For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma September 2nd Episode: అమ్మకి ద్రోహం చేసిన శిల్ప, దాన్ని కవర్ చేసేందుకు సీతకు అవమానం!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 637వ ఎపిసోడ్ కి చేరింది. అయితే గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన నాని శిల్పాల శోభనం ఎట్టకేలకు నిన్నటి ఎపిసోడ్ లో పూర్తయినట్లు చూపించారు. ఇప్పుడు దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ? శిల్ప తల్లి దమయంతి తన అల్లుడిని ఇల్లరికం తీసుకురావడానికి ఎలాంటి స్కెచ్ వేయబోతోంది. శిల్ప తన తల్లి కోరిక తీర్చేందుకు ఏం చేయబోతోంది? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ విషయంలోకి వెళితే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  నాతో ఏం పని

  నాతో ఏం పని

  తెల్లవారగానే దమయంతి సీత దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. రాత్రి బాగా నిద్ర పట్టిందా అంటే తన కూతురు నాకు నిద్ర లేకుండా చేసింది అని లోపల అనుకుంటూనే కొత్త చోటు కదా నిద్ర పట్టలేదు అంటూ ఉంటుంది. అంతేగాక తన కూతురు తన మాట వినకుండా శోభనం జరిపించుకుని ఉంటుందని భావిస్తూ ఇంకా నేనెందుకు నేను వెళ్ళిపోతాను అన్నట్లుగా దమయంతి మాట్లాడుతుంది అయితే నువ్వు వెళ్ళిపోతే ఎలా పిన్ని నువ్వు లేకుండా వెళ్తే శిల్ప బాధ పడుతుంది కదా శిల్ప లేవగానే నీ కోసమే వెతుక్కుంటుంది అని సీత అంటుంది. అయితే అదేమీ లేదని మీ అందరూ ఉన్నారు కదా ఇంకా ఆమెకు నాతో ఏం పని ఉంటుందిలే అన్నట్టు నిష్టూరంగా మాట్లాడుతూ ఉంది దమయంతి.

  తల్లిదండ్రులే ముఖ్యం

  తల్లిదండ్రులే ముఖ్యం

  అయితే అలా మాట్లాడొద్దు అని పేర్కొన్న శైలు ఎందరున్నా తల్లిదండ్రులే ముఖ్యం అని అంటుంది. దీంతో వెంటనే మీ అమ్మ నాన్న ను వదిలి వచ్చేశావు అంటగా అనే కౌంటర్ ఇస్తుంది దమయంతి. తను వాళ్ళని వదిలేసి వచ్చిన నా ఆలోచన అంతా అక్కడే ఉంటుందని శైలు అంటుంది. శిల్ప విషయంలో కూడా తన భయం అదేనని ఆమె ఇక్కడ ఆలోచనలలో పడి తనను ఎక్కడ మరిచిపోతుంది అనే బాధను వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే అదేమీ లేదని శిల్ప చాలా మంచి అమ్మాయి అని శైలు అంటుంది. ఇంతలో దుర్గా పార్వతీ కూడా అక్కడికి వచ్చి తాము కూడా వెళ్ళిపోతామై అని అంటారు. అదేంటి అప్పుడే వెళ్ళిపోవడం ఏమిటి అంటే తన కాలు మళ్లీ నొప్పి పట్టిందని దానికి దమయంతి గారికి తెలిసిన డాక్టర్ దగ్గర చూపిస్తానని ఆవిడ చెప్పిందని అందుకే ఆమె తో పాటు వెళ్దామని అంటారు.

