వరుణ్ తేజ్ వర్జినా కాదా .. అబ్బాయి అడ్డాలో బాబాయ్, చేయకూడని పని చేస్తూ!
దగ్గుబాటి రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నెం 1 యారీ షో విజయవంతంగా సాగుతోంది. టాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ షోకి అతిథులుగా హాజరవుతూ సందడి చేస్తున్నారు. షో జరుగుతున్నంత సేపు చిన్న పిల్లలుగా మారిపోయి అల్లరి చేస్తున్నారు. నాగ చైతన్య, సమంత, నిఖిల్, స్వాతి తమన్నా ఇలా చాలా మంది సెలెబ్రిటీలు నెం 1 యారీ షోకు హాజరైన సంగతి తెలిసిందే. ఇలాంటి షోలో అబ్బాయి, బాబాయ్ కలసి కనిపిస్తే వినోదం రెట్టింపు అవుతుంది. రానా షోకు విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు. వెంకీతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా గెస్ట్ గా హాజరు కావడం విశేషం.

రచ్చ చేసిన వెంకీ
ఇద్దరు యువ హీరోలు వరుణ్, రానాతో కలసి వెంకీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వెంకీ తనదైన శైలిలో కామెడీ పంచులతో చెలరేగిపోయాడు. రానా కూడా బాబాయ్ వచ్చాడు కదా అని మొహమాట పడలేదు. అడగాల్సిన ప్రశ్నలు అడుగుతూ ఇద్దరినీ తికమక పెట్టాడు. కొన్ని ప్రశ్నలకు వరుణ్ తేజ్ సమాధానం చెప్పలేక పెద్దగా నవ్వేశాడు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

వర్జినా కాదా
వరుణ్ తేజ్ వర్జినా కాదా అని రానా అడగగా వెంకీ ఆశ్చర్యంతో ఏంట్రా ఇది అని అడిగాడు. వరుణ్ తేజ్ బిగ్గరగా నవ్వుతూ కనిపించాడు. రానా అడిగిన మరో ప్రశ్న కూడా వరుణ్ తేజ్ ని టార్గెట్ చేస్తూనే అడిగాడు. చేయకూడని పని చేస్తూ గర్ల్ ఫ్రెండ్ కు ఎప్పుడైనా దొరికిపోయావా అని రానా ప్రశ్నించాడు. ఇలాంటి సరదా ప్రశ్నలతో రానా వెంకీని, వరుణ్ ని బాగా ఇబ్బంది పెట్టేశాడు. ఇక వరుణ్ తేజ్ ఇంద్ర చిత్రంలోని మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ ని సరదాగా చెప్పాడు. వెంకటేష్ తులసి చిత్రంలోని డైలాగ్ చెప్పాడు.
ఎఫ్2 చిత్రంలో
ఎఫ్2 చిత్రంలో వరుణ్ తేజ్, వెంకీ కలసి నటిస్తున్నారు. క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. చాలా కాలం తరువాత వెంకీ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ చూస్తుంటే వెంకీ, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ కలసి చేసే కామెడీతో పొట్ట చెక్కలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాత.

సంక్రాంతికి వస్తున్నారు
నవ్వులు కురిపించే ఎఫ్2 చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి చిత్రాల్లో వినోదాత్మక అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చిత్రంతో అనిల్ రావిపూడి పూర్తిగా కామెడీపైనే దృష్టి పెట్టాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











