For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షోలో నిజంగానే ఏడ్చేసిన జబర్ధస్త్ వర్ష: లవర్ గురించి రోజా ఆ మాట అడగ్గానే.. తట్టుకోలేనంటూ అక్కడే!

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఇది ఎన్నో అరుదైన రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు కొన్ని వందల మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలా వచ్చి ఫేమస్ అయిన వారిలో లోకల్ బ్యూటీ వర్ష ఒకరు. గెస్టుగా వచ్చిన పర్మినెంట్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయిన ఆమె.. తనదైన శైలి టైమింగ్‌తో అలరిస్తోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ మజాను కూడా పంచుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా షోలో నిజంగానే ఏడ్చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  మోడలింగ్ నుంచి సీరియళ్లలోకి

  మోడలింగ్ నుంచి సీరియళ్లలోకి

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో వర్ష ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన గ్లామర్‌తో ఓ ఊపు ఊపిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సీరియళ్లలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో సీరియళ్లలో నటించి మెప్పించిందామె. అందులో ‘అభిషేకం', ‘తూర్పు పడమర', ‘ప్రేమ ఎంత మధురం' వంటివి ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి.

  అలా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది

  అలా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది

  సీరియల్ నటిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోన్న వర్షను ఓ స్కిట్ కోసం జబర్ధస్త్‌కు తీసుకొచ్చాడు హైపర్ ఆది. అలా అందులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అందంతో పాటు అద్భుతమైన టైమింగ్‌తో ప్రేక్షకులను మాయ చేసింది. తద్వారా ఆ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లలో సైతం చేస్తూ మంచి పేరు తెచ్చుకుందామె.

  అతడితో లవ్ ట్రాకుతో పాపులర్

  అతడితో లవ్ ట్రాకుతో పాపులర్

  జబర్ధస్త్‌లో స్కిట్లు చేస్తున్నప్పటికీ.. వర్షకు గుర్తింపు వచ్చింది మాత్రం యంగ్ టాలెంటెడ్ కమెడియన్‌ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడపడం ద్వారానే. స్కిట్ల కోసం లవర్లుగా నటించిన వీళ్లిద్దరూ.. తమ వ్యవహార శైలితో కొంత కాలానికి నిజంగానే ప్రేమించుకుంటున్నారా? అన్న అనుమానాలను అందరిలోనూ రేకెత్తించారు. ఇలా జబర్ధస్త్ వర్ష ఓ రేంజ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది.

  కిస్‌లు... హగ్గులతో హాట్ టాపిక్

  కిస్‌లు... హగ్గులతో హాట్ టాపిక్

  వర్ష.. ఇమాన్యూయేల్ జోడీ జబర్ధస్త్‌లోనే కాదు.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోలోనూ రచ్చ చేస్తున్నారు. చాలా తక్కువ సమయంలోనే వీళ్లిద్దరికీ మంచి పేరు రావడంతో నిర్వహకులు ఈ జంటనే బాగా హైలైట్ చేస్తున్నారు. దీంతో రొమాంటిక్ సీన్స్ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే తరచూ ముద్దులు, హగ్గులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. తద్వారా ఈ జంట విపరీతంగా పాపులర్ అయిపోతోంది.

  ఆ షోలో ఏకంగా పెళ్లి చేసేశారుగా

  ఆ షోలో ఏకంగా పెళ్లి చేసేశారుగా

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్ష.. కొద్ది రోజుల క్రితం తనకు ఎంగేజ్‌మెంట్ రింగ్ ధరించిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అంతేకాదు, జూలై 4న బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ పేర్కొంది. దీంతో ఇదంతా నిజమే అని అనుకున్నారు. అయితే, వర్ష చేసింది కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రమోషన్ కోసమని తర్వాత తెలిసింది. ఇందులో వర్ష.. ఇమాన్యూయేల్‌కు పెళ్లి చేశారు.

  లవర్ గురించి ఆ మాట అడగ్గానే

  లవర్ గురించి ఆ మాట అడగ్గానే

  వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎక్స్‌స్టా జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో వర్ష.. ఇమాన్యూయేల్ ప్రేమించుకున్నా.. పెళ్లి చేసుకోలేకపోయినట్లు చూపించారు. దీంతో స్కిట్ అయిన తర్వాత రోజా మాట్లాడుతూ.. ‘వర్ష స్కిట్‌లోనే ఇంత బాధ పడుతుంది. నిజంగా ఇమ్మూకు వేరే వాళ్లతో పెళ్లైతే నీ పరిస్థితి ఏంటి' అని ప్రశ్నించగా.. ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది.

  నిజంగానే ఏడ్చేసిన జబర్ధస్త్ వర్ష

  నిజంగానే ఏడ్చేసిన జబర్ధస్త్ వర్ష

  రోజా అడిగిన ప్రశ్నకు వర్ష సమాధానం చెబుతూ.. ‘ప్రతి అమ్మాయి ఇష్టపడిన అబ్బాయితో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటుంది. కానీ, మన ప్లేస్‌లో వేరే వాళ్లు ఉంటే తట్టుకోవడం కష్టం మేడం' అంటూ అక్కడే ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న ఇమాన్యూయేల్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో రోజా ‘ఎందుకలా ఉన్నావ్ అని' అతడిని అడగగా.. ఈ కమెడియన్ కూడా ఏడ్చేశాడు.

  English summary
  Telugu Actress, Model Jabardasth Fame Varsha Fell in Love with Comedian Immanuel. Now She Crying in the Show for her Boyfriend. This Video Gone Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X