twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బిగ్ బాస్’ హౌస్‌లో ప్రేమలో పడలేదు.. ముగ్గురు పిల్లల తల్లి అలా చేసిందని..

    |

    'బిగ్ బాస్'.. గతంలో ఈ షో గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ, ఇప్పుడు మాత్రం అందరికీ తెలిసిపోయింది. దీనికి కారణం ఈ షో జరిగే తీరు.. దాని చుట్టు అల్లుకున్న వివాదాలే. ఉత్తరాదిలో ఎంతో పాపులర్ అయిన ఈ రియాలిటీ షోను.. దక్షిణాదిలో కూడా ట్రై చేశారు. అయితే, అక్కడిలా ఇక్కడ ప్రేక్షకులు ఆదరించదని అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా జరిగింది. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో ప్రారంభమైన ఈ షో విజయవంతంగా రెండు సీజన్లను కూడా పూర్తి చేసేసుకుంది.

    కొద్దిరోజుల క్రితం తమిళంలో మూడో సీజన్ కూడా ప్రారంభమైంది. దీనికి విశ్వ నటుడు కమల్ హాసన్ హోస్టింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 18 మంది కంటెస్టెంట్లతో చాలా గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ షో నుంచి అప్పుడే ఇద్దరు ఎలిమినేట్ కూడా అయిపోయారు. ఇందులో ఒకరు ఫాతిమాబాబు కాగా, మరొకరు తెలుగు వారికి సుపరిచితురాలైన వనితా విజయ్ కుమార్. ఈమె 1999లో ప్రేమ లీడ్‌ రోల్‌లో నటించిన 'దేవి' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోనే సినిమాలు చేశారు.

    Vanitha Vijaykumar Sensational Comments On Big Boss

    ఈ షో నుంచి ఇటీవల ఎలిమినేట్ అయిన తర్వాత వనిత.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ''నేను ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదు. నేను హౌస్‌లో ఎంతో కంఫర్ట్‌గా ఉన్నాను. షో నిర్వహకులు నన్ను బానే చూసుకున్నారు. తోటి కంటెస్టెంట్లు కూడా నాతో మంచిగానే మెలిగారు. అయితే, ఊహించని విధంగా నేను ఎలిమినేట్ అయ్యాను. నా కోసం ఓట్లు వేసిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు'' అని ఆమె అన్నారు.

    అంతేకాదు, 'బిగ్ బాస్' హౌస్‌లో ప్రేమల గురించి కూడా మాట్లాడారు. ''నిజానికి 'బిగ్ బాస్' హౌస్‌లో ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడతారు. నేను కూడా అలాంటి పని చేస్తానని చాలా మంది అనుకున్నారు. కానీ, నేను ముగ్గురు పిల్లల తల్లిని. నేనలాంటి తప్పులు చేయను. ఒకవేళ అలా చేసుంటే ముగ్గురు పిల్లల తల్లి అలా చేసిందని అంతా నవ్వుకుంటారు'' అని ఆమె చెప్పుకొచ్చారు.

    వాస్తవానికి ఈ షోలో వనిత ఉంటున్న తీరు పట్ల అభిమానులు సంతృప్తిగానే ఉన్నారు. అసలు ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఆదివారం ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయని, ఎలిమినేట్ కాక తప్పదని హోస్ట్ కమల్ ప్రకటించారు.

    English summary
    The first time actor-producer Vanitha Vijayakumar ascended the Bigg Boss Tamil stage before entering the house for the third season of the show, TV audiences across Tamil Nadu let out a collective gasp.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X