Vadinamma : శిల్ప మీద అనుమానంతో సీత స్కెచ్.. రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన శిల్ప

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది.. ప్రస్తుతం ఈ సీరియల్ 657వ ఎపిసోడ్ కి చేరింది. టెలివిజన్ స్టార్ ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ లో ప్రస్తుతం రఘురాం కుటుంబం అంతా కష్టాలపాలు అవుతుండటం చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డెలివరీ కోసం తెచ్చిన బియ్యం బస్తాలు తడిసిపోవడంతో లక్షల్లో నష్టం వస్తుంది.. ఈ వ్యవహారంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగడం తో భరత్ సిరి ఇద్దరూ కూడా ఇల్లు విడిచి బయటకు వెళ్ళిపోయారు. దీన్ని అదునుగా తీసుకుని దమయంతి తన కూతుర్ని అల్లుడిని ఇల్లరికం తీసుకువెళ్లాలని ప్రయత్నించగా చివరి నిమిషంలో భరత్ సిరి ఇంటికి తిరిగి రావడంతో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

 ఎందుకు బయటకు వెళ్లారంటే

ఎందుకు బయటకు వెళ్లారంటే

నిన్నటి ఎపిసోడ్ లో సీత భోజనానికి అని పిలవడానికి భరత్, సిరి ఉన్న గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో భోజనానికి రాకుండా భరత్, సిరి మాట్లాడుకుంటున్న మాటలు విని సీత బాధపడుతుంది. అయితే భరత్ ను ఏమిటి అని ప్రశ్నించగా తాను వెళ్ళిపోయింది మీ మీద కోపంతో కాదని తమ వల్ల నష్టం జరిగిందని ఉద్దేశంతో వెళ్లిపోయాం అని అంటాడు. ఇంతలో రఘురాం దగ్గరకు వాళ్లందరినీ తీసుకురాగా రఘురాం ఎందుకు వెళ్లిపోయారు అని ప్రశ్నిస్తాడు. ఇకమీదట వెళ్ళను అని చెప్పడం కాదు అసలు అప్పుడు కూడా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అడగగా తన వల్ల ప్లాస్టిక్ బియ్యం నష్టం వచ్చిందని తన భార్య వల్ల బియ్యం బస్తాలు తడిచి నష్టం వచ్చిందని ఎలా అయినా ఎంతో కొంత సంపాదించి నష్టం తీరుద్దామని అనుకున్నాను అని అంటాడు. అయితే మీ గొప్ప మనసుకు జోహార్లు కానీ అలా చేయడంతో మన కుటుంబం విచ్చిన్నం అయ్యే పరిస్థితి వచ్చిందని రఘురాం అంటాడు..

 జాగ్రత్తగా ఉండమని

జాగ్రత్తగా ఉండమని

ఇక మీదట అయినా జాగ్రత్త గా ఉండమని చెబుతూ అందరూ భోజనాలు చేస్తారు. భోజనాలు పూర్తయిన తర్వాత కూడా సిరి అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అసలు ఆ రోజు నీళ్లు ఎలా పడ్డాయి నేను పోయలేదు, శైలు కూడా పోయలేదు అంటుంది ఎలా పడ్డాయి ఆ విషయం తెలియకుండా ఒకరు అర్థం చేసుకున్నాము అని బాధపడుతూ ఉంటుంది.. ఇంతలో అక్కడికి వచ్చిన శైలు కూడా పక్కనే కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది.

అసలు ఏమైంది అని

అసలు ఏమైంది అని

వీరిద్దరూ కూడా ఎప్పుడో జరిగి పోయిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉండడంతో శిల్ప దగ్గర నుంచి చూసి భయ పడుతూ ఉంటుంది. అటుగా వెళ్తున్న సీత శిల్ప వాళ్ళిద్దరినీ చూసి భయపడుతున్న సంగతి గ్రహించి అసలు వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుతున్నారు అనే విషయం తెలుసుకోవడానికి వాళ్ల దగ్గరికి వెళ్ళింది.. అసలు ఏంటి సంగతి అని ప్రశ్నించగా ఇదీ సంగతి అని వారు చెబుతారు.

శిల్ప మీద అనుమానం

శిల్ప మీద అనుమానం

శిల్ప మీద అనుమానం వచ్చిన సీత వాటి మీద ఎవరు నీళ్లు పోసినది ఎవరో తనకు తెలుసు ఉంటుంది. వెంటనే శిల్ప కు చెమటలు పట్టడం గమనించి సీత అనుమానం వచ్చి అప్పటికప్పుడు ఆ వ్యవహారాన్ని సద్దుమణిగే విధంగా చేస్తుంది. నేను ఎక్కడ ఉంటే ఎలా చూస్తాను నేను సరదాగా అన్నాను, ఎవరో నీళ్ళు పోశారో నాకు తెలియదు అంటుంది. అయితే శిల్ప మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ విషయం గనక తెలిస్తే నాని నన్ను బతకనివ్వడు, నేనే ఆ నిజం చెప్పేస్తాను అని భావిస్తూ ఉంటుంది. ఇలా అనుకుంటున్న సమయంలో నానీ దగ్గరకు వెళ్లి అసలు నీళ్లు పోసింది నేనే అనే విషయం నానీకి చెబుతుంది. నాని వెంటనే ఇంట్లో ఉన్న అందరినీ సమావేశపరిచి వాళ్ళ అందరి ముందే విషయం చెప్పి భార్యను దండించ పోతాడు. అయితే అడ్డుపడిన సీత అలా చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
సీతకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన శిల్ప

సీతకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన శిల్ప

అయితే నాని సహా భరత్, సిరి, శైలు కూడా శిల్పని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన పనికి లక్ష రూపాయల నష్ట పోవడమే గాక భరత్, సిరి కొన్నాళ్లపాటు నిద్రాహారాలు లేకుండా రోడ్ల వెంట పడాల్సిన పరిస్థితి వచ్చిందని అందరూ ఆమెను టార్గెట్ చేస్తారు. అయితే బహుశా ఇదంతా కల అయ్యుండొచ్చు ఎందుకంటే నేరుగా నాని కి ఈ విషయం చెప్పడానికి శిల్ప సాహసించ పోవచ్చు. అయితే ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. కానీ తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం ప్లాస్టిక్ బియ్యం వ్యక్తి భరత్ కి దొరికాడని అతన్ని పట్టుకుని అసలు అతని వెనుక ఎవరున్నారో అనే విషయం తేలుస్తామని సీత చెప్పడంతో భయంతో శిల్ప తల్లికి ఫోన్ చేసి ఈ విషయం అంతా చెబుతూ ఉంటుంది. ఈ విషయాన్ని వెనుకనుంచి చూసిన సీత ఈ ఉపద్రవాలు అన్నింటికీ కారణం శిల్ప అనే ఈ విషయాన్ని ధ్రువీకరించు కుంటుంది. ఇక దీంతో తరువాతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X