుతూ ఉండటం గమనించిన సీత అసలేమైంది వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే సీత ఎందుకు భయపడుతోంది? అనే విషయం మీద ఆరా తీసే ప్రయత్నంలో ఉంది. దీంతో తదుపరి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగేలా కనిపిస్తోంది.

  English summary
  Vadinamma Episode 655: Raghuram's family get emotional as Nani decides to leave for Dhamayanthi's house with a heavy heart. Meanwhile, Shailu attempts to convince Shilpa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X