ఆదికేశవ పెను సంచలనం: థియేటర్లలో డిజాస్టర్.. అక్కడ బాలయ్య రికార్డు బ్రేక్
మెగా ఫ్యామిలీ నుంచి చాలా మందే హీరోగా వచ్చారు. అయితే, అందులో అతి తక్కువ మంది మాత్రమే గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుని సత్తా చాటారు. అలాంటి వారిలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకడు. మొదటి చిత్రం 'ఉప్పెన'తో హీరోగా పరిచయమైన అతడు.. వంద కోట్ల కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అదే సమయంలో ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసుకున్నాడు.
'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకోవాలన్న కసితో 'ఆదికేశవ' అనే సినిమాను చేశాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

డివోషనల్ టచ్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'ఆదికేశవ' మూవీకి ప్రీమియర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. రెండో రోజు కూడా ఇది అంతగా రెస్పాన్స్ దక్కించుకోలేదు. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే రన్‌ను ముగించుకుంది. దీంతో ఎన్నో నష్టాలను ఈ సినిమా చవి చూసింది.
వైష్ణవ్ తేజ్ - శ్రీలీల జంటగా నటించిన 'ఆదికేశవ' సినిమా థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలో కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే ఈ చిత్రం స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల షాకిస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఇది అదిరిపోయే స్పందనను అందుకుని సత్తా చాటుకుంది.
'ఆదికేశవ' సినిమాకు అర్బన్ ఏరియాలో 10.47 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి 9.87 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. అంతేకాదు, వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో 3వ బెస్ట్ రేటింగ్ అనే చెప్పాలి. ఇక, ఇటీవలే వచ్చిన 'భగవంత్ కేసరి', 'స్కంద' సినిమాల రికార్డులను ఇది బ్రేక్ చేసింది.

ఇదిలా ఉండగా.. 'ఆదికేశవ' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మించారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సుమన్, సుదర్శన్, సుధ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











