Vadinamma : సీత దారిలోకి శిల్ప.. అయినా విడాకులంటూ భయపెట్టిన సిరి, శైలు.. 25 లక్షల టెన్షన్!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది.. ప్రస్తుతం ఈ సీరియల్ 659వ ఎపిసోడ్ కి చేరింది. టెలివిజన్ స్టార్ ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ లో ప్రస్తుతం రఘురాం కుటుంబం అంతా కష్టాలపాలు అవుతుండటం చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భరత్, సిరి ఇద్దరూ కూడా ఇల్లు విడిచి బయటకు వెళ్ళిపోయారు. దీన్ని అదునుగా తీసుకుని దమయంతి తన కూతుర్ని అల్లుడిని ఇల్లరికం తీసుకువెళ్లాలని ప్రయత్నించగా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ప్లాన్ ఫెయిల్ అవటమే కాక సీతకు అన్ని విషయాలు తెలిసిపోవడంతో ముందుగా శిల్పా కి జడుపు జ్వరం వస్తుంది. ఆమె జ్వరంతో వణికి పోతూ ఉంటే దమయంతి పరిగెత్తుకుని ఇంటికి వస్తుంది.

అయితే తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పి దమయంతిని వణికిపోయే లాగా చేస్తుంది సీత. ఆ దెబ్బతో మొత్తానికి వణికిపోయిన దమయంతి ఇంట్లో ఉన్న అందరికీ క్షమాపణలు చెప్పి రఘురాం తల్లి కాళ్లు పట్టుకుని మరీ ఇంటి నుంచి బయట పడుతుంది. అయితే దమయంతి ఏంటి ఇలా మారి పోయిందని ఇంట్లో వాళ్ళందరూ ఆలోచిస్తారు కానీ సీత ఏం చేసింది అనే విషయం మీద మాత్రం వాళ్ళు ఎవరూ ఫోకస్ చేయరు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగియగా నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

అవమానంతో ఇంటికి

అవమానంతో ఇంటికి

ఇంటికి వెళ్లి పోయి తన గదికి వెళ్లి ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చుంటుంది దమయంతి. ఆమె పెద్ద కూతురు అల్లుడు మాట్లాడాలని ప్రయత్నించినా సరే దమయంతి మాట్లాడటానికి ఆసక్తి చూపించదు. కూతురు అల్లుడు ఇద్దరూ కూడా బాధపడుతూ దమయంతి భర్త దగ్గరకు వెళ్లి విషయం చెబుతారు. దమయంతి కొడుకు కిషోర్ కూడా అమ్మను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితుల్లో చూడలేదని అక్కడేదో పెద్ద విషయమే జరిగి ఉంటుందని అంటాడు.

ఆమెను ఇలాంటి రోజున చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని కిషోర్ అంటూ ఉంటే ఏం జరిగిందో ఆమె అంతట ఆమె వచ్చి చెప్పే వరకు మనకు తెలియదు మనం ఏం చేసినా ఆమెకు చెప్పి చేయాలి కానీ ఆమె మనకు చెప్పి చేయాదు కదా అని అంటాడు దమయంతి భర్త. ఇక మరోపక్క సీత జ్వరం తగ్గిపోవడంతో నాని ఆనందం వ్యక్తం చేస్తాడు.

అమ్మ లాంటి సీతమ్మ

అమ్మ లాంటి సీతమ్మ

అసలు నీ జ్వరం ఎలా తగ్గింది అని అడగగా ఎలా తగ్గిందో తనకు తెలియదు కానీ అమ్మ లాంటి సీతమ్మను మళ్లీ నాకు పరిచయం చేసినందుకు థాంక్స్ అని చెబుతోంది శిల్పా. ఇంతలో సీత అక్కడికి రావడంతో పరుగెత్తుకు వెళ్ళి ఆమెను వాటేసుకుని మరి ఆమెకు థాంక్స్ చెబుతుంది శిల్ప. జ్వరం తగ్గిందా అని సీత అడిగితే ప్రస్తుతానికి తగ్గింది అని ఇక జీవితంలో ఇలాంటి జ్వరం రాకూడదు అని కోరుకుంటున్నాను అని అంటే నాకు తెలుసు ఇకమీదట నీకు ఎలాంటి జ్వరాలు రావు అని కూడా అని చెబుతుంది సీత.

