నల్ల చీరలో నడుము మడతలు చూపిస్తూ .. హీరోయిన్లను మించి అంటోన్న వంటలక్క
ప్రస్తుతం సినిమా హీరోయిన్లతో సమానంగా ఫేమ్‌ని నేమ్‌ని సంపాదిస్తున్నారు సీరియల్ బ్యూటీస్. హీరోయిన్లను మించిన అందంతో మెస్మరైజ్ చేసేవారు ఎందరో . అందాల ఆరబోత విషయంలోనూ సీరియల్ నటీమణులు తగ్గడం లేదు. సాంప్రదాయ వస్త్రాలైనా, మోడ్రెన్ డ్రెస్సుల్లోనైనా దుమ్ముదులిపేస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు తెలుగు బుల్లితెర నటి శిరీష వల్లభనేని. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన శిరీష దామెరకు రజిత, సౌజన్య అనే సిస్టర్స్ ఉన్నారు. వారు కూడా బుల్లితెర నటులే కావడం గమనార్హం. తొలుత మొగలి రేకులు సీరియల్‌తో ప్రేక్షకులకు పరిచయమయ్యారు శిరీష దామెర. తన అందం , అభినయంతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన శిరీష. తర్వాత వరుస అవకాశాలను దక్కించుకున్నారు. రాములమ్మ, మనసు మమత, స్వాతి చినుకులు, నాతి చరామి, కాంచన గంగ, చెల్లెలి కాపురం వంటి సీరియల్స్‌తో తెలుగులోని అన్ని టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లోనూ నటించారు.

సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలోనే నవీన్ వల్లభనేని అనే వ్యక్తిని శిరీష పెళ్లాడారు. ఈ దంపతులకు శ్రీ ఈష్ అనే బాబు కూడా ఉన్నాడు. కెరీర్‌లో దూసుకెళ్తూ , పర్సనల్ లైఫ్‌లోనూ ఎంజాయ్ చేస్తున్న దశలో భర్త నుంచి అనూహ్యంగా విడాకులు తీసుకుని షాకిచ్చారు శిరీష. ఓ రోజున భర్త నుంచి విడిపోయినట్లుగా పోస్ట్ పెట్టి కలకలం రేపింది. నేను, నవీన్ భార్యాభర్తలుగా విడిపోయామని.. మా చేతుల్లో లేని కొన్ని పరిస్ధితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఈ పరిస్ధితుల్లో మమ్మల్ని అర్ధం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నామని శిరీష తెలిపారు. నవీన్‌పై తనకు ఇంకా గౌరవం ఉందని, వీలైతే మాకు మద్ధతుగా నిలబడండి.. విమర్శించొద్దు అని ఆమె విజ్ఞప్తి చేశారు.
శిరీష - నవీన్‌లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తరచుగా ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. ఇక భార్య కడుపుతో ఉన్నప్పుడు నవీన్ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. బేబీ షవర్ వేడుకలను సైతం గ్రాండ్‌గా నిర్వహించారు. అలాంటి ఈ జంట విడిపోవడం శిరీష అభిమానులను, బుల్లితెర వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే ఓ సీరియల్ నటుడి వల్లే శిరీష - నవీన్ విడిపోయారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
భర్త నుంచి విడిపోయిన తర్వాత సీరియల్స్‌లో బిజీ అయిన శిరీష.. siris world పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి అద్భుతంగా నడుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శిరీష.. తన వ్యక్తిగత వివరాలు, సీరియల్స్ సంగతులను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నల్ల చీరలో నడుము మడతలు, అందాలు ఆరబోస్తూ శిరీష మెరిసిపోతున్నారు. ఇంకేందుకు ఆలస్యం మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











