భార్యపై కోప్పడిన వరుణ్ సందేశ్.. వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన వితిక

ఎన్నో వివాదాల నడుమ 'బిగ్ బాస్' సీజన్ - 3 ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షో మొదలైన వారంలోనే ఎన్నో గొడవలు, ఏడ్పులు, రాజకీయాలు కనిపించాయి. ఇక రెండో వారం ప్రారంభమైన మొదటి రోజు నాటకీయ పరిణామాల మధ్య ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. ఇక, మంగళవారం ఆసక్తికర పరిణామాలు జరగనున్నాయని ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోల్లో స్పష్టమైంది.

సోమవారం ఎపిసోడ్ ముగింపు సమయంలో ఇచ్చిన ప్రోమోలో.. 'బిగ్ బాస్' హౌస్‌లోని కంటెస్టెంట్లకు ఊహించిన షాక్ ఇచ్చాడు. మంగళవారం నుంచి వాటర్, రేషన్ కట్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్ అందరూ అవాక్కైపోయారు. అంతేకాదు, వరుణ్ సందేశ్ ఒకింత ఆగ్రహంతో కెమెరా వైపు చూడడం కనిపించింది.

Varun Sandesh is angry on his wife at Bigg Boss House

వాటిని కట్ చేసినప్పటికీ తిరిగి పొందేందుకు కంటెస్టెంట్‌లు అందరికీ 'బిగ్ బాస్' ఓ ఛాన్స్ ఇచ్చాడు. ఒకవేళ మళ్లీ వాటిని పునరుద్దరించాలంటే.. ఎవరైన ఇద్దరు కంటెస్టెంట్లు జిమ్ ఏరియాలో ఉన్న సైకిళ్లను ఆగకుండా తొక్కుతూనే ఉండాలన్న కండీషన్ పెట్టాడు. తమ నుంచి ఆదేశం వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగాలని చెప్పాడు.

దీంతో వరుణ్ సందేశ్, శివ జ్యోతి సైకిల్ తొక్కుతున్నట్లు ఉన్న ఓ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. అయితే, తాజాగా మరో ప్రోమో వచ్చింది. ఇందులో పునర్నవికి వితికకు మధ్య వాదన జరగడం చూపించారు. దీంతో వరుణ్ సందేశ్ కలుగజేసుకుని తన భార్యపై కోప్పడ్డాడు. దీంతో వితిక వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఆమె వాష్ రూమ్‌ల వైపు వెళ్తుండగా.. ఆమె వెనుక రవి కృష్ణ ఆమె వెనుకే వెళ్లడం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X