For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్‌బాస్‌‌లో వరుణ్ తేజ్ రచ్చ.. పున్ను, శ్రీముఖి, హిమజకు పంచులు, ఎవరు ఎలిమినేటో తెలుసా?

|

తొమ్మిది వారాలు గడిచిన బిగ్ బాస్ షో.. నిన్నటి ఎపిసోడ్లో అందరికీ షాక్ ఇచ్చాడు. డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి హౌస్ మేట్స్ కు షాక్ కు గురి చేశాడు. తీరా రాహుల్ ఎలిమినేట్ అయినట్లు హౌస్ మేట్స్ ను నమ్మించాడు. రాహుల్ ది ఫేక్ ఎలిమినేషన్ అని నాగార్జున ప్రకటించి.. ప్రేక్షకులకు మరో ట్విస్ట్ ఇచ్చాడు. కాగా గద్దలకొండ గణేష్ ప్రమోషన్ కోసం హీరో వరుణ్ తేజ్ ఇంటి వేదికపై దర్శనమిచ్చాడు. హిమజ, పునర్నవి, శివజ్యోతి, శ్రీముఖిని తన మాటలతో

కన్నీటిని ఆపుకున్న పన్ను..

కన్నీటిని ఆపుకున్న పన్ను..

రాహుల్ ఎలిమినాటే అయ్యాడని నాగ్ ప్రకటించిన తరువాత అందరూ షాక్ అయ్యారు. ఇక పన్ను పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. తన వల్లే ఎలిమినేట్ అయ్యాడని తెగ ఫీల్ అయింది. రాహుల్ ఎలిమినేట్ కాడంటూ.. తన గట్టి నమ్మకం అంటూ చెప్పుకొచ్చింది. కానీ తీరా రాహుల్ ఎలిమినేట్ అయ్యాడని నాగ్ ప్రకటించాడు.

నేను ఇక ఎవరితో గొడవ పడాలి.. ఎవర్ని తిట్టాలి..

నేను ఇక ఎవరితో గొడవ పడాలి.. ఎవర్ని తిట్టాలి..

రాహుల్ ను బయటకు పంపించి వచ్చిన తరువాత.. కన్నీటిని ఆపుకుంటూ లివింగ్ ఏరియా లో కూర్చున్న పన్ను ఫీల్ అవుతూ.. ఇక నేను ఎవరిని తిట్టాలి, ఎవరితో గొడవ పడాలి, వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్ అంటూ నాగ్ తో చెప్పుకొచ్చింది.

ఫేక్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్..

ఫేక్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్..

బయటకు వచ్చిన రాహుల్ తో ఇంటి సభ్యుల గురించి చెప్పమని ఓ టాస్క్ ఇచ్చాడు. ముప్పై మార్కులకు గానూ.. నిజాయితీ, స్నేహం, టాస్క్ లో పెర్ఫార్మన్స్ లను దృష్టిలో పెట్టుకుని అందరికి మార్కులు వెయ్యమన్నాడు. అందులో వరుణ్ కు అత్యధికంగా ముప్పై, శ్రీముఖికి అత్యల్పంగా 23 మార్కులు వేశాడు. టాస్క్ సరిగా చేయదని పన్ను కు 29 మార్కులు వేశాడు.

గజ గజ వణికించనున్న గద్దలకొండ గణేష్..

గద్దలకొండ గణేష్ గా ప్రేక్షకులను మెప్పించిన వరుణ్.. బిగ్ బాస్ స్టేజ్ పైన మెరవనున్నాడు. ఇక మరి గద్ధాలకొండ వచ్చాడంటే.. హౌస్ అంతా గజ గజ వనకాలిసిందేనని అభిమానులు అంటున్నారు. మరి హౌస్ మేట్స్ను వనికిస్తాడో ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.

హిమజ ఎలిమినేట్ అయిందంటూ వార్తలు..

హిమజ ఎలిమినేట్ అయిందంటూ వార్తలు..

డబుల్ ఎలిమినేషన్ అంటూ ఇంటి సభ్యులపై బాంబ్ వేసిన బిగ్ బాస్.. వారికి తెలియకుండా ఒక సర్ప్రైజ్ రెడీ చేశాడు. రాహుల్ ఎలిమినేట్ అయ్యాడని చెప్పి సీక్రెట్ రూంలోకి పంపించాడు. అయితే నేటి ఎపిసోడ్లో హిమజను ఇంటి నుంచి బయటకు పంపించడంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో హిమజ అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

శ్రీముఖి, పున్నుకు పంచ్ వేసిన వరుణ్

మనం హౌస్ లో ఉన్నామని నలుగురికి తెల్వకుంటే ఉండుడు ఎందుకు అంటూ సినిమా డైలాగ్ ను చెప్పి ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. పునర్నవికి, శ్రీముఖికి వరుణ్ పంచ్ వేయగా.. హిమజ తన ప్రాసతో వరుణ్ కు పంచ్ వేసింది. ఇక ఈరోజు గద్ధలకొండ గణేష్.. బిగ్ బాస్ హౌస్ లో మస్త్ సందడి చేసినట్టు కనిపిస్తోంది. మనం ఆ సందడిని చూడాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.

English summary
Bigg Boss 3 Telugu reality weekend show going with high energy. This weekend Varun Tej entered into house with Host Nagarjuna for Gaddalakonda Ganesh promotion. Latest elimination of Rahul Simpliganj given shock to television audience.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more