పార్టీకి పిలిచిన హాట్ యాంకర్.. ఇరగదీసిన హైపర్ ఆది.. మామూలుగా లేదే యవ్వారం!
బుల్లితెరపై జబర్దస్త్ షో, అందులో హైపర్ ఆది, యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరు చేసే హంగామా అంతా ఇంతా కాదు. జబర్దస్త్ షోలో నవ్వుల పూలు పూయిస్తాడు హైపర్ ఆది. తన పంచ్‌లతో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు. ఢీ షో ద్వారా ఫేమస్ అయింది వర్షిణి. ఆమె చేసి చేష్టలు, చెప్పే కుళ్లు జోకులు బాగానే పేలుతాయి. అందం, అమాయకత్వం ఉన్న వర్షిణికి సపరేట్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా వీరిద్దరు కలిసి రెచ్చిపోయారు. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

స్టెప్పులతో ఫేమస్..
హైపర్ ఆది తన స్కిట్స్‌లో ఇచ్చే ఎంట్రీ గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవి సిగ్నేచర్ స్టెప్పులు, పవన్ కళ్యాణ్ స్టెప్పులు ఇలా ట్రెండీగా మారే స్టెప్పులు వేస్తూ ఓ రేంజ్‌లో ఎంట్రీ ఇస్తాడు. అప్పుడప్పుడు స్పెషల్ సెలెబ్రిటీతో హైపర్ ఆది వేసే స్టెప్పులు, చేసే రొమాన్స్ హాట్ టాపిక్ అవుతుంటాయి.

ప్రతీ పండుగకు ఓ స్పెషల్ ప్రోగ్రామ్..
మల్లెమాల ప్రతీ పండగకు ఓ స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఉగాది అదిరిపోయే కార్యక్రమంతో రాబోతోంది. పండగ సార్ పండగ అంతే.. అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో కాసేపటి క్రితమే విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

రోజా-శేఖర్ మాష్టర్‌ల రొమాన్స్..
రోజా గ్రేస్, శేఖర్ మాష్టర్ స్టైలీష్ స్టెప్పుల గురించి ఏం చెప్పగలం. ఇద్దరు కలిసి ఓ పాటకు అదీ సామజవరగమన లాంటి క్లాస్ పాటకు కాలు కదిపితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రోమోలో వీరిద్దరి రొమాన్స్ అదిరిపోయింది.
Recommended Video


రెచ్చిపోయిన హైపర్ ఆది..
ఆజ్ మేరీ రాత్ పార్టీ హై.. తూ ఆజానా అంటూ వర్షిణి తమన్నా లుక్‌లో రాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబులా హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. డాంగ్ డాంగ్ అనే పాటకు వీరిద్దరు ఓ రేంజ్‌లో రెచ్చిపోయి స్టెప్పులు వేశారు. ఇక ఈ ఈవెంట్ సూపర్ డూపర్ హిట్ అయ్యేలానే కనిపిస్తోంది. మీరూ ఆ ప్రోమోపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











