For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Episode Sept 9th: పాపం శిల్ప, షాకిచ్చిన రఘురామ్.. మళ్ళీ కొత్త టెన్షన్ పెట్టడానికి సిద్దమయిన దమయంతి?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 643వ ఎపిసోడ్ కి చేరింది. అయితే కుటుంబంలో ఒక సమస్య తీరింది అనుకోగానే మరో సమస్య తెరమీదకు వచ్చింది. భరత్ శిల్ప బంధువు నుంచి తీసుకున్న బియ్యం లోడ్ ప్లాస్టిక్ బియ్యం అని తెలియడంతో ఆ బియ్యం కొనుక్కుని వెళ్ళిన కస్టమర్ లు అందరూ షాప్ మీద గొడవ కు వస్తారు అయితే భరత్ శిల్ప మీద నమ్మకంతో అవి ప్లాస్టిక్ బియ్యం కాదని కస్టమర్లు కావాలని అలా చేస్తున్నారని ఉద్దేశంతో వాళ్ళని కొడతాడు కూడా. ఈ విషయంలో సీరియస్ అయిన రఘురాం భరత్ ని అనరాని మాటలు అంటాడు. దీంతో భరత్ దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉంటాడు. మరి ఈ రోజు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  భరత్ ఏమన్నాడంటే

  భరత్ ఏమన్నాడంటే

  ఈ వ్యవహారం జరగడంతో ఎవరు కూడా అన్నం కూడా తినాలి అని అనిపించక అందం జోలికి కూడా వెళ్లరు. అయితే నిన్నటి నుంచి పరిస్థితి మొత్తం గమనిస్తూ వచ్చిన రఘురాం తల్లి ఇంట్లో ఏం జరుగుతోంది నిన్నటి నుంచి అందరూ ఎందుకు ఏమీ తినడం లేదు ఇప్పుడు నాకు ఈ విషయం మొత్తం తెలియాలి అని అడుగుతుంది. దీంతో సీత కూడా ఈ విషయం మీద ఒక క్లారిటీ తీసుకుంటే అందరి మనసును తేలిక పడతాయి అనే ఉద్దేశంతో వెంటనే భరత్ ను బయటకు రమ్మని పిలుస్తుంది. తల్లి అరుపులతో బయటకు వచ్చిన భరత్ ఏమైంది అని ప్రశ్నిస్తాడు. ఏమైందో నువ్వే చెప్పాలి అని భరత్ తల్లి ప్రశ్నించగా అసలు నేను చెప్పే మాట మీరందరూ ఎందుకు వినడం లేదు నేను చెబుతున్నది కూడా మీరు వినాలి కదా అని భరత్ అంటాడు. సరే అసలు ఏం జరిగిందో చెప్పు అని అనగా ఇంట్లో వాళ్ళందరూ అప్పుడే అక్కడికి చేరుకుంటారు. సరే మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేలా నేను విషయం చెబుతాను.

  అసలు విషయం చెప్పేసి

  అసలు విషయం చెప్పేసి

  నేను ఈ బియ్యం గురించి నా సొంత నిర్ణయం తీసుకోలేదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒకతను వచ్చి నన్ను పేరుతో పలకరించాడు నువ్వు భరత్ కదా నేను నిన్ను మా శిల్ప పెళ్లిలో చూశాను, అన్నాడు నాకు అతను ఎవరో గుర్తు రాక శిల్పకు కూడా అతని చేత ఫోన్ చేయించి మాట్లాడించా అని అంటాడు, శిల్పతో మాట్లాడిన తర్వాత అతను నీకు తెలిసిన వాడేనా ఆయన దగ్గర బియ్యం లోడు వేయించుకోవచ్చా అని అడిగితే శిల్పా ఓకే అందని శిల్ప ఓకే అన్న తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకుని బియ్యం లోడ్ వేయించడానికి నిర్ణయానికి వచ్చానని అంటాడు. అయితే అందరూ శిల్పను టార్గెట్ చేస్తారు. అసలు ఏం జరిగింది నువ్వు ఎందుకు అతను తెలుసు అని చెప్పావు అని ప్రశ్నిస్తారు. అయితే నటన మొదలుపెట్టిన శిల్ప అందరూ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? అతను ఎవరో నాకు తెలియదు అని కుండ బద్దలు కొడుతుంది.

