ఆ షో కోసం డోస్ పెంచేసిన వర్షిణి.. మొత్తానికి దుమ్ములేపేందుకు అంతా రెడీ

ప్రస్తుతం వర్షిణికి బుల్లితెరపై మిగిలిన ఒకే ఒక్క అవకాశం కామెడీ స్టార్స్. మొత్తానికి వర్షిణికి మల్లెమాల టీంకు ఏదో జరిగింది. ఆ విషయాలేవీ అంత సులువుగా బయటకు రావు. కానీ ఏదో జరిగింది.. అందుకే బయటకు వచ్చింది లేదా బయటకు పంపించడం జరిగి ఉంటుంది. అలా మొత్తంగా వర్షిణి ఈటీవీకి దూరంగా ఉంది. అయితే ఇలాంటి సమయంలోనే వర్షిణికి తన సత్తాను చూపించేందుకు సరైన అవకాశం వచ్చింది.

అలా ఫేమస్..

అలా ఫేమస్..

వర్షిణి బుల్లితెరపై కంటే వెబ్ సిరీస్‌తో బాగా ఫేమస్. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో వర్షిణి అందరికీ దగ్గరైంది. ఆ తరువాతే బుల్లితెరపై వర్ణిణి పరిచయమైంది. అలా మెల్లిమెల్లిగా బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఒకప్పుడు బుల్లితెరపై వర్షిణి ఎంతో బిజీగా ఉండేది.

 ఆ రెండు షోలతో..

ఆ రెండు షోలతో..

వర్షిణి ముఖ్యంగా ఢీ షోతో మరింత దగ్గరైంది. పటాస్, ఢీ షోలు వర్షిణికి స్టార్ స్టేటస్‌ను తీసుకొచ్చాయి. ఢీ షోలో హైపర్ ఆదితో వర్షిణి నడిపిన కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో క్లిక్. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ యూట్యూబ్‌లో రచ్చ రచ్చ జరిగింది. ప్రేమ, పెళ్లి అంటూ రకరకాల వార్తలు రాసేశారు.

 అందులోంచి బయటకు..

అందులోంచి బయటకు..

అలా ఢీ షోలో మంచి ఫాంలో ఉన్న వర్షిణిని మల్లెమాల టీం బయటకు పంపిచింది. కారణాలు ఏంటో తెలియదు గానీ వర్షిణి స్థానంలో దీపిక పిల్లి అనే టిక్ టాక్ అమ్మాయిని పట్టుకొచ్చారు. కానీ ఇంత వరకు ఆమె తనది తాను నిరూపించుకోలేకపోయింది. కానీ వర్షిణి మాత్రం మరో షోతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.

అందరికీ ఆధారం..

అందరికీ ఆధారం..

వర్షిణి ఢీ నుంచి బయటకు వస్తే.. అవినాష్ జబర్దస్త్ నుంచి వచ్చాడు.. చమ్మక్ చంద్ర మిగతా వారంతా కూడా అదిరింది షో ఎత్తేయడం వల్ల వచ్చారు. ఇలా అందరికీ కామెడీ స్టార్స్ పెద్ద అవకాశాన్ని కల్పించింది. స్టార్ మా ఆధ్వర్యంలో కామెడీ స్టార్స్ గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది.

Recommended Video

Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
డోస్ పెంచిన వర్షిణి..

డోస్ పెంచిన వర్షిణి..

కామెడీ స్టార్స్ షో జనవరి 31న గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 1 30 గంటలకు ప్రారంభం కాబోతోన్న ఈ షో ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో వర్షిణి రెచ్చిపోయి డ్యాన్సులు వేసింది. పైగా కంటెస్టెంట్లు వేసే జోకులకు పడి పడి నవ్వేసింది. మొత్తానికి ఈ షోలో కామెడీతో పాటు మంచి డ్యాన్స్ మూమెంట్స్‌తోనూ అట్రాక్ట్ చేయాలని చూస్తోన్నట్టుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X