వరలక్ష్మీ శరత్ కుమార్‌కు పెళ్లంటే భూతం.. ఓంకార్ అనడంతో 'సిగ్గుందా నీకు' అంటూ!
సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ రంగంలో కాలు మోపిన వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్గా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. పోడాపోడీ సినిమాతో కేరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ విశాల్, శింబు వంటి తదితర మీడియం రేంజ్ హీరోలతో కొన్ని సినిమాలు చేసింది.
కానీ ఆ సినిమాలు అనుకున్నంత పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ తర్వాత విలన్ రోల్స్ చేసిన తమిళ, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే పెళ్లంటే ఇష్టం లేని వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది.
Photo Credits: Star Maa

మంచి నటనతో: వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల బాలకృష్ణ వీర సింహా రెడ్డి మూవీతో మరో హిట్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్గా విజయం సాధించకపోయినప్పటికీ కూడా మంచి నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది.

క్రాక్ తర్వాత: వరలక్ష్మీ హీరోయిన్ గా కాకుండా లేడీ విలన్గా కొన్ని సినిమాల్లో ఊహించినంత రేంజ్లో రెస్పాన్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఇళయదళపతి విజయ్ నటించిన సర్కార్, పందెం కోడి 2, తెనాలి రామకృష్ణ బీఎల్, క్రాక్ చిత్రాల్లో విలన్ గా ఆకట్టుకుని ఆశ్చర్యపరిచింది. ఇక క్రాక్ సినిమా తర్వాత వరలక్ష్మీకి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి.

సిక్త్స్ సెన్స్: నాంది, పక్కా కమర్షియల్, యశోద, వీర సింహారెడ్డి, కస్టడీ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం 'శబరి', 'వర ఐపీఎస్', 'హను-మాన్', 'పంబన్', 'కలర్స్', 'లగామ్', 'పిరంతల్ పరాశక్తి' వంటి తదితర చిత్రాలతో బిజీగా ఉంది. అలాగే 'కొండ్రాల్ పావమ్' అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓంకార్ సిక్త్స్ సెన్స్ ప్రోగ్రామ్ లో బిందు మాధవితో సహా వరలక్ష్మీ సందడి చేసింది.

మూవీ సీన్: రారా రక్కమ్మ, ఊ అంటావా మావ పాటలకు బిందు మాధవి అదరగొడితే.. రంజితమే సాంగ్ లో వరలక్ష్మీ సూపర్బ్ గా డ్యాన్స్ చేసింది. అనంతరం వీర సింహా రెడ్డి సినిమాలో తాను చెప్పిన డైలాగ్ ను అక్కడనున్న విదేశీ యువతులతో చెప్పించింది వరలక్ష్మీ. అనంతరం ఆ సినిమాలోని సన్నివేశాన్ని చూపించారు.

రెండు వేళ్లు క్రాస్: సీన్ తర్వాత "నేనొక క్వశ్చన్ అడిగాను. ఇందాక తిట్టావే.. అదొక్కసారి చెప్పవా" అని వరలక్ష్మీని అని ఓంకార్ అడిగాడు. దానికి 'సిగ్గుందా నీకు' అనే డైలాగ్ చెప్పింది వరలక్ష్మీ శరత్ కుమార్. అనంతరం "నీకు ఇష్టం లేని టాపిక్" అని ఓంకార్ అంటే.. "ఏంటో" అని బిందు మాధవి అంది. దానికి ఓంకార్ "పెళ్లి" అనగానే బిందు "అబ్బో" అని అంటే.. వరలక్ష్మీ శరత్ కుమార్ మాత్రం రెండు వేళ్లను క్రాస్ గా పెట్టింది.
ఆ సింబల్ ఏంటీ: వరలక్మ్మీ శరత్ కుమార్ చిరాకు పడుతూ అలా వేళ్లు క్రాస్ చేయగానే.. "ఆ సింబల్ ఏంటీ" అని ఓంకార్ అడిగాడు. "భూతం వస్తే క్రాస్ పెడతారు కదా. అది నా పక్కకు రాకూడదని" అని వరలక్ష్మీ అంది. "ఏంటీ పెళ్లి అనేది నీకు భూతమా" అని ఓంకార్ అన్నాడు. దీంతో వరలక్ష్మీ శరత్ కుమార్, బిందు మాధవి తెగ నవ్వేశారు.


Click it and Unblock the Notifications











