twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా భార్యను పంపేయండి.. వరుణ్ - వితిక కాపురంలో చిచ్చు.. విడిపోవడం ఖాయమంటూ..

    |

    'బిగ్ బాస్' రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నప్పటికీ, మూడో సీజన్ మాత్రం బాగా వివాదాస్పదం అయింది. దీనికి కారణం ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. తీరా షో మొదలయ్యాక, కంటెస్టెంట్ల మధ్య గొడవలు చోటు చేసుకోవడం దీన్ని మరింత హైలైట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి.

    వరుణ్, వితిక స్పెషన్

    వరుణ్, వితిక స్పెషన్

    ఈ సీజన్ మొత్తానికి వరుణ్ సందేశ్, వితిక షేరు కొంచెం స్పెషలనే చెప్పాలి. దీనికి కారణం వీరిద్దరూ భార్యభర్తలు కావడమే. ‘బిగ్ బాస్' చరిత్రలోనే దంపతులను షోకు తీసుకొచ్చిన దాఖలలు లేవు. ఇప్పుడు వీళ్లిద్దరూ రావడంతో అందరి కళ్లు వీళ్ల పైనే ఉన్నాయి. హౌస్‌లోకి ఎంటరయ్యే సమయంలోనే వరుణ్.. వితికను ఎత్తుకుని తీసుకెళ్లడం మరింత హైలైట్ అయింది.

    హౌస్‌లో రొమాన్స్

    హౌస్‌లో రొమాన్స్

    హౌస్‌లోకి ఎంటరైన తర్వాత వరుణ్ సందేశ్.. వితిక కలిసే ఉండడం కనిపిస్తోంది. ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవడం.. మధ్య మధ్యలో బాతాకానీలు పెట్టడం సరిపోతుంది. మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ ఒకటి.. మేమిద్దరం మాత్రమే ఒకటి అన్నంతగా ఈ జంట ఉంటోంది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా కనిపించాయి.

    భార్య కోసం మహేశ్‌తో రచ్చ

    భార్య కోసం మహేశ్‌తో రచ్చ

    తన భార్యను మహేశ్ విట్టా ఏదో అన్నాడని వరుణ్ సందేశ్ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో ‘‘దమ్ముంటే నన్ను కొట్టు.. ఆడవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. సిగ్గు లేదు నీకు.. సిగ్గు లేనోడా'' అంటూ అతడు ఊగిపోయాడు. తర్వాత మహేశ్ సారీ చెప్పడంతో ఇది ముగిసిపోయింది.

    ఇప్పుడేమో భార్యతోనే గొడవ

    మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో వరుణ్.. వితిక మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. పునర్నవికి వితికకు మధ్య డిస్కర్షన్ జరుగుతున్న సమయంలో వరుణ్ తన భార్యకు వ్యతిరేకంగా మాట్లాడాడు. తనకు ఏది నిజమనిస్తే అటు వైపే ఉంటానని వరుణ్‌ తేల్చి చెప్పాడు. దీంతో వితిక కన్నీళ్లు పెట్టుకుంటూ పరిగెత్తింది.

     సారీ చెప్పిన వరుణ్

    సారీ చెప్పిన వరుణ్

    దీంతో హౌస్‌మేట్స్ అందరూ ఆమె దగ్గరకు వెళ్లి ఓదార్చారు. తర్వాత వరుణ్ కూడా వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఫైనల్‌గా వితిక చేతిలో చేయి వేసి క్షమించమని కోరడంతో కరిగిపోయిన వితికా కూడా వరుణ్‌కి సారీ చెప్పింది. మొత్తానికి వితికా- పునర్నవిల మధ్య మొదలైన గొడవ.. భార్యా భర్తల మధ్య రచ్చ రేపి సుఖాంతం అయ్యింది.

    ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్

    ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్

    మంగళవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను అంతకు ముందే విడుదల చేశారు. ఇందులోనే ఇద్దరూ గొడవ పడింది చూపించారు. దీంతో దాని కింద నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు. ‘నా పెళ్లాన్ని ఇంటికి పంపండి బిగ్ బాస్' అని వరుణ్ అనుకుంటున్నాడని ఒకరు అంటే.. ‘అరేయ్ బిగ్ బాస్.. వీళ్లకు విడాకులు ప్లాన్ చేస్తున్నావా' అంటూ మరొకరు కామెంట్ చేశారు. మరికొందరైతే వీళ్లిద్దరూ హౌస్‌లోనే ఉంటే నిజ జీవితంలోనూ విడిపోవడం ఖాయమంటూ సెటైర్లు వేస్తున్నారు.

    English summary
    Bigg Boss Telugu 3 has been launched on Sunday and the reality show is making noise right from day one. At The Same Time Romance Also Started By Varun Sandesh and Vithika Sheru. Now They started War In the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X