twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vakeel saab TRP: టాప్ 10లో కూడా కనిపించని పవర్ స్టార్ మూవీ.. మహేష్, బన్నీ కంటే తక్కువే..

    |

    ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే రికార్డులతో హీరోల రేంజ్ పెరిగేది. అయితే సోషల్ మీడియా ప్రభావం వలన ప్రస్తుతం ప్రతి విషయంలో కూడా అభిమానులు పోటీ తత్వాన్ని చూస్తున్నారు. ఎలాగైనా మా హీరోనే టాప్ లో ఉండాలని వారి స్టైల్ లో ట్రెండ్ చేయడం కూడా చేస్తున్నారు. ఇక ప్రీమియర్స్ TRP రేటింగ్స్ లో వకీల్ సాబ్ ఇటీవల బాగానే పోటీని ఇచ్చింది కానీ కనీసం టాప్ 10లో స్థానం సంపాదించుకోలేకపోయింది.

    Recommended Video

    Pawan Kalyan vakeel saab to release in ott platforms after 50 days. | Filmibeat Telugu
    ప్రతి ఏడాది మారుతూనే ఉంటుంది

    ప్రతి ఏడాది మారుతూనే ఉంటుంది

    టీవీలో మొదటిసారి బొమ్మ పడితే వచ్చే టీఆర్పీ ఇప్పుడు అభిమానులకు చాలా ముఖ్యంగా మారాయి. ఏ హీరో సినిమా ఎంత టీఆర్పీ తెచ్చింది అనే విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇక టాప్ 10 లిస్టు ప్రతి ఏడాది మారుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలో టీఆర్పీల లెక్కలను స్థానాలను మార్చేస్తున్నాయి.

    రేటింగ్ బాగానే వచ్చినా..

    రేటింగ్ బాగానే వచ్చినా..

    ఇక ఈ ఏడాది టాలీవుడ్ లో విడుదలైన బిగ్గెస్ట్ మూవీ వకీల్ సాబ్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక టీవీల్లో కూడా అదే రేంజ్ లో రేటింగ్స్ అందుకోవచ్చని అందరూ అనుకున్నారు. బాగానే రేటింగ్స్ అందుకున్నాడు కానీ టాప్ 10లోకి మాత్రం రాలేకపోయారు.

    జీ తెలుగులో 4వ స్థానం

    జీ తెలుగులో 4వ స్థానం

    జీ తెలుగులో ప్రసారమైన వకీల్ సాబ్ మొదటిసారి 19.12 TRPని అందుకుంది. జీ తెలుగులో టాప్ రేటింగ్స్ అందుకున్న సినిమాల్లో 4వ స్థానంలో నిలిచింది. శ్రీమంతుడు 22.54, దువ్వడా జగన్నాథమ్ 21.7, గీత గోవిందం 20.8 టీఆర్పీని అందుకున్నాయి.

    టాప్ 10 రేటింగ్స్ అందుకున్న సినిమాలు

    టాప్ 10 రేటింగ్స్ అందుకున్న సినిమాలు

    బార్క్ లెక్కల ప్రకారం టాప్ 10 రేటింగ్స్ అందుకున్న సినిమాల లిస్ట్ ఈ విధంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ BARC ప్రకారం టాప్ 10 టిఆర్పి రేటింగ్ సినిమాలు ఉన్నాయి. అల వైకుంఠపురములో - 29.4, సరిలేరు నీకేవ్వరు- 23.4, బాహుబలి 2- 22.7, శ్రీమంతుడు - 22.54, DJ- 21.7, బాహుబలి- 21.54, ఫిదా - 21.31, గీత గోవిందం - 20.8, జనతా గ్యారేజ్ -20.69, మహానటి- 20.21 వంటి సినిమాలు టాప్ రేటింగ్స్ అందుకున్నాయి.

    ఇక పవన్ కళ్యాణ్ వాటికంటే ఎక్కువ స్థాయిలో రేటింగ్స్ అందుకోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి కూడా ఆ విషయంలో పవర్ స్టార్ గట్టిగానే పోటీ ఇచ్చినప్పటికీ టాప్ 10లో స్థానం అందుకోలేకపోయారు.

    English summary
    Vakeel saab trp rating fails to beat ala vaikuntapurramloo and sarileru neekevvaru
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X