Naga Panchami 27th January: మోక్షకు మరో పెళ్లి.. తానే పెళ్లి కూతురు కావాలనుకుంటున్న మేఘన!

Naga Panchami: నాగ పంచమి సీరియల్ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీదు ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజా ఎపిసోడ్ లో పంచమి ఫణీంద్రలు కలిసి పట్నం వచ్చారు. ముఖ్యంగా మేఘన రూపంలో ఉన్న కరాళీ చేత ఎలాగైనా సరే నిజం చెప్పించి నాగలోకం వెళ్లాలని ప్లాన్ వేసుకుంటున్నారు. కరాళీ.. మోక్షను తన నుంచి దూరం చేసి తన వశం చేసుకోవాలని భావిస్తోందని.. అదే తన కోరిక అని పంచమి ఫణీంద్రతో చెప్పింది. ఎలాగైనా తనను పట్టుకొచ్చి నాగదేవత ముందు నిజం చెప్పించాలని ఫణీంద్ర అనగా.. అలాగే మోక్ష బాబను తన నుంచి కాపాడాలని పంచమి చెబుతుంది.

మోక్షకు కరాళీని దూరం చేస్తేనే అసలు సమస్య పోతుందని.. ఆతర్వాత తాను నాగలోకం రాగలనని అంటుంది. ఇది కాగానే మరోవైపు వైదేహి.. మోక్షకు పిలిచి తన మనసులోని అసలు విషయాన్ని చెప్పేస్తుంది. తాను మోక్షకు మరో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నట్లు వివరిస్తుంది. ఈ సమయంలోనే నీకు మరో అమ్మాయితో పెళ్లి చేస్తానని.. ఒకవేళ నీవు కాదంటే నేను చనిపోవడం ఖాయం అని భయపెడుతుంది. తల్లి అన్న మాటలు విన్న మోక్ష షాక్ అవుతాడు. చనిపోతాననే సరికి భయపడతాడు. ఇదంతా పైన ఉండి ఉంటున్న మేఘన.. మోక్షను తన చేతిలోంచి చేజారనివ్వకూడదని అనుకుంటుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Vaidehi Says That She Will Marry Moksha Again on Naga Panchami January 27th Episode

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా మేఘన దేవుళ్లకు పూజ చేయడం.. ఆ తర్వాత అందరికీ హారతి ఇవ్వడం చూపిస్తారు. అలాగే మోక్షకు కూడా హారతి ఇవ్వమంటూ అతడిని పిలుస్తారు. పంచమిని మర్చిపోవాలని సూచిస్తారు. అది జరగని పని అని.. మీరంతా నన్ను మర్చిపోతేనే నేను పంచమిని మర్చిపోతానని అంటాడు. అయినా మీరు ఇచ్చిన జన్మ ఎప్పుడో పోయిందని.. ఇప్పుడు ఉన్న ప్రాణం పంచమిదే అని చెప్పుకొచ్చాడు మోక్ష. అలాగే తాను బతికి ఉన్నంత వరకు తనతోనే జీవితం అని అంటాడు. నీకు మరోసారి ప్రాణం పోసిన మేఘన రుణం నువ్వు తీర్చుకో అంటూ తల్లి అనగా.. మీ దేవత ఇచ్చిన ప్రాణాలను ఆమెనే తిరిగి తీసుకోమనండి అంటూ అంటాడు.

దీంతో అంతా బాధ పడుతూ, భయపడుతూ ఉంటారు. అంతలోనే మోక్ష తండ్రి వచ్చి అలా మాట్లాడకు.. అంత తొందర పడకు మోక్ష అంటూ వివరిస్తాడు. ఇక ఆ తర్వాత మేఘన.. తన అన్నయ్య ఆశ్రమానికి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత అన్న ఆత్మను ఆవాహనం చేసుకోగా.. తాను ఇక నాగమణిని తీసుకురాలేనని చెబుతుంది. నీ ప్రాణాలు కాపాడలేకపోయానని అంటుంది. దీనికి నంబూద్రీ కూడా ఇప్పుడు నువ్వు నాగమణిని తీసుకు వచ్చినా నువ్వు నా ప్రాణాలు కాపాడలేవు కరాళీ అని అటాడు. ఇప్పటికే నా శరీరం అంతా పాడైపోయిందని వివరిస్తాడు.

Vaidehi Says That She Will Marry Moksha Again on Naga Panchami January 27th Episode

నేను కూడా చనిపోతానంటూ కరాళీ ఏడుస్తుంది. అన్ని శక్తులు కోల్పోయానని.. మోక్షను బలి ఇస్తే తప్ప నా శక్తులు తిరిగి రావని మహాకాళి చెప్పిందని తన అన్నతో వివరిస్తుంది. అలాగే మోక్షతో తన పెళ్లి చేయాలని వైదేహి భావిస్తున్నట్లు వివరిస్తుంది. నా కర్మఖాండలు జరిపించి నా ఆత్మకు విముక్తి కల్పించు అని నంబూద్రీ అనగా.. లేదు అన్నయ్యా.. నాకు కుటుంబ జీవితం మీద ప్రేమ లేదు... పెద్ద మాంత్రికురాలిని కావాలనుకుంటున్నాను అంటుంది. నీ కళ కూడా అదే కదా.. కనీసం నీ కళను అయినా నెరవేరుస్తానని అంటుంది. అందుకు నంబూద్రీ సరే అంటాడు. నేను మాంత్రికురాలిని అయ్యే వరకు నీవు ఆత్మగా ఇక్కడే ఉండమని కూడా చెబుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X