‘బిగ్ బాస్’ హౌస్‌లో వరుణ్ - వితిక రొమాన్స్.. కెమెరాకు కనిపిస్తున్నామంటూ...

Recommended Video

Varun Sandesh And Vithika Can't Controlling Their Feelings In Bigg Boss House ! || Filmibeat Telugu

'బిగ్ బాస్' ఎక్కడెక్కి నుంచో వచ్చిన పలువురు సెలెబ్రిటీలు.. వాళ్ల మధ్య మానసికంగా, శారీరకంగా జరిగే సంఘర్షణ. వంద రోజుల పాటు తమను, తమ క్యారెక్టర్‌ను కాపాడుకుంటూ వచ్చి, విజేత అవ్వాలనే తపన.. ఆ సమయంలోనే తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. అన్నీంటిని కళ్లకు కట్టినట్లు చూపించే షో. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. మూడో సీజన్ కూడా గత ఆదివారం ప్రారంభమైంది. ఈ షోలో మొదటి రెండు రోజులు చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి.

భార్య భర్తల ఎంట్రీ

భార్య భర్తల ఎంట్రీ

100 రోజుల పాటి నిర్విరామంగా జరగనున్న ‘బిగ్ బాస్' షోకు వరుణ్ సందేశ్ ఆయన భార్య వితిక షేరు ఒకేసారి అడుగు పెట్టారు. ప్రారంభోత్సవం రోజు మొదటి 13 మంది కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పిలిచిన హోస్ట్ నాగార్జున.. చివరి ఇద్దరు అంటే వరుణ్, వితికలను జంటగా ఆహ్వానించాడు. షో చరిత్రలోనే భార్యభర్తలు ఎంటర్ కావడం తొలిసారి అంటూ చెప్పుకొచ్చాడు.

లవ్ స్టోరీ చెప్పి.. కొత్తగా ఎంట్రీ

లవ్ స్టోరీ చెప్పి.. కొత్తగా ఎంట్రీ

స్టేజ్‌పై వీళ్ల ప్రేమకథను అడిగారు నాగార్జున. దీనికి వితిక సమాధానం చెప్పింది. ‘‘మేమే ఓ సినిమా షూటింగ్ సమయంలో కలిశాం. కానీ, ఇద్దరం మూడు నెలలు మాట్లాడుకోలేదు. కానీ, మలేషియా షెడ్యూల్ వెళ్లినప్పుడు ప్రపోస్ చేశాడు. పెళ్లి చేసుకునేటట్లు ఉంటేనే ప్రేమించుకుందాం అని చెప్పాను. తర్వాత ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకున్నాం'' అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత నాగ్‌కు హగ్ ఇచ్చి వెళ్లబోయారు. కానీ, ఆయన.. వితికను ఎత్తుకుని వెళ్లమని వరుణ్‌కు చెప్పాడు. దీంతో వరుణ్ ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు.

ఎక్కడ చూసినా కలిసే

ఎక్కడ చూసినా కలిసే

హౌస్‌లోకి ఎంటరైన తర్వాత వరుణ్ సందేశ్.. వితిక కలిసే ఉండడం కనిపిస్తోంది. ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవడం.. మధ్య మధ్యలో బాతాకానీలు పెట్టడం సరిపోతుంది. మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ ఒకటి.. మేమిద్దరం మాత్రమే ఒకటి అన్నంతగా ఈ జంట ఉంటోంది.

జంటగానే నిర్ణయాలు

జంటగానే నిర్ణయాలు

నామినేషన్ నుంచి బయట పడేందుకు ఈ ఇద్దరూ తమ బదులు ఎవరి పేర్లను చెప్పాలా అన్న విషయాన్ని కూడా రహస్యంగా మాట్లాడుకున్నారు. తన బదులు హిమజను నామినేట్ చేయాలని అనుకుంటున్నానని వితికా భర్తకు చెప్పింది. అయితే, ఆ అమ్మాయి మంచిదని వద్దని వరుణ్ సూచించాడు. ఇక, తనైతే డైలమాలో ఉన్నానని.. తనను తానే నామినేట్ చేసుకుంటానేమోనని భార్యతో చెప్పాడు. కానీ, వరుణ్.. పునర్నవిని నామినేట్ చేశాడు.

కౌగిలింతలు.. డబుల్ మీనింగ్ డైలాగులు

కౌగిలింతలు.. డబుల్ మీనింగ్ డైలాగులు

వితిక ఎలిమినేషన్‌ జోన్‌లోకి వెళ్లింది ఆ సమయంలో స్లీపింగ్ రూమ్‌లో ఓ బెడ్‌పై మహేష్ విట్ట పడుకున్నాడు. ఇక గదిలో ఎవ్వరూ లేరు. అప్పుడు ముచ్చట్లు పెట్టుకుని భార్యభర్తలు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకున్నారు. అంతేకాదు, ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. వీరి కౌగిలింతలు బిగ్ బాస్ కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి. అప్పుడు.. కెమెరా ఇటే చూస్తుంది అని వితిక అనడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X