దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది.. ప్రేమ, పెళ్లిపై విరక్తి.. బ్రేకప్‌పై నోరు విప్పిన యాంకర్ వర్షిణి
బుల్లితెరపై వర్షిణి ఎంతలా రచ్చ చేస్తుందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్, వెబ్ సిరీస్‌ల నుంచి బుల్లితెరకు ప్రయాణం మలుపు తిరిగింది. బుల్లితెరపై యాంకర్‌గా ఎదిగేందుకు వర్షిణి బాగానే కష్టపడింది. మొదట్లో కాస్త తడబడిని, సెటైర్లు, నెగెటివ్ ట్రోల్స్ వచ్చినా కూడా మొత్తానికి నిలబడింది. స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం యాంకర్ వర్షిణి అంటే సోషల్ మీడియాలో ఓ క్రేజ్ ఉంది. ఇక వర్షిణి అంటే కచ్చితంగా హైపర్ ఆది గురించి చెప్పాల్సిందే.

అలా రచ్చ..
యాంకర్‌గా వర్షిణికి పటాస్ బాగానే గుర్తింపును తీసుకొచ్చింది. ఢీషోలో ఎంట్రీ ఇవ్వడంతో మరింతగా ఫేమస్ అయింది. అందులో మొదట్లో బాగా నెగెటివ్ వచ్చింది. డ్యాన్స్ మూమెంట్స్ రాకపోవడం, మిగిలిన వారంతా ఆమెపై సెటైర్లు వేస్తూ వచ్చే వారు. కాని ఇప్పుడు వర్షిణి డ్యాన్సుల్లోనూ మెరుగుపర్చుకుంది. యాంకర్‌గా నిలదొక్కుకుంది.

హైపర్ ఆదితో అలా..
ఇక ఢీ షోలోకి హైపర్ ఆది ఎంట్రీ ఇవ్వడం, అక్కడ వర్షిణితో బాగానే కనెక్ట్ అవ్వడంతో కథ మొదలైంది. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఏకంగా ఈ ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు కూడా యూట్యూబ్‌లో హల్చల్ చేశాయి. అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారిద్దరూ ఎన్నో సార్లు ఖండించారు.

అలీతో సరదాగా..
తాజాగా హైపర్ ఆది, వర్షిణి ఇద్దరూ కూడా అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు.అందులో వర్షిణి తన బ్రేకప్ స్టోరీ చెబుతూ.. పెళ్లి ఎంత విరక్తిగా ఉందో చెప్పింది. అదే సమయంలో హైపర్ ఆది తన మనుసులో వర్షిణిపై ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టేశాడు.

పెళ్లి ఎందుకు?
పెళ్లి ఎందుకు ఇలా సింగిల్‌గా ఉంటేనే ఎంతో హ్యాపీగా ఉంటుందని వర్షిణి చెప్పుకొచ్చింది. ఎందుకంత విరక్తి వచ్చింది.. ఏదైనా ఉందా? ఎవరైనా సెట్ కాలేదా? అని అలీ ప్రశ్నించాడు. అవును సెట్ కాలేదు అని వర్షిణి చెప్పింది. ఎవరికి ఎవరు సెట్ కాలేదు అని అలీ అడగడంతో ఇద్దరికీ సెట్ కాలేదు అంటూ బ్రేకప్ గురించి చెప్పేసింది.
Recommended Video

హైపర్ ఆది ఆత్రుత..
అలా వర్షిణి చెబుతుండగా.. మరి సెట్ అయ్యేవాళ్లను చూసుకోవాలి అంటూ తనవైపుకు వేలు చూపించుకున్నాడు. అది చూసిన అలీ.. వర్షిణి అంటే ఇంట్రెస్ట్ ఉందా? అని ఆదిని అడిగేశాడు. వర్షిణికి ఏంటండి అందంగా ఉందని ఆది అనడంతో వర్షిణి నవ్వేసింది. ప్రోమోలోనో ఇంత విషయం ఉంటే పూర్తి ఎపిసోడ్‌లో ఇంకెన్ని విశేషాలు బయటపడతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











