Globe trotter: వారణాసి ఈవెంట్‌లో షాకింగ్... సుమ కనకాలకు ఆమె వార్నింగ్, పక్కకి పిలిచి

తన వాగ్థాటి, సమయస్పూర్తితో గత కొన్ని దశాబ్ధాలుగా తెలుగునాట యాంకరింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు సుమ కనకాల. సినిమా ఈవెంట్స్, ఇంటర్యూలు, బుల్లితెరపై కార్యక్రమాలు, సినిమాలు ఇలా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా సుమ అంటే యాంకర్.. యాంకర్ అంటే సుమ అనిపించుకున్నారు. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే సుమ హోస్ట్‌గా చేయాల్సిందే అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి సుమకు చేదు అనుభవం ఎదురైంది. ఈ వివరాల్లోకి వెళితే..

గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న మూవీ వారణాసి. నిన్న మొన్నటి వరకు ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారు? మహేశ్ లుక్ ఎలా ఉండబోతోంది? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటికీ నవంబర్ 15న రామోజీ ఫిలింసిటీలో జరిగిన గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌లో చెక్ పెట్టేశారు జక్కన్న. ఈ సినిమా పేరును వారణాసిగా ఫిక్స్ చేయడంతో పాటు మహేశ్ లుక్‌ను విడుదల చేశారు. దాంతో గత రాజమౌళి- మహేశ్‌బాబుల సినిమా కాన్సెప్ట్ ఏంటీ? కథను ఎలా నడిపించబోతున్నారు? అన్న దానికి క్లారిటీ వచ్చేసింది.

Varanasi Rama Rajamouli warn to Suma Kanakala during Mahesh babu s Globe Trotter event

అట్రాక్షన్‌గా సుమ యాంకరింగ్‌
టాలీవుడ్ టూ హాలీవుడ్ వరకు అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కార్యక్రమాన్ని రాజమౌళి విజయవంతంగా ముగించారు. గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌‌కు సుమ కనకాలతో పాటు బాలీవుడ్‌కు చెందిన ఆశీష్ చాంచలానీలు హోస్ట్‌‌లుగా వ్యవహరించి కార్యక్రమం సక్సెస్ కావడంతో తమ వంతు పాత్ర పోషించారు. అయితే ఎప్పుడు ఈ ఈవెంట్‌కు హాజరైనా అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తారు సుమ. దీనిలో భాగంగా గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌లోనూ సుమ పలువురు సెలబ్రెటీల దగ్గరికి వెళ్లి వారిని ఫన్నీగా ఇంటర్వ్వూ చేసింది.

పిచ్చ వాగుడు ఆపు
ఈ క్రమంలోనే రమా రాజమౌళి దగ్గరికి వెళ్లి స్టైలింగ్ గురించి, మహేశ్ బాబు గారి గురించి ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే ఏం చెబుతారు? అని ప్రశ్నించారు సుమ. మహేశ్ గారు ఆ షర్ట్‌ని అలాగే కంటిన్యూ చేయాలని రమ చెప్పడంతో అందరూ నవ్వేస్తారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌లకు కూడా ఓ టిప్ చెప్పమని సుమ మలయాళంలో ఓ పెద్ద డైలాగ్ చెబుతుంది. దాంతో పిచ్చ వాగుడు ఆపి సున్నితంగా మాట్లాడమని రమా సున్నితంగా మందలించారు.

ఆ ఇన్సిడెంట్‌ను కవర్ చేసిన సుమ
కానీ ఆ సమయంలో మైక్ ఆన్‌లోనే ఉందన్న సంగతి రమా గమనించలేదు. అయితే అక్కడుంది సుమ కాబట్టి.. ఈ వార్నింగ్‌ను కూడా తనదైన శైలిలో కవర్ చేశారు. అయ్యో ఈవిడ మైక్‌లోనే తిట్టేస్తోందని.. ఇదంతా ఎడిటింగ్‌లో తీయడానికి కూడా లేదే, ఇది లైవ్ టెలికాస్ట్ అని సెటైర్ వేసింది. ఇంత జరిగినా వదలకుండా పృథ్వీరాజ్ గారి గురించి ఒక టిప్ చెప్పమని అడిగింది సుమ. వాళ్లంతా లెజెండ్స్ అండి వీళ్లకి నేనేం టిప్ ఇస్తానని రమా రాజమౌళి ఆన్సర్ ఇచ్చారు. ఆరోజు ఎల్ఈడీ స్క్రీన్‌‌పై ట్రైలర్ రాకపోవడంతో దాని గురించి ప్రేక్షకులు, సెలబ్రిటీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హడావుడిలో వీరి సంభాషణను జనం పట్టించుకోలేదు. అయితే ఈవెంట్ ముగిసిన తర్వాత వారణాసి టైటిల్ లాంచ్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఈ విషయం బయటపడింది. దాంతో సుమ యాంకరింగ్ స్కిల్స్‌ను మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఎలాంటి స్క్రిప్ట్ లేకపోయినా జనానికి బోర్ కొట్టకుండా మేనేజ్ చేసి సక్సెస్ చేశారు సుమ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X