Don't Miss!
- News Bridge Collapse: కూలిన నిర్మాణంలోని వంతెన.. తప్పిన ప్రమాదం..
- Finance Stock To Buy: రూ.90కి చేరుకోకున్న రూ.35 స్టాక్.. కారణం ముఖేష్ అంబానీనే తెలుసా..??
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Sports హార్దిక్ వద్దు.. రోహిత్ తర్వాత అతనే భారత్ కెప్టెన్- హర్భజన్
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్‌లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
వితికా కాకుంటే ఇలియానాతో.. వరుణ్ సందేశ్ హాట్ కామెంట్స్
బిగ్‌బాస్ హౌస్‌లో వరుణ్, వితికా ఎంత సందడి చేశారో అందరికీ తెలిసిందే. వీరి వల్ల ఎన్ని గొడవలు వచ్చాయో.. వీరి మధ్యే ఎన్ని గొడవలు వచ్చాయో తెలుగు ప్రేక్షకులందరూ గమనించారు. మొట్టమొదటి సారిగా తెలుగు నాట భార్యభర్తలిద్దరూ బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేయడంతో అందరిలోనూ ఆసక్తిని రేకేత్తించింది. వీరి ప్రయాణం కూడా అంతే అందంగా సాగి చివరి వరకు షోలో ఉన్నారు.
ఫుల్ ఫాలోయింగ్..
బిగ్‌బాస్ షో ఎవరికి ఎలాంటి ఫేమ్, నేమ్ తీసుకొస్తుందో చెప్పలేము. భార్యా భర్తలుగా వెళ్లిన వితికా, వరుణ్‌లకు కూడా భిన్నంగా పేరును తీసుకొచ్చింది. మంచి వాడు, నిజాయితీ గల వ్యక్తిగా వరుణ్‌కు పేరు వస్తే.. కాస్త కన్నింగ్ అని వితికాకు ట్యాగ్ వచ్చింది. ఇలా ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన ఫేమ్ వచ్చింది. అయితే బయటకు వచ్చిన వీరిద్దరికి మాత్రం ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది.
గ్యాంగ్‌కు క్రేజ్..
బిగ్‌బాస్ షోలో ఉన్నంత సేపు వరుణ్, వితికా, పునర్నవి, రాహుల్ ఎంత బాగా ఉన్నారు.. బయటకు వచ్చాక కూడా ఎంత క్లోజ్‌గా ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నలుగురి ఫ్రెండ్షిప్ ఈ మూడో సీజన్‌కు బాగా ప్లస్ అయింది. ఈ బ్యాచ్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
పార్టీలు, వెకేషన్స్ అంటూ ఎంజాయ్..
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వితికా, వరుణ్‌లు పార్టీలు, వెకేషన్లు అంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట శ్రీలంకలో పర్యటిస్తోంది. వితికా పుట్టిన రోజును వరుణ్ అక్కడ ఘనంగా సెలెబ్రేట్ చేశాడు. వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి.
ఇలియానా అంటే..
తాజాగా ఈ జంట అలీ హోస్ట్‌గా నిర్వహించో ఓ షోలో పాల్గొని అనేక విషయాలను వెల్లడించారు. వితికా కాకుండా వేరే ఏ హీరోయిన్ను పెళ్లి చేసుకునేవాడివి? అంటూ వరుణ్‌ను అడగ్గా.. ఇలియానా అని చెప్పేశాడు. హౌస్‌లో ఇష్టమైన వారు ఎవరని వితికాను అడగ్గా.. పునర్నవి అని టక్కున చెప్పేసింది. అయితే ఇష్టం లేని వారు ఎవరంటే మాత్రం దీర్ఘంగా ఆలోచించసాగింది. ఇంకా వీరిద్దరు సరదగా ఎన్నో విషయాలను పంచుకున్నారు. వీటికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.