తొలిసారి బుల్లితెరపై వరుణ్ తేజ్, లావణ్య రొమాంటిక్ మోడ్​.. ఫస్ట్ డేటింగ్ ట్రిప్ సీక్రెట్ రివీల్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి బ్యూటీ లావణ్య త్రిపాఠి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల పాత్ర సీక్రెట్​గా రిలేషన్​షిప్​ మెయిన్​టెయిన్ చేసిన ఈ జంట గతేడాది మెగా ఫ్యామిలీ సమక్షంలో ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు. అప్పటి నుండి ఈ జంటకు సంబంధించిన ప్రతి చిన్న విషయం వైరల్ అవుతూనే ఉంది.

అసలు ఈ జంట ఎప్పుడు తొలిసారి మీట్ అయ్యారు? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఇలా పలు విషయాలను ఒక్కోక్కటిగా బయటకొస్తున్నాయి. అయితే తాజాగా ఈ జంట తొలిసారి కలిసి బుల్లితెరపై సందడి చేశారు. ఇందులో భాగంగానే తమ లవ్ స్టోరీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారీ జంట. తమ ఫస్ట్ డేటింగ్ ట్రిప్​ ఎక్కడికి వెళ్లారో చెప్పారు. దాని గురించే ఈ కథనం..

Varun Tej Lavanya Tripathi on First Time TV Super Singer Show and Reveals Their First Holiday Trip Secret Full Details Here

వరుణ్ తేజ్​ - లావణ్య త్రిపాఠి ఇప్పుడీ జంటకు ఇండస్ట్రీలో పుల్ క్రేజ్ ఏర్పడింది. పెళ్లి తర్వాత వీరు చేసే ఏ పనైనా ఇట్టే సోషల్​ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం.. ఆ సినిమా ముగిసే సమయానికి ప్రేమగా మారింది. తొలిప్రేమ సినిమా స్టైల్​లో లావణ్యకు పువ్వుతో ప్రపోజ్ చేసి బుట్టలో పడేశారు వరుణ్. ఆ తర్వాత అంతరిక్షం సినిమా కలిసి నటించారు ఈ జంట. ఎంతో సైలెంట్​గా రిలేషన్​షిప్​ను మెయిన్​టెయిన్ చేశారు​. అయితే ఆ తర్వాత ఎట్టకేలకు మీడియాకు లీక్ అవ్వడంతో అందరికీ తెలిసింది. ఫైనల్​గా వీరిద్దరూ ఇటలీలో పెళ్లి బంధంతో ఒక్కటైపోయారు.

అయితే పెళ్లి తర్వాత వరుణ్ తేజ్​ తన సినిమా కోసం మీడియా ముందుకు వచ్చారు. కానీ లావణ్య కాస్త గ్యాప్ ఇచ్చి ఈ మధ్యే మిస్ పర్ఫెక్ట్ సిరీస్​ ప్రమోషన్​ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సిరీస్​ మంచి హిట్​ కూడా అందుకుంది. ఇకపోతే ఇప్పటి వరకు సిల్వర్​ స్క్రీన్​పై కలిసి సందడి చేసిన ఈ జంట తొలిసారి బుల్లితెరపై సందడి చేశారు. స్టార్​ మాలో ప్రసారం కానున్న సూపర్ సింగర్ బ్లాక్ బస్టర్ రౌండ్​కు గెస్ట్​లుగా హాజరై ఆడియెన్స్​ను అలరించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై నవ్వులు పూయించడంతో పాటు ఆకట్టుకుంటోంది.

ఇందులో వరుణ్ - లావణ్య తమ రిలేషన్​షిప్​ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్​ విషయాల గురించి బయటపెట్టారు. తామిద్దరు తొలిసారి కలిసినప్పుడు లావణ్య వేసుకున్న డ్రెస్ కలర్ బ్లూ అని చెప్పారు వరుణ్. తమ ఫస్ట్ హాలీడే ట్రిప్​లో​ థాయ్​లాండ్ వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఇక వరుణ్​కు ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ అంటే ఇష్టమని కూడా చెప్పింది లావణ్య. ఆద్యంతం నవ్వులుగా సాగిన ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఇక మరో ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ తన అత్త, వరుణ్ వాళ్ల అమ్మ తనను చాలా బాగా చూసుకుంటుందని, ప్రేమిస్తుందని చెప్పింది. వరుణ్ తాను వేరే కాపురం పెట్టారని వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. తామంతా కలిసే ఉంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X