కార్తీక దీపం2 నుంచి సినిమా లెవల్లో సాంగ్.. స్టోరీ రివిల్... ఈసారి మోనిత ఎవరో తెలుసా?
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం అంటూ... మళ్లీ వంటలక్క, డాక్టర్ బాబులు వచ్చేస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ కు సీక్వెల్ గా కార్తీక దీపం ఇది నవ వసంతం తెరకెక్కుతుంది. ఈ సీరియల్ ప్రమోషన్స్ ను మేకర్స్ గట్టిగానే చేస్తున్నారు. మొదటి సీరియల్ సాంగ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాజాగా కొత్త సాంగ్ రిలీజ్ అయింది. అందులో దీప దీపాలను పట్టుకుని ఎంట్రీ ఇచ్చింది. ఆ పాటతో కాస్త స్టోరీని రివిల్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
బుల్లితెరపై మళ్లీ కార్తీక దీపం ఇది నవ వసంతం సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఎన్నోఏళ్లుగా డాక్టర్ బాబు, వంటలక్క టీవీ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ సీక్వెల్ తో మరోసారి బుల్లితెరకు అతుక్కుపోయేలా చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ సీరియల్ ఈ సోమవారం నుంచి రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. సీరియల్ మీద హైప్ పెంచేందుకు మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు.

ఇప్పటికే ఈ సీరియల్ నుంచి ప్రోమోలు రిలీజ్ చేస్తూ వచ్చారు. మరోవైపు ఇటీవల కార్తీక దీపం సీరియల్ ప్రీ రిలీజ్ ఈవెంటును కూడా నిర్వహించారు. తొలిసారి ఒక సీరియల్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం విశేషం. ఇక గత సీరియల్ కంటే గొప్పగా సినిమాను తలపించేలా ఉంటుందని హింట్స్ ఇస్తూ వస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్, దీప అలియాస్ ప్రేమి విశ్వనాద్ ప్రచారం చేస్తున్నారు.
ఈ సీరియల్ కు సంబంధించిన రీల్స్ చేస్తూ... అలరిస్తున్నారు. ఈసారి మరింత కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ సీరియల్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ సినిమా పాటను తలపిస్తుంది. గతంలో కార్తీక దీపం సాంగ్ ఏ రేంజులో ఆకట్టుకుందో తెలిసిందే. డీజే వర్షన్ కూడా రిలీజ్ అయి.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆ పాటనే వినిపించింది. ఇప్పుడు మరోసాంగ్ కూడా అంతకు మించి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ పాటలో కాస్త స్టోరీని రివిల్ చేశారు. తమిళ సీరియల్ 'చెల్లమ్మ'ను తెలుగులో కార్తీకదీపం 2 నవ వసంతం పేరుతో రీమేక్ చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. అయితే కార్తీకదీపం సీరియల్‌కు దర్శకత్వం వహించిన కాపుగంటి రాజేంద్రే.. కార్తీకదీపం 2ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక కార్తిక్, దీప పాత్రలు తప్ప మిగతా వారంత కొత్తగా కనిపిస్తున్నారు. ఇక మోనిత పాత్రలో ఓ కొత్త అమ్మాయి కనిపిస్తుంది. ఆమె సైతం కార్తిక్ ను ప్రేమిస్తున్నట్లు పాట చూస్తే అర్థం అవుతుంది.
ఇక ఈ సీరియల్ నుంచి విడుదలైన పాటలో మళ్లీ దీపగా ప్రేమి విశ్వనాథ్, కార్తీక్‌గా నిరుపమ్ పరిటాల నటిస్తున్నారు. చిన్నారి శౌర్యగా చైత్రలక్ష్మి నటిస్తుండగా.. మోనిత పాత్రలో కొత్త అమ్మాయి నటిస్తుంది. మరి ఈ సీరియల్ నుంచి విడుదల అయిన సాంగ్ ను మీరు చూశారా.. చూస్తే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.


Click it and Unblock the Notifications










