రష్మీ చేతిలో సుధీర్ వాలంటైన్స్ డే గిఫ్ట్.. ప్లీజ్! అలా చేయొద్దంటూ యాంకర్ రిక్వెస్ట్
ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14 వస్తుందంటే చాలు యువ హృదయాలన్నీ గిఫ్ట్స్ వైపే కన్నేస్తాయి. తాము ఎంతగానో ప్రేమించే వ్యక్తికి ఈ రోజున సూపర్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయాలని ఆరాటపడుతుంటాయి. అయితే ఈ గిఫ్ట్స్ వారి వారి అభిరుచులు, ఆర్ధిక స్తోమతను బట్టి ఉంటాయి. కాగా తాజాగా ఈ విషయమై స్పందించిన యాంకర్ రష్మీ.. ప్లీజ్! అలా చేయొద్దంటూ రిక్వెస్ట్ చేసింది. ఆమె చేసిన ఈ రిక్వెస్ట్ ఆలోచింపజేస్తోంది కూడా. ఇంతకీ రష్మీ ఏమంటోంది? అసలు మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే..

మూగ జీవాలపై రష్మీ ప్రేమ
ఈ సృష్టిలోని మూగ జీవాలంటే రష్మికి మహా ఇష్టం. జంతు ప్రేమికులరాలిగా జీవులను రక్షించే బాధ్యత మనుషులపై ఉందని ఇప్పటికే పలు సార్లు ప్రకటించింది రష్మీ. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి సృష్టి లోని జీవాలన్నింటినీ కాపాడుకోవాలని ఆమె పేర్కొంది.

వాలంటైన్స్ డే గిఫ్ట్.. ప్లీజ్! అలా చేయొద్దు
మీ లవర్స్‌కి మీకు నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వండి కానీ పెంపుడు జంతువులను మాత్రం కానుకగా ఇవ్వకండి అంటూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేసింది రష్మి. కొందరు కుక్కపిల్లల్ని, పిల్లుల్ని పెంచుకోమని గిఫ్ట్స్‌గా ఇస్తుంటారు. అయితే ఇచ్చింది లవర్ కదా అని ఆ రోజు వరకు వాటిని ప్రేమగా చూసుకుని కొన్నిరోజుల తర్వాత పట్టించుకోవడం మానేస్తుంటారు. అలాంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దంటూ యాంకర్ రష్మీ రిక్వెస్ట్ చేసింది.

మీ ప్రేమికులకు ఇలాంటి కానుక వద్దు
‘పిల్లులు, కుక్కలను పెంచుకోవాలంటే.. ఫైనాన్షియల్‌గా, ఎమోషనల్‌గా ఓ ఫ్యామిలీ పది నుంచి పదిహేనేళ్ల వరకు కాపాడుకోవాలి. ఈ వ్యాలెంటైన్స్ డే రోజున దయచేసి జంతువులను కొని వాటిని మీ ప్రేమికులకు కానుకలుగా ఇవ్వకండి' అని రష్మీ తెలిపింది. రష్మీ చూసిన పోస్ట్ చూసిన నెటిజన్స్ ‘సుధీర్ రష్మీ ఏమంటోందో నీకు అర్థమైతోందా' అంటూ కామెంట్స్ పెడుతుండటం విశేషం.
Recommended Video
జబర్దస్త్ పర్ఫామెన్స్.. రష్మీకి సుధీర్ గిఫ్ట్
ఇకపోతే వ్యాలెంటైన్స్ డే రోజున ‘ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్' షో కోసం రష్మి, సుధీర్ చేత స్పెషల్ పర్ఫామెన్స్ చేయించారు. ఇటీవలే విడుదల ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ‘వెన్నలవే వెన్నలవే' పాటకు రష్మి, సుధీర్ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రష్మీకి సుధీర్ లవ్ గుర్తు బెలూన్ గిఫ్ట్ ఇస్తూ విష్ చేశాడు.


Click it and Unblock the Notifications











