నైట్ టైమ్ కాల్ చేసి అలా అడిగేశాడు.. అప్పుడే అలాంటోడని ఫిక్సయ్యా: కమెడియన్‌ నిజస్వరూపం బయటపెట్టిన వర్ష

గతంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే చాలా కష్టంగా ఉండేది. అయితే, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది తమ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తద్వారా షోలలోనో, సినిమాల్లోనో అవకాశాలు అందుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తెలుగులోనే టాప్ కామెడీ షోగా వెలుగొందుతోన్న జబర్ధస్త్ వల్ల ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో వర్ష ఒకరు. కొద్ది రోజులుగా షోలో సందడి చేస్తున్న ఆమె.. తాజాగా ఓ కమెడియన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

 అలా మొదలైన కెరీర్.. ఆ సీరియళ్లలో ఫేమ్

అలా మొదలైన కెరీర్.. ఆ సీరియళ్లలో ఫేమ్

నటిగా స్థిరపడాలన్న కోరికతో మోడలింగ్ రంగంలోకి అడుగులు వేసింది వర్ష. అలా కొన్నేళ్ల పాటు కెరీర్‌ను ఆరంభించిన ఆమె.. దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. దీంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే పలు చానెళ్లో ప్రసారం అవుతోన్న 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించి మెప్పించిందీ తెలుగు బ్యూటీ.

ఆ కమెడియన్ ద్వారా జబర్ధస్త్‌ షోలోకి ఎంట్రీ

ఆ కమెడియన్ ద్వారా జబర్ధస్త్‌ షోలోకి ఎంట్రీ

సీరియల్ యాక్టర్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే వర్షకు జబర్ధస్త్ షోలో పాల్గొనే అవకాశం కల్పించాడు టాప్ టీమ్ లీడర్ హైపర్ ఆది. ఆరంభంలోనే మెప్పించిన ఈ బ్యూటీ.. అప్పటి నుంచి ఆ షోలో భాగం అయిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో స్కిట్లలో అద్భుతంగా చేసింది. అలా హైపర్ ఆదితో పాటు రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లలో సైతం చేస్తూ అలరిస్తోందీ ముద్దుగుమ్మ.

అతడితో లవ్ ట్రాక్... ముద్దులు... హగ్గులతో

అతడితో లవ్ ట్రాక్... ముద్దులు... హగ్గులతో

జబర్ధస్త్‌లో లేడీ కంటెస్టెంట్‌గా వెలుగొందుతోన్న వర్ష.. ఆ షోలోని టాలెంటెడ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. కొంత కాలంగా వీళ్లిద్దరూ కలిసి రొమాంటిక్ యాక్టులు చేస్తుండడమే. అంతేకాదు, తరచూ ముద్దులు, హగ్గులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ జంట విపరీతమైన స్థాయిలో పాపులర్ అయిపోతోంది.

ఎప్పుడూ అందులోనే... హాట్ టాపిక్‌గా వర్ష

ఎప్పుడూ అందులోనే... హాట్ టాపిక్‌గా వర్ష

జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది వర్ష. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోందామె. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

అలాంటివే షేర్ చేస్తూ.. పాపులర్ అయిందిగా

అలాంటివే షేర్ చేస్తూ.. పాపులర్ అయిందిగా


తెలుగు అమ్మాయిలు స్కిన్ షో చేయరు అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకే ఉత్తరాది అమ్మాయిలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆ బౌండరీలను దాటేస్తూ అందాలను ఒలకబోస్తోంది వర్ష. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను ఒక్కొక్కటిగా వదులుతూ కుర్రకారు గుండెల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది.

ఇమాన్యూయేల్ నిజస్వరూపం బయటపెట్టింది

వచ్చే వారం ప్రసారం కానున్న జబర్ధస్త్ షోలో వర్ష.. కెవ్వు కార్తీక్ టీమ్‌లో చేసింది. ఈ సందర్భంగా మరోసారి ఇమాన్యూయేల్‌తో కలిసి ఫన్సీ స్కిట్‌లో నటించింది. ఇక, అది పూర్తయిన వెంటనే ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంలోనే కమెడియన్ ఇమాన్యూయేల్ నిజస్వరూపం బయట పెట్టింది. దీంతో రోజా 'నువ్వంటే అంత లవ్' అంటూ కామెంట్ చేసింది.

నైట్ కాల్ చేసి అలా అడిగాడు.. అప్పుడే ఫిక్స్

నైట్ కాల్ చేసి అలా అడిగాడు.. అప్పుడే ఫిక్స్

జబర్ధస్త్ స్టేజ్‌పై వర్ష మాట్లాడుతూ.. 'నేను బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నానని యూట్యూబ్‌లో ఎవరో ట్రోల్ చేశారు. అప్పుడు కంగారు పడి ఇమాన్యూయేల్ నాకు నైట్‌లో కాల్ చేశాడు. ''వర్ష ఎక్కడున్నావు? బాగున్నావుగా'' అని ఆరా తీశాడు. అప్పుడే వీడు ఎలాంటోడో అర్థం అయింది. ఆ సమయంలోనే ఇమ్మూ నావాడు అని ఫిక్సైపోయా' అంటూ చెప్పుకొచ్చిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X