అల్లు అర్జున్ డాన్స్ గురించి వాణిశ్రీ కామెంట్

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్ డాన్స్ చూస్తే 'ఈ పిల్లాడి కాళ్లు రబ్బర్‌తో చేశా రా' అనిపిస్తుంది. రవితేజ, సిద్ధార్థ, మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు అలనాటి హీరోయిన్ వాణిశ్రీ. దాదాపు పదహారేళ్లపాటు తెలుగు చిత్రసీమ ను ఏలిన వాణిశ్రీ 'ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే'లో తన జ్ఞాపకాలు, అనుభవాలను ఇలా పంచుకుంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పోకడలు గురించి మాట్లాడుతూ... సినిమా మాత్రమే కాదు.. ప్రపంచమే మారుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ చెడిపోలేదు. చాలామంది మంచి సినిమాలు తీస్తున్నారు. ఇక అశ్లీలమంటే.. కొందరు డైరెక్టర్లకు మనసులో ఎక్కడో ఉం టుంది 'అలా' లైవ్‌లో చూడాలని. అందుకే అలా చూపిస్తున్నారు అన్నారు.

Vanisri about Allu Arjun's dance

తన మనసులో దాచుకున్న విషయాలు గురించి చెప్తూ...నాకు పెళ్లంటే కొంతమంది ఏడ్చారు. అంటే.. మనసులో నన్ను ప్రేమించారన్నమాట. ఇన్నిరోజులూ చెప్పలేదేమంటే.. 'నాకు పిల్లలున్నారనా, కావాలంటే రీకేనలైజేషన్ చేయించుకుంటా' అన్నారు. అప్పుడా వ్యక్తికి.. ఇట్స్ టూ లేట్, మనం స్నేహితులం అని చెప్పాను. 'దెబ్బకు ఠా దొంగల ముఠా', 'వింత కథ', 'బొంబాయి ప్రియుడు' సినిమాలు అస్సలు ఇష్టం లేకుండానే చేశాను అన్నారు.

ఇక ఒకసారి ఎన్టీఆర్.. 'కథానాయిక మొల్ల' సినిమా బాగా చేశానని, చివర్లో నేను కూర్చునే భంగిమ బాగుందని అన్నారు. నేను చీరకట్టి, పైటవేసే విధానం ఏదో రాచకుటుంబం నుంచి వచ్చినట్టనిపిస్తుందని కృష్ణంరాజు మెచ్చుకునేవారు. నాగేశ్వరరావు ఎప్పుడూ ప్రశంసించలేదు. కృష్ణ, నేను అసలు మాట్లాడుకునేవాళ్లమే కాదు. ఏ హీరో అయినా మా కళ్లలోకి చూసి మాట్లాడేవారుగానీ, ఎన్టీఆర్ మాత్రం ఎక్స్‌రే చూపులు చూసేవారు కాదు. కారణ జన్ముడంటే ఆయనే అని చెప్పుకోవాలి. ఏఎన్నార్‌కి మూడ్‌స్వింగ్ ఎక్కువ. కోపంగా ఉంటే ఒకలా ఉండేవారు. మామూలు గా ఉంటే చిన్నచిన్న జోకులు వేసేవారు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X