బిగ్‌బాస్ 4 అప్‌డేట్.. నెటిజన్ల ప్రశ్నకు సమాధానంగా.. యాంకర్ వర్షిణి క్లారిటీ

బిగ్‌బాస్ షో గురించి అందరికీ తెలిసిందే. కొంతమంది సెలెబ్రిటీలనూ ఒకే ఇంట్లో పెట్టి, రకరకాల టాస్కులు ఇచ్చి వారిలోని నిజమైన వ్యక్తులను, మనస్తత్వాలను బయటకు తెచ్చే రియాల్టీ షోయే బిగ్‌బాస్. ఇక ఈ షోలో గొడవ, ప్రేమ, స్నేహం, ద్వేషం వంటి ఎమోషన్లకు కొదవే ఉండదు. ఎప్పుడు ఎవరి మధ్య స్నేహం చిగురిస్తుందో.. కోపం ఉగ్రరూపం దాల్చుతుందో చెప్పలేం.

అలాంటి బిగ్‌బాస్ షో తెలుగులో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నాల్గో సీజన్‌కు సంబంధించిన పనులు మొదలయ్యాయని, కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో యాంకర్ వర్షిణి పేరు కూడా వచ్చింది. తాజాగా దీనిపై ఆమె ఓ క్లారిటీ ఇచ్చింది.

సక్సెస్‌ఫుల్ షో..

సక్సెస్‌ఫుల్ షో..

బిగ్‌బాస్ అనేది అన్ని ప్రాంతీయ భాషల్లో సక్సెస్ అయింది. అదే విధంగాతెలుగులో ఈ కార్యక్రమానికి విపరీతమైన స్పందన వచ్చింది. కంటెస్టెంట్ల పేరిట అభిమాన సంఘాలు, సోషల్ మీడియాలో వార్, డిబెట్స్ ఇలా దాదాపు ఓ వంద రోజుల అంతా హడావిడిగా ఉంటుంది. ఇప్పటివరకు చేసిన ఈ మూడు సీజన్స్ ఒకదాని మించి మరొకటి సక్సెస్ అయింది.

Recommended Video

Bigg Boss 4 Telugu : Famous Singer Mangli Signed For Bigg Boss 4 Season
 మూడు సీజన్స్ ముగ్గురు హోస్ట్‌లు..

మూడు సీజన్స్ ముగ్గురు హోస్ట్‌లు..

మన తెలుగులో మాత్రమే సీజన్ సీజన్‌కు హోస్ట్‌లు మారుతూ వచ్చారు. పక్క భాషల్లోని బిగ్‌బాస్ షోలో మాత్రం ఒకే ఒక హోస్ట్ ఉంటారు. తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చా సుదీప్, కేరళలో మోహన్ లాల్ ఇక హిందీ గురించి ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్ అని చెప్పాల్సిన పనే లేదు. మన దగ్గర మాత్రం మొదటి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని, మూడో సీజన్‌కు నాగార్జున అంటూ ఇలా మారుతూ వచ్చారు.

కంటెస్టెంట్ల లిస్ట్ లీక్..

కంటెస్టెంట్ల లిస్ట్ లీక్..

ఈసారి మాత్రం హోస్ట్‌లో ఎలాంటి మార్పు కనిపించే అవకాశం లేదు. నాల్గో సీజన్‌కు నాగార్జునయే హోస్ట్ అని ఫిక్స్ అయిపోయింది. ఇక నాల్గో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనంటూ కొందరి పేర్లు మాత్రం తెగ వైరల్ అయిపోతున్నాయి. హీరో తరుణ్, యాంకర్ శివ, వర్షిణి, సింగర్ మంగ్లీ, సింగర్ హేమచంద్ర అంటూ ఇలా కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి.

క్లారిటీ ఇచ్చిన వర్షిణి..

క్లారిటీ ఇచ్చిన వర్షిణి..

తాజాగా వర్షిణి తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉండగా బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. మీరు బిగ్‌బాస్‌కు వెళ్లకండి ఓ ఫ్యాన్ సలహా ఇవ్వగా.. కళ్లు అటు ఇటు తిప్పుతూ ఆశ్చర్యకరంగా చూసింది. మరో నెటిజన్.. మీరు బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్తున్నారా? అని ప్రశ్నిస్తే అడ్డంగా తల ఊపింది. దీంతో వర్షిణి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడం లేదని విషయంపై ఓ క్లారిటీ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X