లాక్‌డౌన్‌లో వరుణ్ తేజ్ ఏం చేస్తున్నారో తెలుసా? నాగబాబు చెప్పిన విషయాలేమంటే
కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రముఖులు, సాధారణ ప్రజలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఇంటికే పరిమితయ్యారనేది కొత్త విషయం కాదు. కానీ లాక్‌డౌన్ సమయాన్ని ఎలా వినియోగించుకొంటున్నారనేది ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్‌గా మారింది. కుటుంబంతో గడపడానికి కలిసి వచ్చిన సమయాన్ని ఎంజాయ్ చేస్తూనే సినీ తారలు తమ ఫ్యూచర్ ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు.
రెండు రోజుల క్రితం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మెగా బ్రదర్ నాగబాబు తన కుమారుడు వరుణ్ తేజ్, తన ఫ్యామిలీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. లాక్‌డౌన్ విధించడంతో తను, నిహారిక, నా భార్య పద్మ ఇంటికే పరిమితమయ్యాం. కానీ వరుణ్ బాబు మాత్రం ఇంటి నుంచి లాక్‌డౌన్ విధించడానికి ముందు రోజే బయటకు వెళ్లారు అని చెప్పారు.

వరుణ్ తేజ్ తన సినిమాకు సంబంధించిన పనులు చూసుకొనేందుకు తన ఆఫీస్‌కు వెళ్లిపోయారు. తను నటించే చిత్రం బాక్సింగ్ నేపథ్యంగా సాగుతుంది. అందుకోసం వరుణ్ తేజ్ దేహాధారుడ్యాన్ని పెంచుకోవడానికి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. స్వయంగా ఓ కోచ్‌ను పెట్టుకొని శిక్షణ పొందుతున్నారు అని నాగబాబు అన్నారు.
వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా ఎమోషనల్ స్టోరితో వరుణ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