  ఊహించని షాక్

  ఊహించని షాక్

  దీంతో కుటుంబ సభ్యులు కూడా ఏమీ అనలేక సైలెంట్ గా ఉండి పోతారు. ఇదంతా జరుగుతూ ఉండగా వాళ్ళిద్దరినీ కారులో ఎక్కించుకుని తీసుకు వెళ్లిన దమయంతి వాళ్లకి ఊహించని షాక్ ఇస్తుంది, దారి మధ్యలోనే దింపేసి తనకు చేసిన అన్యాయానికి ఇక్కడి నుంచి నడిచి వెళ్ళి పోవాలి అన్నట్లుగా చెబుతుంది. దీంతో వాళ్ళిద్దరూ షాక్ కి గురికావడమే కాక కుంటుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. ఇక మరో పక్క రాఖీ పండుగ రావడంతో రఘురాం తన భార్యను పిలిచి ఒక రాఖీ సెలెక్ట్ చేసుకోండి మీ అన్న చెల్లి కోసం అని అడుగుతాడు. సీత కూడా రాఖీ తీసుకుని రాఖీ సెలెక్ట్ చేసుకోవడం ఏమీ లేదని నీ సెలక్షన్ నీ తప్పు పడితే నన్ను నేనే తప్పు పట్టుకున్నట్లు అని చెబుతోంది.

  శోభనం ఎఫెక్టుతో

  శోభనం ఎఫెక్టుతో

  ఇక మరోపక్క శోభనం ఎఫెక్టుతో లేటుగా లేచిన శిల్పా తన ఇంట్లోనే ఉన్నాను అనుకొని మమ్మీ కాఫీ అని అరుస్తుంది. తర్వాత చుట్టుపక్కల పరికించి చూడగా తన శోభనం గదిలో ఉన్నాను అనే విషయం గుర్తుకు వచ్చి సిగ్గుపడుతూ ఉంటుంది. గది తెరుచుకుని బయటకు వచ్చేలోపు బయట నుంచి ఉన్న శైలు, శ్రీ ఇద్దరు ఆట పట్టిస్తారు కాఫీ అప్పుడే ఇవ్వమని చెబుతూ బ్రష్ చేసుకోవడానికి కొత్త బ్రష్ పేస్ట్ అలాగే రెడీ కావడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయని చెబుతారు. ఇక ఆ తర్వాత కాఫీ ఇస్తే ఇవి ఎన్నాళ్ల నుంచి వాడుతున్నారో ఈ కప్పులో కాఫీ తాగాలంటే మూడు ఉత్సాహం రెండు పోతున్నాయి అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది శిల్ప.

  Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
  ద్రోహాన్ని కవర్ చేసేందుకు

  ద్రోహాన్ని కవర్ చేసేందుకు


  ఇక ఈ లోపు రాఖీ పండుగ కావడంతో ఎవరికి వాళ్లు ఆనందంలో మునిగి పోతుంటారు. అయితే మనకు అన్నదమ్ములు ఎవరూ లేరు కదా రాఖీ ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఆలోచిస్తే మన ముందున్న విషయం గుర్తుకొస్తుంది చెబుతూ వైదేహితో రిషికి రాఖీ కట్టించే ప్రయత్నం చేస్తుంది సీతమ్మ. అలా రాఖీ కట్టిన తరువాత ఇంట్లో ఆనంద క్షణాలు అల్లుకుంటాయి. అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే సీత కూడా ఆనందంలో మునిగి పోతుంది.. ఇంతలో తన తల్లికి తాను చేసిన ద్రోహం గుర్తుకు వచ్చి ఎలా అయినా సీతను అవమానించాలనే ఉద్దేశంతో ఇంత వయసు వచ్చినా నీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు అని ఆమె అడుగుతుంది. దీంతో ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు. శిల్ప ఇలా ఎందుకు అడిగింది అని ఆలోచిస్తూ ఉన్న క్రమంలో ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ లొ సీత తన అన్న భాస్కర్ దగ్గరికి వెళ్లి రాఖీ కడుతున్నట్టు చూపించారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా సాగింది.

  English summary
  Vadinamma Episode 637: Dhamayanthi ill-treats Parvati and Durga for ruining her plans. Elsewhere, Sita's family celebrates the Raksha Bandhan festival with great joy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X