సిరి, శైలు

సిరి, శైలు

అయితే మరో విషయం ఏమిటంతే శిల్ప రెస్ట్ తీసుకోగానే మళ్ళీ కల వస్తుంది ఆ కలలో సిరి, శైలు ఇద్దరూ కూడా తను కొట్టి ఇంట్లో నుంచి బయటకు పంపేస్తున్నట్టు కనిపిస్తుంది. తాను చేసిన పనులన్నీ వాళ్ళిద్దరికీ తెలిసిపోవడంతో తననూ అసహ్యించుకుంటూ నాని చేత విడాకులు ఇప్పిస్తామని వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపించింది. ఈ దెబ్బతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. అయితే సీత ఆ విషయంలో అభయం ఇవ్వడంతో అలాంటి పరిస్థితి తనకు ఎదురు కాకపోవచ్చు అని సమాధాన పడుతుంది.

శాపనార్ధాలు

శాపనార్ధాలు

అయితే సీత మీద మంచి అభిప్రాయం కలగడంతో ఎక్కువగా సీతతోనే సమయం గడపడానికి శిల్ప ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా దమయంతి ఎన్నిసార్లు ఫోన్ చేసినా శిల్ప ఫోన్ ఎత్తదు. పక్కనే ఉన్న సీత రెండు మూడు సార్లు చూసి ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆమె ఫోన్ ఎత్తకుండా ఉండకూడదు ఎత్తి మాట్లాడమని అంటుంది. ఫోన్ ఎత్తిన శిల్ప ఫోన్ ఎన్నిసార్లు ఎత్తక పోవడానికి క్షమించమని అడగడమే కాక ఇకమీదట తనకు ఫోన్ చేయకుండా ఉండాలని కోరి ఫోన్ పెట్టేసింది.

ఇలా జరిగింది అని దమయంతి తన భర్త దృష్టికి తీసుకువెళితే నువ్వు చేసిన పాపాలే నిన్ను ఏదో ఒకరోజు ఇబ్బంది పెడతాయి వాళ్ళు సంతోషంగా ఉంటే నీకేం ఇబ్బంది నిజంగా శిల్ప కు ఏమైనా ఇబ్బంది కలిగిన రోజు నీ దగ్గరికి వస్తే అప్పుడు ఆలోచించవచ్చు కానీ ఇలా ఇల్లరికం తీసుకురావడం కోసం ఉమ్మడి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఆ పాప నీకు ఏదో ఒక రోజు తగులుతుందని శాపనార్ధాలు పెడతాడు. భర్త మాటలతో ఆలోచనలో పడ్డ దమయంతి ఇకమీదట ఏం చేయాలి అనే విషయం మీద ఆలోచిస్తూ ఉంటుంది.

మరో కష్టం

మరో కష్టం

మరో పక్క సీత మీద చాలా మంచి అభిప్రాయం కలగడంతో కావాలని పెట్టించిన ఏసీ నీ గదిలోనే పెట్టించమని శిల్ప సీతతో ఉంటుంది. అలా ఎందుకు అంటే మేము చల్లగా ఉండటం కంటే మీరు చల్లగా ఉంటే మేమందరం చల్లగా ఉంటామని శిల్ప అంటుంది. ఇక శిల్ప మాటలు చూసి శైలు అలాగే సిరి కూడా ఆశ్చర్య పోయి అబ్బో అంటూ ఉంటారు.

ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు, తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాంకి 25 లక్షలు అప్పు ఇచ్చిన వ్యక్తి వెంటనే ఆ డబ్బు కావాలని తనకు బ్యాంక్ లోను రావడంతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెబుతాడు. అలా ఒక ఇబ్బంది తప్పింది అనుకుంటున్న క్రమంలో మరో ఇబ్బంది రఘురాం కుటుంబాన్ని ఎదుర్కోబోతోంది మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X