Don't Miss!
- News హైదరాబాద్ సిటీలో వర్షం: అటు ఎండలు.. ఇటు వానలు
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రెండోసారి కూడా బుల్లితెరపై ఉప్పెన జోరు.. సాలీడ్ టీఆర్పీ
మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే హీరోయిన్ కృతి శెట్టి కూడా ఇదే సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుసగా ఆఫర్స్ అందుకుంటోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది.
ఇక సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం కూడా మరొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని పాటలు సినిమాకు హెల్ప్ అయ్యాయి. ఇక సినిమా మొత్తంగా అనుకున్నట్లుగానే 100కోట్ల బిజినెస్ చేసి సుకుమార్ మాటను నిజం చేసింది. ఉప్పెనలా బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన ఈ సినిమా బుల్లితెరపై కూడా మొదటిసారి మంచి టిఆర్పీని అందుకుంది.
మొదటిసారి 18.51 TRPని అందుకున్న ఉప్పెన ఇటీవల రెండవసారి 11.37TRP ని అందుకోవడం విశేషం. డిజిటల్ లో అంతకుముందే విడుదలైనప్పటి టీవీ ప్రేక్షకులు కూడా సినిమాను గట్టిగానే చూశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ కొత్త సినిమా కూడా ఈ రేంజ్ లో రికార్డును అందుకోలేదు. ఇక హీరో వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ క్రిష్ డైరెక్షన్ లో చేసిన జంగిల్ బుక్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇక మరోవైపు కృతి శెట్టి రామ్ పోతినేని - లింగు స్వామి సినిమాతో పాటు నాని శ్యామ్ సింగరాయ్ లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇక దర్శకుడు బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం కథ సెట్ చేస్తున్న విషయం తెలిసిందే.