twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కళ్లకు అలా కనిపిస్తాడు.. ఇమాన్యుయేల్‌పై ప్రేమను బయటపెట్టేసిన వర్ష

    |

    జబర్దస్త్ వేదికపై మరో కొత్త జంట లైమ్ లైట్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై షోలు అన్నీ కూడా పులిహోర, లవ్ ట్రాకుల మీదే నడుస్తోంది. ఎవరి జంట కెమిస్ట్రీ బాగుంటే వారితోనే ఈవెంట్లను ప్లాన్ చేస్తుంటారు. ఏ జంట ట్రెండింగ్‌లో ఉండే వారినే హైలెట్ చేస్తుంటారు. ప్రస్తుతం హవా అంతా కూడా ఇమాన్యుయేల్ వర్షలదే. ఈ ఇద్దరూ జబర్దస్త్ వేదికపై నుంచి తాజాగా వెలుగుతోన్న కొత్త ఆర్టిస్ట్‌లు.

     జంటగా మార్కులు..

    జంటగా మార్కులు..

    ఇమాన్యుయేల్ మొదటి నుంచి మంచి ఆర్టిస్ట్, టైమింగ్ ఉన్నావాడని అందరికీ తెలిసిందే. రోజా కూడా ఇమాన్యుయేల్‌ను బాగానే ప్రోత్సహించేది. స్కిట్లలలో కావాలనే తిట్టించుకునే వాడు. అయితే ఒక్కసారి వర్షతో స్కిట్‌లో కెమిస్ట్రీ కుదరడంతో ఇద్దరి దశ తిరిగింది. వర్ష ఇమాన్యుయేల్ జంటకు ఇప్పుడు మామూలు ఫాలోయింగ్ లేదు.

    ఇక్కడే గుర్తింపు..

    ఇక్కడే గుర్తింపు..

    సీరియల్ నటిగా ఎప్పటి నుంచి వర్ష ఉన్నా కూడా ఆమెకు ఇంతగా గుర్తింపు రాలేదు. జబర్దస్త్‌లో ఇమాన్యుయేల్ సరసన చేసిన స్కిట్, అందాలను ఆరబోయడంతో ఒక్కసారిగా సెన్సేషనల్ అయింది. అలా అప్పటి నుంచి ఈ ఇద్దరిని జంటగా చూపించడం, రొమాంటిక్ స్కిట్స్ పెట్టడం వంటివి చేస్తున్నారు.

    కెమిస్ట్రీ వర్కవుట్..

    కెమిస్ట్రీ వర్కవుట్..

    వర్ష, ఇమాన్యుయేల్ కెమిస్ట్రీ ఫుల్ వర్కవుట్ అవ్వడంతో జబర్దస్త్ డైరెక్షన్ టీం ఫోకస్ మొత్తం ఈ ఇద్దరి మీదే పెట్టినట్టు కనిపిస్తోంది. స్కిట్లలోనే కాకుండా సపరేట్‌గా కూడా బాగానే శ్రద్ద చూపిస్తున్నారు. రోజా కూడా ఈ ఇద్దరి మధ్య ట్రాకు ఉందన్నట్టుగా, ఒకరిపై ఒకరికి ఇష్టం ఉందేమోఅనేట్టుగా మాట్లాడుతోంది.

    అందం ముఖ్యం కాదు..

    అందం ముఖ్యం కాదు..

    ఆ మధ్య ఓ ఎపిసోడ్‌లో ఈ ఇద్దరిని నిలబెట్టి మరీ ఈ వ్యవహారాన్ని తేల్చింది. ఇమాన్యుయేల్ అంటే ఇష్టమా? అందంగా లేడు కదా? అని రోజా అడిగేసింది. అందం ముఖ్యం కాదు. మంచి వాడు. నన్ను బాగా గౌరవిస్తాడంటూ ఇమాన్యుయేల్ గురించి వర్ష గొప్పగా చెప్పేసింది.

    తాజాగా ఇలా..

    సంక్రాంతి సందర్భంగా అత్తో అత్తమ్మ కూతురో అనే ఈవెంట్‌‌ను చేస్తున్నారు. అందులో వర్ష, ఇమాన్యుయేల్ ఓ పాటకు డ్యాన్స్ చేశారు. మన్మథుడా నిన్ను కలగన్నా అనే పాటకు అదిరిపోయే రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు. అది చూసిన రోజా షాక్ అవుతూ.. నీ కళ్లకు నిజంగానే మన్మథుడిలా కనిపిస్తున్నాడా?అని వర్షను అడిగింది. అవును మన్మథుడిలానే కనిపిస్తున్నాడంటూ ఇమాన్యుయేల్‌పై ప్రేమను వర్ష బయటపెట్టేసింది.

    English summary
    Varsha and Emmanuel Romance In Atto Attamma Kuthuro,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X