హైపర్ ఆది అక్కడ చాలా రొమాంటిక్.. అసలు గుట్టు విప్పిన యాంకర్ వర్షిణి

ఈ మధ్య కాలంలో బుల్లితెరపై యాంకర్స్ మధ్య కెమిస్ట్రీ గట్టిగానే వర్కౌట్ అవుతోంది. నిజమా అబద్దామా అనేది పక్కన పెడితే జనాలు మాత్రం ఎన్ని సార్లు వాళ్ళ రొమాన్స్ చేసినా బోర్ గా ఫీల్ అవ్వడం లేదు. ఇక హైపర్ ఆది, వర్షిణిల రొమాంటిక్ డోస్ రోజురోజుకి మరింత ఎక్కువవుతోంది. అయినప్పటికీ బజ్ తగ్గడం లేదు. ఇక రీసెంట్ గా జబర్దస్త్ కి వచ్చిన వర్షిణి దాదాపు ఆది పరువు తీసేంత పని చేసింది. వారి పంచ్ లకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతోంది.

 ఆది..రొమాంటిక్ బాయ్ గా

ఆది..రొమాంటిక్ బాయ్ గా

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా క్లిక్కయిన హైపర్ ఆది ఎన్ని షోలు మారినా కూడా జబర్దస్త్ ని వదలడం లేదు. ఆ మధ్య మానేస్తున్నారు అని టాక్ వచ్చింది. అంతకుముందు కాస్త బ్రేక్ కూడా ఇచ్చాడు. ఇక ఈ మధ్య కాలంలో రొమాంటిక్ బాయ్ గా దర్శనమిస్తున్నాడు. మెయిన్ గా అతను వర్షిణితో చేస్తున్న చేష్టలు బాగా వైరల్ అవుతున్నాయి.

 కెమిస్ట్రీలో ఏ మాత్రం మార్పు రాలేదు

కెమిస్ట్రీలో ఏ మాత్రం మార్పు రాలేదు

లాక్ డౌన్ తరువాత ఢీ షో మళ్ళీ స్టార్ట్ కావడంతో ఆది, వర్షిణి కెమిస్ట్రీతోలో ఏ మాత్రం మార్పు రాలేదు. షోలకు టీఆర్పీని పెంచడంలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక రీసెంట్ గా జబర్దస్త్ కి వచ్చిన వర్షిణి అవకాశం దొరికిందని మునుపెన్నడు చేయని పర్ఫెమెన్స్ తో ఆదికి ఒక విధంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

ఆదితో అదిరిపోయే స్టెప్పులు

ఆదితో అదిరిపోయే స్టెప్పులు

తోలి ప్రేమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో హైపర్ ఆది స్కిట్ లోకి ఎంట్రీ ఇచ్చిన వర్షిణి ఆ తరువాత పెళ్లి కళ వచ్చేసిందే బాలా.. అంటూ ఆదితో అదిరిపోయే స్టెప్పులు వేసింది. అనంతరం స్కిట్ లో భాగంగా.. నీ అంజలా జవేరీ నేనే, నీ ప్రీతి నేనే, నీ సదా నేనే అంటూ.. దీన్నే మల్టీ హీరోయిన్ పర్సనాలిటి అంటారని వివరణ ఇచ్చింది.

 రొమాంటిక్ గానే ఉంటావు గా..

రొమాంటిక్ గానే ఉంటావు గా..

వెంటనే ఆది కలుగజేసుకొని.. కాదు కాదు మల్టీ డిజాస్టర్ పర్సనాలిటి అంటారు. వెళ్లి చూయించుకో అనగానే.. వర్షిణి షాక్ అవుతుంది. అక్కడ రొమాంటిక్ గానే ఉంటావు గా ఇక్కడేంటి ఇలా ఉన్నావు అని వర్షిణి చేసిన కామెంట్స్ కి ఆది హడలిపోయి.. అక్కడ అంటే ఢీ అని క్లియర్ గా చెప్పు లేకపోతే వాళ్ళు ఎక్కడెక్కడో అనుకుంటారని క్లారిటీ ఇచ్చాడు.

Recommended Video

Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
నువ్వు పక్కకు వేళ్లు రా

నువ్వు పక్కకు వేళ్లు రా

ఆ తరువాత స్కిట్ లో మరికొన్ని డైలాగ్స్ తో ఆకట్టుకున్న వర్షిణి హైపర్ ఆది వేసిన పంచ్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తన పక్కన నిలబడాలి అంటే ఒక రేంజ్ ఉండాలి రా..! అని ఆది అనగానే.. 'నువ్వు పక్కకు వేళ్లు రా' అని వర్షిణి ఊహించని విదంగా కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి ప్రోమోలోనే ఆది, వర్షిణిల రచ్చ ఒక రేంజ్ లో క్లిక్కయ్యింది. మరి ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X