  రికార్డ్ చేసి విన్పించిన శిల్ప

  రికార్డ్ చేసి విన్పించిన శిల్ప

  అదేంటి నువ్వు ఓకే అంటే నే కదా నేను తీసుకున్నది అంటే ఒక్క నిమిషం నేను మాట్లాడే అన్ని ఫోన్ కాల్స్ రికార్డు అవుతూ ఉంటాయి. ఆ రికార్డులు తీసుకొచ్చి వినిపిస్తానని చెప్పి శిల్ప మాట్లాడిన మాటలు అన్నీ వినిపిస్తుంది, శిల్ప కావాలనే తెలివిగా ఇంగ్లీష్ లో మాట్లాడి భరత్ ని బోల్తా కొట్టించిన విషయం వాళ్ళకి అర్థం కాదు. శిల్ప వివరంగానే చెప్పింది కదా అయినా ఇంగ్లీషు రాకపోవడంతో భరత్ అర్థం చేసుకోలేదు అని అనుకుంటారు ఇదే విషయాన్ని భరత్ కి చెప్పి శిల్ప క్లారిటీ గానే చెప్పింది కానీ నీకే అర్థం కాలేదు అని అంటారు. శిల్ప ఏమీ తెలియనట్టుగా అదేంటి భరత్ బావ నీకు ఇంగ్లీషు రాదా అని అంటుంది, రాదని చెప్పిన భారత్ తాను చదువుకోలేదని చెబుతాడు. ఇంతలో రఘురాం ఎంట్రీ ఇచ్చి ఇందులో శిల్ప తప్పేమీ లేదని భరత్ కావాలని తన మీద తప్పు లేకుండా వేసుకోవడానికి ఇలా చెబుతున్నాడు అని అంటాడు.

   మళ్ళీ కలిసిన అన్నతమ్ములు

  మళ్ళీ కలిసిన అన్నతమ్ములు

  ఒకపక్క భరత్ బాధపడుతూ ఉండగానే రఘురాం అందరూ భోజనానికి కూర్చోవాలని అంటాడు. నిన్నటి నుంచి ఎవరూ సరిగా తినలేదు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి, అలా అని తిండి తినడం ఆపేస్తామని ప్రశ్నించి అందరినీ కూర్చోబెట్టాడు. వెంటనే భరత్ ను పక్కన కూర్చోబెట్టుకుని మరి నా ఉద్దేశం నిన్ను తిట్టడం కాదు ఆ సమస్యలు ఇరుక్కున్నాక ఏమనాలో అర్థం కాక నాకు కోపం నీ మీద తీర్చుకున్నాను, నా చేత మెప్పు పొందాలని నువ్వు చేసిన ఈ ప్రయత్నం నాకు బాగా నచ్చింది కానీ ఒక్కసారి నన్ను అడిగి ఉంటే ఇంకా బాగుండేది. అయినా నేను మాత్రం ఇలాంటి మొక్కలు తినకుండా నేను ఈ స్థాయికి వచ్చాను నువ్వు కూడా అదే బాటలో పయనిస్తున్నావు దానికి సంతోషం అని అంటాడు రఘురామ్. ఇదేంట్రా బాబు అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టాను ఇంకా విడిపోతారు అని భావిస్తుంటే వీళ్ళు మళ్ళీ ఇలా అనుకుంటున్నారు ఏమిటి అని శిల్ప భావిస్తూ ఉంటుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   చిచ్చు పెట్టా

  చిచ్చు పెట్టా

  ఇంతలో శిల్ప గదికి ఏసీ కూడా వస్తుంది. ఏసీ వచ్చిన తర్వాత ఏసీ బిగిస్తున్న ఫోటోలు శిల్ప తన తల్లికి పంపితే వెంటనే ఫోన్ చేసిన తల్లి ఏసీ కావాలా నేను పెట్టిస్తాను కంగారు పడవద్దు అంటుంది. నువ్వు ఎందుకు పెట్టడం నేను నా ట్రిక్స్ ప్లే చేసి ఆల్రెడీ ఏసీ పెట్టించాను అన్నదమ్ముల మధ్య గొడవ కూడా మొదలైంది అంటూ అన్ని విషయాలను వివరంగా చెబుతూ ఉంటుంది శిల్ప. దీంతో ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం భారత్ కుటుంబానికి కొత్త టెన్షన్ తీసుకురావడానికి దమయంతి ప్లాన్ చేసినట్లు ఉంది.

  English summary
  Vadinamma Episode 643: Shilpa executes her evil plan and puts Bharat in deep trouble. Later, he feels heartbroken as Raghuram condemns his impatient move.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X