వరుణ్ సందేశ్ వితికా సందేశ్ రొమాన్స్.. తట్టుకోలేకపోయిన యాంకర్ సుమ
వరుణ్ సందేశ్ వితికా షెరు జంట చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ మూడో సీజన్‌లో వరుణ్ సందేశ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ తెలుగులో మొదటి సారిగా ఇలా భార్యభర్తలను తీసుకున్నారు. అలా వరుణ్ సందేశ్ వితిక షెరు కలిసి ఆటలో పాల్గొన్నారు. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా గొడవలు లేకుండా కలిసే ఉన్నారు. మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అవన్నీ క్షణంలో మాయమయ్యాయి.

రొమాన్స్ కూడా..
ఇక వరుణ్ సందేశ్ వితిక షెరులు తమ రొమాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. టాస్కలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు ఎలా గొడవలు పెట్టుకున్నా కూడా తమ లోకం తమదే అన్నట్టుగా ఉండేవారు. ఇద్దరి మధ్య కొన్ని గొడవలు వచ్చేలా బిగ్ బాస్ టీం ప్లాన్ చేసింది. కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు.

ముందు ఆమె..
అయితే బిగ్ బాస్ ఆటలో చివరి వరకు వరుణ్ సందేశ్ నిలిచాడు. వితిక షెరు మధ్యలోనే ఎలిమినేట్ అయింది. వితిక షెరు ఉన్నంత కాలం వరుణ్‌కు అన్ని పనులు చేసి పెట్టింది. ఇంట్లో ఉన్నట్టుగా భార్యగా అన్ని సేవలు చేసింది. ఎంతో ప్రేమను చూపించింది. అలా వితిక షెరు ఎలిమినేట్ అవ్వడంతో వరుణ్ సందేశ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.

బయటకు వచ్చాక అలా..
వరుణ్ సందేశ్ వితిక షెరులు బయటకు వచ్చాక వారి ఫాలోయింగ్ , క్రేజ్ చూసి షాక్ అయ్యారు. అయితే అలా బిగ్ బాస్ వల్ల వరుణ్ సందేశ్‌కు వచ్చిన క్రేజ్ సినిమా ఆఫర్లు తీసుకురాలేకపోయింది. బుల్లితెరపై మాత్రంఈ ఇద్దరికి మంచి ఫాలోయింగ్ పెరిగింది.

అందుకే అలా..
అందుకే తాజాగా సుమ హోస్ట్‌గా వస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అనే షోలో వరుణ్ సందేశ్ వితిక షెరు గెస్ట్‌లు వచ్చారు. వస్తూనే రొమాన్స్‌లో మునిగి తేలారు. దాన్ని చూసిన సుమ దెబ్బకు షాక్ అయింది. ఈ ఇద్దరూ ఎవ్వరినీ పట్టించుకోవడం లేదుగా అంటూ సుమ కౌంటర్ వేస్తే.. కొత్త జంట అలానే ఉంటుంది.. మీ కంటే ఎప్పుడో పెళ్లి అయింది కదా అంటూ యాంకర్ రవి రివర్స్ కౌంటర్ వేశాడు.


Click it and Unblock the Notifications











