వెరీ ఇంట్రెస్టింగ్: బిగ్ బాస్‌లోకి వరుణ్ సందేశ్ గర్ల్‌ ఫ్రెండ్.. వితిక ముందు ఆమెతో ఎలా.!

Recommended Video

Bigg Boss 3 Telugu : Shraddha Das Wild Card Entry Confirmed ! || Filmibeat Telugu

బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో రొమాన్స్, లవ్, ఏడుపులు సహా పలు ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా ఈ షో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

వైల్డ్ కార్డ్ ఎంట్రీ

వైల్డ్ కార్డ్ ఎంట్రీ

బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే విధానం ఉంటుందన్న విషయం తెలిసిందే. గత రెండు సీజన్లలో ఇద్దరేసి సభ్యులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షో మధ్యలో ఇంటిలోకి ప్రవేశించారు. ఈ సీజన్‌లో కూడా మొదటి వారం పూర్తయిన తర్వాతనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఫస్ట్ వీక్‌లో సీనియర్ నటి హేమ ఎలిమినేట్ అవగా.. అదే రోజు ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఇంటిలోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే.

 మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా...

మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా...

ఎంతో రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ - 3లో శనివారంతో ఆరు వారాలు ముగుస్తాయి. ఇప్పటికే హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషు రెడ్డి ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం కూడా మరొకరు వెళ్లిపోతారు. ముగ్గురు సభ్యులు ఈ వారం ఎలిమినేట్ అవడానికి నామినేట్ అయ్యారు. వారిలో ఎవరు వెళ్తారో తెలియదు కానీ, ఈ వారం ఒకరిని వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి పంపించబోతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

 ఆమెనే ఫైనల్ చేశారట

ఆమెనే ఫైనల్ చేశారట

ఇక, ఈ వారం తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో వరుణ్ సందేశ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌నే ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈమె కొద్దిరోజులుగా సినిమా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే గ్లామర్ షో కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.

వరుణ్ సందేశ్ లవర్

వరుణ్ సందేశ్ లవర్

వరుణ్ సందేశ్ తనతో నటించిన హీరోయిన్‌ మధ్య ఎఫైర్ నడిచినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2010 ఏడాదిలో వచ్చిన ‘మరో చరిత్ర' అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే వరుణ్ - సదరు హీరోయిన్ మధ్య ప్రేమ పుట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ జంట ఒకానొక సందర్భంలో కలిసి తిరుగుతూ మీడియా కంట పడింది. ఇవి ఆ సమయంలో ఎంతో హైలైట్ అయ్యాయి కూడా. ఈ పుకార్ల తర్వాత వరుణ్ సందేశ్ కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదురయ్యాయి.

ఆమె కూడా ఒప్పుకుంది

ఆమె కూడా ఒప్పుకుంది

ఇదే విషయంపై వరుణ్ సందేశ్ చాలా సార్లు మీడియాకు క్లారిటీ ఇచ్చాడు. తమ మధ్య ఏమీ లేదని ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. అందరి లాగే ఆ హీరోియన్ కూడా తనతో నటించిన కో స్టార్ మాత్రమేనని అయితే, ఆమె తనకు మంచి ఫ్రెండ్ అని వివరించాడు. అయితే, సదరు నటి మాత్రం దీనికి భిన్నంగా స్పందించడం విశేషం. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వరుణ్ నేను ప్రేమించుకున్న విషయం నిజమే. కానీ, అది ముగిసిన అద్యాయం' అని ఆమె వెల్లడించింది.

 వితిక ముందు ఎలా?

వితిక ముందు ఎలా?

ఒకవేళ ఆ హీరోయిన్ బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తే.. వరుణ్ సందేశ్‌కు ఇబ్బందులు ఉంటాయని అప్పుడే ఓ చర్చ తెరపైకి వచ్చింది. హౌస్‌లో తన భార్యతో కలిసి ఉంటున్న వరుణ్.. ఆ హీరోయిన్ ఎంటరైతే ఎలా డీల్ చేయగలుగుతాడనేదే ఆ చర్చ ప్రధానాంశం. గతంలో అలీతో జరిగిన ఓ షోలో వితిక.. తన భర్తపై వచ్చిన వార్తలన్నీ తెలుసని చెప్పింది. అంటే ఆమెకు ఆ నటి గురించి కూడా తెలిసే ఉంటుంది. సో.. ఆమె వస్తే ఇప్పటి వరకు జెన్యూన్‌గా ఆడుతున్న వరుణ్‌లో మార్పు రవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X